TOP 9 ET: అల్లు అర్జున్ ఏమైనా భగవత్ స్వరూపుడా.? | సినిమా వాళ్లకు సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్..
సంధ్య థియేటర్ తొక్కిసలాటలో.. మహిళ చనిపోయిందని చెప్పినా అల్లు అర్జున్ పోలీసులకు సహకరించలేదన్నారు ముఖ్యమంత్రి రేవంత్. అంతేకాదు అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. 12వేలు పెట్టి సినిమా థియేటర్ కు వెళ్లిన కుటుంబంలో ఒకరు చనిపోతే సినిమావాళ్లెవరూ పరామర్శించలేదన్నారు. కానీ అల్లు అర్జున్‌ను సినీ ఇండస్ట్రీ అంతా పరుగెత్తి మరీ పరామర్శించిందని.. అదేంటో తనకు అర్థం కాలేదన్నారు రేవంత్ రెడ్డి.
01.CM Revanth Reddy: సినిమా వాళ్లకు సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్.
సినీ ఇండస్ట్రీకి సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. సినిమాలు చేసుకోండి, డబ్బులు సంపాదించుకోండి. కానీ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే ఊరుకునేంది లేదన్నారు. సినిమా చూపిస్తామన్నారు. తాము అధికారంలో ఉన్నంతకాలం సినిమా వాళ్ల ఆటలు సాగవన్నారు. అసెంబ్లీలో ఇదే విషయంపై చాలా స్ట్రాంగ్ గా మాట్లాడారు. అంతేకాదు ఇక మీదట బెన్‌ఫిట్ షోలు.. టికెట్ రేట్స్ పెంచడాలు లాంటివి తన హయాంలో ఉండవంటూ.. చాలా క్లియర్ కట్ గా చెప్పారు సీఎం రేవంత్.
02.allu arjun: అల్లు అర్జున్ ఏమైనా భగవత్ స్వరూపుడా.? రేవంత్ రెడ్డి సెటైర్..
సంధ్య థియేటర్ తొక్కిసలాటలో.. మహిళ చనిపోయిందని చెప్పినా అల్లు అర్జున్ పోలీసులకు సహకరించలేదన్నారు ముఖ్యమంత్రి రేవంత్. అంతేకాదు అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. 12వేలు పెట్టి సినిమా థియేటర్ కు వెళ్లిన కుటుంబంలో ఒకరు చనిపోతే సినిమావాళ్లెవరూ పరామర్శించలేదన్నారు . కానీ అల్లు అర్జున్‌ను సినీ ఇండస్ట్రీ అంతా పరుగెత్తి మరీ పరామర్శించిందని.. అదేంటో తనకు అర్థం కాలేదన్నారు రేవంత్ రెడ్డి. అల్లు అర్జున్ ఏమైనా భగవత్ స్వరూపుడా అని సీఎం సెటైర్ వేశారు. అంతేకాదు చట్టానికి ఎవరూ అతీతులు కాదన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
03.Mokshagna: అన్నీ అబద్ధాలే..
మోక్షజ్ఞ, ప్రశాంత్ వర్మ సినిమా ఆగిపోయిందని.. ఈ ఇద్దరూ వేర్వేరు సినిమాలతో బిజీ అయిపోయారని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సినిమాపై క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ప్రశాంత్ వర్మ, మోక్షజ్ఞ సినిమాపై వస్తున్న వార్తలన్నీ రూమర్స్ అని కొట్టి పారేసారు. ఈ సినిమాకు సంబంధించి ఏదైనా అప్డేట్ ఉంటే తామే సరైన సమయంలో చెబుతామంటూ చిత్ర నిర్మాతలు వెల్లడించారు.
04.Pushpa 2: పుష్ప రాజ్ సోలో రికార్డ్ ఎవ్వడి వల్ల కాలేదంతే.!
