మీ పొట్ట గుట్టలా మారిందా.? ఇలా చేస్తే ఈజీగా కరిగిపోతుంది

21 December 2024

Ravi Kiran

రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే అల్పాహారం అత్యంత ముఖ్యమైనది. అందువల్ల ప్రొటీన్లు అధికంగా ఉండే అల్పాహారంతో రోజును మొదలుపెట్టాలని వైద్యులు అంటుంటారు. 

ప్రోటీన్లు మనలో ఆకలిని కంట్రోల్ చేస్తుంది. అల్పాహారంలో గుడ్లు, పెరుగు, చీజ్, పప్పు దినుసులు ఉండాలి. వీటిని తింటే అతిగా తినే అలవాటు తగ్గుతుందని డాక్టర్లు చెబుతున్నారు.

ఉదయాన్నే శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడం వల్ల జీవక్రియ సక్రమంగా ఉంటుందట. రోజంతా క్రమం తప్పకుండా నీరు తాగడం వల్ల బరువు తగ్గడం, శక్తి పెరగడం జరుగుతుంది. 

రోజూ 34 నుంచి 68 ఔన్సుల నీరు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. వెచ్చని నీటితో రోజు ప్రారంభించడం ఆరోగ్యానికి చాలా మంచిదని సిఫార్సు చేస్తున్నారు.

శరీరానికి అవసరమైన విటమిన్లలో విటమిన్ డి ఒకటి. ఇది సూర్యకాంతి నుంచి వస్తుంది. కాబట్టి ఉదయాన్నే శరీరానికి సూర్యరశ్మి తగలాలి. 

విటమిన్ డి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. విటమిన్ డి శరీరంలోని కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. 

రోజూ 10 నుంచి 15 నిమిషాలు సూర్యరశ్మిలో ఉండటం వల్ల బరువు తగ్గవచ్చు. రోజువారీ వ్యాయామం చాలా ముఖ్యం. 

వ్యాయామం చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు. ఉదయం వ్యాయామం చేయడం వల్ల శక్తి కూడా పెంపొందుతుంది.

ఊబకాయం రాకుండా ఉండాలంటే ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని తినాలి. ఇంట్లో వండిన ఆహారం ఏది తిన్నా బరువు అదుపులో ఉంటుంది. అందువల్ల బరువు పెరిగే అవకాశం తక్కువ.