AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : విడాకులు తీసుకున్న మరో టాలీవుడ్ హీరో.. 17 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి.. ఇన్ స్టాలో పోస్ట్..

సినీరంగంలో ప్రేమ, పెళ్లి, విడాకులు ఇప్పుడు కామన్ అయ్యాయి. ఓవైపు పలువురు సెలబ్రెటీలు పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభిస్తున్నారు. మరోవైపు విడాకులు తీసుకున్నామంటూ ప్రకటిస్తున్నారు మరికొందరు తారలు. ఇప్పటికే తెలుగు, తమిళం, హిందీ భాషలలో చాలా మంది హీరోలు డివోర్స్ తీసుకోగా.. ఇప్పుడు మరో హీరో విడాకులు తీసుకున్నానంటూ పోస్ట్ చేశారు.

Tollywood : విడాకులు తీసుకున్న మరో టాలీవుడ్ హీరో.. 17 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి.. ఇన్ స్టాలో పోస్ట్..
Shiju
Rajitha Chanti
|

Updated on: Dec 18, 2025 | 1:57 PM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో హీరో విడాకులు తీసుకున్నారు. తెలుగు కమ్ మలయాళీ నటుడు షిజు ఏఆర్ తన భార్యతో డివోర్స్ తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన తన ఇన్ స్టాలో వెల్లడించారు. తామిద్దరం పరస్పర అంగీకారంతోనే విడిపోవాలని నిర్ణయించుకున్నామని.. తమకు అధికారికంగా విడాకులు మంజురయ్యాయని తెలిపారు. దంపతులుగా విడిపోయినా స్నేహితులుగా కొనసాగుతామని తెలిపారు. ప్రస్తుతం షిజు చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. మలయాళీ నటుడు షిజు ఏఆర్ తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితమే. తెలుగులో అనేక చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా దేవి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో కీలకపాత్రలలో నటించి మెప్పించాడు. ఇప్పటికీ సినిమాల్లో యాక్టివ్ గా ఉన్న షిజు ఏఆర్.. అనుహ్యంగా తన భార్యతో విడిపోయినట్లు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి : 11 సినిమాలు చేస్తే 10 బ్లాక్ బస్టర్ హిట్లే.. తెలుగులో తోపు హీరోయిన్..సైన్యంలో పనిచేసి ఉరి దాడిలో మరణించిన తండ్రి..

“ప్రీతి ప్రేమ్, నేను పరస్పర అంగీకారంతోనే విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మాకు అధికారికంగా విడాకులు మంజూరయ్యాయి. దంపతులుగా విడిపోయినా స్నేహితులుగానే కొనసాగుతున్నాం. మా వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించవద్దని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను. దయచేసి ఎటువంటి పుకార్లు సృష్టించకండి. ఇకపై మేము విడి విడిగా వ్యక్తిగత జీవితాన్ని గడుపుతాం” అంటూ తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి : Actress : కమిట్‌మెంట్ ఇవ్వలేదని 30 సినిమాల్లో నుంచి తీసేశారు.. హీరోయిన్ సంచలన కామెంట్స్..

ఇష్టమను నూరు వట్టం సినిమాతో మలయాళీ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టాడు షిజు ఏఆర్. కువైట్ లో 12వ తరగతి చదువుతున్న సమయంలోనే ఈ సినిమా చూసిన ప్రీతి హీరో షిజును ఇష్టపడింది. ఆ తర్వాత ఎయిర్ హోస్టెస్ గా జాబ్ చేస్తున్న సమయంలో హీరో షిజుతో అనుకోకుండా కలిసింది. అప్పుడు మొదలైన వీరిద్దరి పరిచయం తర్వాత ప్రేమగా మారింది. షిజు ముస్లిం.. ప్రీతి క్రిస్టియన్ కావడంతో వీరి పెళ్లికి పెద్దలు నిరాకరించారు. కానీ పెద్దలను కాదని 2008లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. వీరికి ఒక కూతురు ఉంది. ఇప్పుడు 17 ఏళ్ల వైవాహిక బంధానికి ఇద్దరూ ముగింపు పలికారు.

ఇవి కూడా చదవండి :  Megastar Chiranjeevi : చిరంజీవితో మూడు సినిమాల్లో ఛాన్స్.. ఆ కారణంతోనే చేయలేకపోయాను.. హీరోయిన్..