పుష్ప 2 రికార్డుల జోరు కంటిన్యూ అవుతోంది. ఈ ఏడాది అత్యధిక టికెట్లు అమ్ముడైన సినిమాగా రికార్డ్ సెట్ చేసింది ఈ మూవీ. ప్రముఖ టికెటింగ్ ప్లాట్ ఫామ్ బుక్ మై షో లెక్కల ప్రకారం 10.8 లక్షల మంది సోలో ఆడియన్స్ ఈ సినిమాను వీక్షించారు.
05. Pushpa 2: పుష్ప 2 ఓటీటీ రిలీజ్ పై ప్రకటన
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప 2 కలెక్షన్ల సునామీ కంటిన్యూ అవుతూనే ఉంది. కేవలం హిందీలోనే 632 కోట్లు వసూలు చేసింది పుష్ప 2. ప్రపంచ వ్యాప్తంగా 1500 కోట్లు దాటేసింది. తాజాగా ఈ చిత్ర OTT విడుదలపై నిర్మాతలే క్లారిటీ ఇచ్చారు. 56 రోజుల తర్వాతే ఈ సినిమా డిజిటల్‌కు వస్తుందని కన్ఫర్మ్ చేసారు.
06. Sriya Reddy: సలార్ Vs OG
గతేడాది ప్రభాస్ హీరోగా నటించిన సలార్‌లో రాధా రమా మన్నార్ అనే కీలక పాత్రలో నటించి మెప్పించారు శ్రీయా రెడ్డి. తాజాగా ఈమె పవన్ కళ్యాణ్ ఓజిలోనూ ముఖ్య పాత్ర చేస్తున్నారు. ఓజి, సలార్ పాత్రలకు అస్సలు పొంతనే ఉండదన్నారు శ్రీయా. రెండూ భిన్నమైన పాత్రలే అని తెలిపారు శ్రీయా రెడ్డి.
07.Game Changer: చరణ్‌లో ఏదో శక్తి దాగుంది – శంకర్
రామ్‌చరణ్‌లో ఏదో శక్తి ఉంది. ఆయన దాన్ని కంట్రోల్ చేసి పెట్టుకున్నారన్నారు శంకర్. సందర్భం వచ్చినప్పుడు చెర్రీలో ఉన్న సత్తా బయటపడుతుంది. లోతైన భావాలను పలికించగల గొప్ప నటుడు చరణ్ అని ప్రశంసించారు. వీరి కాంబినేషన్‌లో గేమ్‌చేంజర్ తెరకెక్కింది. ఇంటర్నేషనల్ ఈవెంట్‌కి ఆల్రెడీ కౌంట్‌డౌన్ మొదలుపెట్టేసింది టీమ్.
08.Hari Hara Veeramallu: 3Dలో వస్తున్న వీరమల్లు
పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించిన వర్క్స్ అన్ని వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాపై తాజాగా మరో అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాను 3డి వెర్షన్‌లోనూ విడుదల చేయబోతున్నారనే ప్రచారం గట్టిగానే జరుగుతోంది. ఏఎం రత్నం భారీ బడ్జెట్‌తో హరిహర వీరమల్లు సినిమాను నిర్మిస్తున్నారు.
09.Rashmika: ఇంకా చెప్పేదేముంది.. నీవాడు అతనే కదా..
తనకు కాబోయేవాడిలో ఉండాల్సిన లక్షణాల గురించి మాట్లాడారు నటి రష్మిక మందన్న. కోపతాపాలకు అతీతంగా తనను అర్థం చేసుకునే వ్యక్తి కావాలన్నారు. ఒకరి పట్ల ఒకరికి గౌరవం ఉంటే జీవితాంతం కలిసి ఉండొచ్చన్నారు. జీవితంలో తోడు తప్పకుండా ఉండాలన్నారు ఈ బ్యూటీ. అయితే అది విజయే కదా.. ఇంక నువ్వు చెప్పేదేముంది అంటూ.. నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు ఆమె ఫ్యాన్స్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.