AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నైజీరియాలో క్రిస్మస్ సందర్భంగా తొక్కిసలాట.. ఇప్పటివరకు 32 మంది దుర్మరణం!

రెండు రోజుల్లో పండగ.. షాపింగ్‌ హడావుడి.. బిజీబిజీగా రోడ్లు. కిక్కిరిసిన వీధులు. ఈ క్రమంలోనే నైజీరియా క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పండుగ పురస్కరించుకుని రెండు ఈవెంట్లలో విరాళాలు, ఆహార పదార్థాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తొక్కిసలాట జరిగి 32 మంది ప్రాణాలు కోల్పోయారు.

నైజీరియాలో క్రిస్మస్ సందర్భంగా తొక్కిసలాట.. ఇప్పటివరకు 32 మంది దుర్మరణం!
Nigeria Stampede
Balaraju Goud
|

Updated on: Dec 22, 2024 | 5:10 PM

Share

జర్మనీ తర్వాత ఇప్పుడు నైజీరియాలో క్రిస్మస్ వేడుకల కార్యక్రమంలో పెను ప్రమాదం సంభవించింది. నైజీరియా క్రిస్మస్ వేడుకల రెండు ఈవెంట్లలో విరాళాలు, ఆహార పదార్థాల పంపిణీ సమయంలో తొక్కిసలాట జరిగింది. దీంతో మృతుల సంఖ్య 32కి చేరింది. ఈ మేరకు ఆదివారం పోలీసులు సమాచారం అందించారు. ఆహార పదార్థాల కోసం అకస్మాత్తుగా పెద్ద సంఖ్యలో గుమిగూడారని, తొక్కిసలాట కారణంగా చాలా మంది కింద పడిపోయారని, దీని కారణంగా చాలా మంది మరణించారని పోలీసులు చెప్పారు.

మొదటి సంఘటన ఆగ్నేయ అనంబ్రా రాష్ట్రంలోని ఓకిజా పట్టణంలో జరిగింది. ఇందులో 22 మంది మరణించారని పోలీసు ప్రతినిధి తోచుక్వు ఇకెంగా తెలిపారు. క్రిస్మస్ సందర్భంగా ఓ దాత ఓకిజాలో ఆహార పంపిణీని నిర్వహించాడు. ఈ సమయంలో జనంలో తొక్కిసలాట జరిగింది. అలాగే, రాజధాని అబుజాలోని ఒక చర్చి ఆహారం, దుస్తులను పంపిణీ చేసే కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సమయంలో తొక్కిసలాట కారణంగా ప్రమాదం సంభవించి, పది మంది మరణించినట్లు పోలీసులు తెలిపారు.

జర్మనీలో ఐదుగురు మృతి

దీనికి ఒకరోజు ముందు శనివారం(డిసెంబర్ 21) క్రిస్మస్ వేడుకల సందర్భంగా జర్మనీలో పెను ప్రమాదం చోటుచేసుకుంది. ఇందులో 5 మంది మరణించగా, 7 మంది భారతీయులతో సహా 200 మందికి పైగా గాయపడ్డారు. డిసెంబర్ 25న క్రిస్మస్ వేడుకల సందర్భంగా యూరప్ మార్కెట్‌లలో డెకరేషన్, షాపింగ్, వివిధ పాటలు, సంగీత కార్యక్రమాలు జరుగుతాయి. ఈ నేపథ్యంలోనే పెద్ద సంఖ్యలో ప్రజలు ఇక్కడ గుమిగూడారు. ఈ సందర్భంగా ప్రజలకు బహుమతులు కూడా పంపిణీ చేస్తారు. ఈ సమయంలో తొక్కిసలాట కారణంగా ఈ ప్రమాదం జరిగింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

బీసీసీఐకి ఇండిగో చుక్కలు..పుణె వైపు పరుగులు పెట్టిన ప్లేయర్లు
బీసీసీఐకి ఇండిగో చుక్కలు..పుణె వైపు పరుగులు పెట్టిన ప్లేయర్లు
బెల్లం ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుంది..? మీరు చేసే తప్పులతో..
బెల్లం ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుంది..? మీరు చేసే తప్పులతో..
రతన్ టాటా సవతి తల్లి కన్నుమూత.. అమె గురించి తెలిస్తే షాకవుతారు!
రతన్ టాటా సవతి తల్లి కన్నుమూత.. అమె గురించి తెలిస్తే షాకవుతారు!
పుతిన్‌తో మోదీ భేటీ… భారత్–రష్యా బంధానికి కొత్త దిక్సూచి
పుతిన్‌తో మోదీ భేటీ… భారత్–రష్యా బంధానికి కొత్త దిక్సూచి
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..