Viral: శ్మశానం దగ్గర పసివాడి ఏడుపు శబ్దం.. దగ్గరికెళ్లి చూడగానే షాక్.! వీడియో.

Viral: శ్మశానం దగ్గర పసివాడి ఏడుపు శబ్దం.. దగ్గరికెళ్లి చూడగానే షాక్.! వీడియో.

Anil kumar poka

|

Updated on: Dec 22, 2024 | 4:44 PM

ఏ కన్నతల్లి బిడ్డో తెలియదు. అనాథగా పడి ఉన్నాడు. తల్లి పొత్తిళ్ళ నుంచి బయటకు వచ్చి..ఈ లోకాన్ని అప్పుడే చూస్తున్నాడు. కానీ ఈలోపే చేతులు ఎలా వచ్చాయో కాని.. ఈ బాబును శ్మశాన వాటిక దగ్గర విడిచిపెట్టారు. కొత్తగూడెంలో హృదయ విదారకర ఘటన చోటు చేసుకుంది. న్యూ గొల్లగూడెం శ్మశాన వాటిక దగ్గరకు వెళ్ళి చూడగా పసి బాబు ఏడుపులు వినిపించాయి.

శ్మశానంలో ఉన్న నవజాత శిశువు ఏడుస్తూ.. కనిపించాడు..రెండు రోజుల క్రితం పుట్టిన ఈ చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్ళారు. అమ్మ కోసం ,పాల కోసం గుక్కపట్టి ఏడుస్తూ ఉంటే స్థానికులు గుర్తించారు.. పోలీసులకు సమాచారం అందించారు.. కొత్తగూడెం స్త్రీ మాత శిశు ఆసుపత్రికి తరలించారు త్రీ టౌన్ పోలీసులు. నవజాతి శిశు ఎవరన్నది వివరాలు సేకరిస్తున్నారు కొత్తగూడెం పోలీసులు.. అనంతరం పోలీస్ పర్యవేక్షణలో మాతా శిశు కేంద్రానికి తరలించి అక్కడ శిశువు ఆరోగ్యాన్ని పరీక్షించారు.. అనంతరం ఐసిడిఎస్ అధికారులకు అప్పగించారు..ప్రస్తుతం వారి పర్యవేక్షణ లో బాబు ఆరోగ్యంగా ఉన్నాడు. ఇటీవలి శిశువులను వదిలి వెళుతున్న ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి..ఆ తల్లికి ఏ కష్టం వచ్చింది.. అసలు ఎందుకు కనాలి..ఇలా ఎందుకు అనాథలా పసి పిల్లలను వదిలేయాలి అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..ఆ పసి హృదయం అమ్మ కోసం, అమ్మ స్పర్శ కోసం ఎన్ని గంటలు నుంచో ఏడ్చి ఏడ్చి..కన్నీళ్లు ఇంకి పోయాయి.. పొట్టలో ఏమీ లేక బిక్క మొహం వేసి.. పాల కోసం కళ్లు ఇంకిపోయేలా ఏడ్చాడు. కానీ నవమాసాలు మోస కన్న.. ఆ తల్లి ఎలా ఇలా వదిలి వెళ్లగలిగింది అని స్థానికులు ఆవేదన చెందుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.