Sequel Movies: 2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
చలనచిత్ర పరిశ్రమలో ఒక ట్రెండ్ ఏర్పడింది, అనేక విజయవంతమైన చిత్రాల సీక్వెల్స్ 2024లో, సినీ అభిమానులు, ట్రేడ్ వర్గాలనూ విపరీతంగా ఆకట్టుకున్నాయి. కథలు చెప్పే విధానం కూడా ఇప్పుడు చాలా మారిపోయింది. ముఖ్యంగా కంచికి చేరి శుభం కార్డు వేసుకుంటున్న సినిమాల సంఖ్య తగ్గుతూ వస్తోంది. సినీప్రియుల మెప్పు పొందిన ప్రతీ చిత్రాన్ని వీలున్నంత వరకు కొనసాగించే ప్రయత్నమే చేస్తున్నాయి ఆయా చిత్ర బృందాలు.
వీలుంటే కథనో.. లేదంటే ఆయా కథల్లోని పాత్రల్నో కొనసాగిస్తూ సీక్వెల్ సినిమాలతో సినీప్రియుల్ని మురిపించడమన్నది ఇటీవల కాలంలో రెట్టింపయ్యింది. ఈ 2024లో తెలుగులో దాదాపు అరడజను వరకు సీక్వెల్ చిత్రాలు బాక్సాఫీస్ ముందు అదృష్టం పరీక్షించుకున్నాయి. మరి వాటిలో జైత్రయాత్ర కొనసాగించినవెన్ని? అంచనాలు అందుకోలేక చతికిలపడినవెన్ని? ఓ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అయితే ఆ కథకు సీక్వెల్ తీసే పనిలో ఉంటారు. అయితే అలా కొనసాగించాలంటే కథలో స్కోప్ ఉండాలి. పైగా ‘అసలు కథ ఇప్పుడే మొదలైంది’ అన్నట్లుగా ఉండాలి. అలా కొన్ని చిత్రాలకు స్కోప్ దొరికింది. ‘అసలు కథ ఇప్పుడే మొదలైంది’ అన్నట్లు తొలి భాగం చివర్లో ట్విస్ట్ ఇచ్చి, మలి భాగం రూపొందించాలి. సాధారణంగా ఓ విజయవంతమైన సినిమాకి సీక్వెల్ వస్తుందంటే చాలు సినీప్రియుల్లో భారీ అంచనాలు ఏర్పడుతుంటాయి. అలా ఈ ఏడాది మంచి అంచనాలతో బాక్సాఫీస్ ముందుకొచ్చిన సీక్వెల్స్ అరడజను ఉన్నాయి
రెండేళ్ల క్రితం ‘డీజే టిల్లు’తో సినీప్రియుల్ని కడుపుబ్బా నవ్వించారు యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ. ఆయన ఈ ఏడాది మరోసారి అదే పాత్రలో ‘టిల్లు స్క్వేర్’తో థియేటర్లలో సందడి చేశారు. రొమాంటిక్ క్రైమ్ కామెడీ కథాంశంతో మల్లిక్ రామ్ తెరకెక్కించిన ఈ సీక్వెల్ చిత్రం.. మార్చి నెలాఖరున విడుదలై బాక్సాఫీస్ ముందు భారీ విజయాన్ని అందుకుంది. టిల్లుగా సిద్ధు చేసిన అల్లరి.. లిల్లిగా అనుపమ అభినయం, యాక్షన్ హంగామా సినీ ప్రియుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ విజయవంతమైన చిత్రానికి కొనసాగింపుగా ‘టిల్లు క్యూబ్’ను తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు సిద్ధు జొన్నలగడ్డ.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.