Nagarjuna : తాతగా ప్రమోట్ కాబోతున్నారా.. ? నాగార్జున రియాక్షన్ ఇదే..
కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో అక్కినేని ఇంట్లోకి వారసుడు రాబోతున్నాడంటూ ప్రచారం నడుస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే కింగ్ నాగార్జున తాత కాబోతున్నారని.. నాగచైతన్య, శోభిత తల్లిదండ్రులుగా మారబోతున్నారంటూ నెట్టింట రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ వార్తలపై అక్కినేని నాగార్జున రియాక్ట్ అయ్యారు.

టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇప్పటికీ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇనాళ్లు హీరోగా అలరించిన నాగ్.. ఇప్పుడు కంటెంట్ నచ్చితే విలన్ పాత్రలకు సైతం రెడీగా ఉంటున్నారు. ఇటువలే కుబేర, కూలీ చిత్రాల్లో ముఖ్య పాత్రలతో అదరగొట్టారు. ఇదెలా ఉంటే.. కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో అక్కినేని ఇంట్లోకి వారసులు రాబోతున్నారంటూ ప్రచారం నడుస్తుంది. కొన్ని రోజుల్లోనే నాగార్జున తాత కాబోతున్నారంటూ రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. మొదట్లో నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల దంపతులు తల్లిదండ్రులుగా ప్రమోషన్ అందుకోబోతున్నారని రూమర్స్ వచ్చాయి. అయితే ఆ వార్తలలో ఎలాంటి నిజం లేదని కొట్టిపారేసింది శోభిత టీమ్.
ఇక తర్వాత అఖిల్, జైనబ్ తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందనున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీనిపై అఖిల్, అతడి ఫ్యామిలీ కానీ స్పందించలేదు. ఈ క్రమంలోనే ఇటీవల ఓ వేడుకలో పాల్గొన్న నాగార్జునకు సైతం ఇదే ప్రశ్న ఎదురైంది. అందుకు నాగ్ రియాక్ట్ అవుతూ.. సరైన సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను అని అన్నారు.
ప్రస్తుతం నాగార్జున బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా తాను కొన్నాళ్లుగా మోకాలి నొప్పితో బాధపడుతున్నానని.. సర్జరీ చేయించుకోవాలనుకోలేదని తెలిపారు.
ఇవి కూడా చదవండి : 11 సినిమాలు చేస్తే 10 బ్లాక్ బస్టర్ హిట్లే.. తెలుగులో తోపు హీరోయిన్..సైన్యంలో పనిచేసి ఉరి దాడిలో మరణించిన తండ్రి..




