11 సినిమాలు చేస్తే 10 బ్లాక్ బస్టర్ హిట్లే.. తెలుగులో తోపు హీరోయిన్..సైన్యంలో పనిచేసి ఉరి దాడిలో మరణించిన తండ్రి..
2007లో జమ్మూ కాశ్మీర్‌లోని ఉరి వద్ద పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత్-పాకిస్తాన్ సరిహద్దు దాటకుండా పోరాడుతూ, వారిని అడ్డుకుంటూ ప్రాణాలు వదిలారు కల్నల్ వేణుగోపాల్. ఇప్పుడు ఆయన కూతురు సౌత్ ఇండస్ట్రీలో తోపు హీరోయిన్. దాదాపు 11 సినిమాలు చేస్తే 10 బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

పైన ఫోటోలో కనిపిస్తున్న చిన్నారిని గుర్తుపట్టారా.. ? ఆమె ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో తోపు హీరోయిన్. ఆమె తండ్రి భారత సైన్యంలో పనిచేసి ఉరి వద్ద పాకిస్తాన్ ఉగ్రవాదులతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. ఆ హీరోయిన్ పేరు రుక్మిణి వసంత్. ఆమె తండ్రి కల్నల్ వసంత్ వేణుగోపాల్ 2007లో జమ్మూ & కాశ్మీర్‌లోని ఉరిలో భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దు దాటకుండా ఉగ్రవాదులను అడ్డుకుంటూ తన ప్రాణాలను కోల్పోయారు. భారతదేశ అత్యున్నత శాంతికాల సైనిక పురస్కారం అశోక చక్రాన్ని అందుకున్న కర్ణాటకకు చెందిన మొదటి వ్యక్తి ఆయన. ఆమె తల్లి సుభాషిణి వసంత్ భరతనాట్య నృత్యకారిణి. యుద్ధంలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు మద్దతుగా ఆమె వీర్ రత్న అనే సంస్థను స్థాపించారు.
ఇవి కూడా చదవండి : Actress Vahini : అప్పుడు సీరియల్స్‌తో క్రేజ్.. క్యాన్సర్‌తో పోరాటం.. సాయం కోరుతూ పోస్ట్..
రుక్మిణి లండన్‌లోని ప్రతిష్టాత్మక రాయల్ అకాడమీ ఆఫ్ డ్రామాటిక్ ఆర్ట్ (RADA)లో శిక్షణ పొందింది. ఆ తర్వాత నెమ్మదిగా సినీరంగంలోకి అడుగుపెట్టింది. 2019 కన్నడ చిత్రం బీర్బల్ త్రయంలో నటించి సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆమె అద్భుతమైన నటన 2023లో రెండు భాగాల రొమాంటిక్ డ్రామా సప్త సాగరదాచే ఎల్లో సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాకు ఆమె ఉత్తమ నటిగా (కన్నడ) ఫిల్మ్‌ఫేర్ క్రిటిక్స్ అవార్డును అందుకుంది. అలాగే ఇటీవల విడుదలైన కాంతార చాప్టర్ 1 సైతం ఆమెకు పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇందులో యువరాణి కనకవతి పాత్రను పోషించింది.
ఇవి కూడా చదవండి : Tollywood : అలాంటి సీన్స్ చేయడానికి ఓకే.. కానీ లిప్ లాక్ అతడికి మాత్రమే.. టాలీవుడ్ హీరోయిన్..
రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ పాన్-ఇండియా చిత్రం భారీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 850 కోట్లకు పైగా వసూళ్లతో, కాంతారా ప్రీక్వెల్ ఈ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రంగా నిలిచింది. ప్రస్తుతం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న సినిమాలో రుక్మిణి నటిస్తుంది. అలాగే యష్ నటిస్తున్న టాక్సి్క్ చిత్రంలో నటిస్తుంది.
ఇవి కూడా చదవండి : Megastar Chiranjeevi : చిరంజీవితో మూడు సినిమాల్లో ఛాన్స్.. ఆ కారణంతోనే చేయలేకపోయాను.. హీరోయిన్..
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Tollywood : అవకాశం ఇస్తానని ఇంటికొచ్చి మరీ అలా ప్రవర్తించాడు.. గుప్పెడంత మనసు సీరియల్ నటి..








