Crime News: ప్రేమించానన్నాడు.. పెళ్లాడతానన్నాడు.. చివరికి చంపి కప్పెట్టాడు!

ప్రేమ పేరుతో యువతిని కిరాతకంగా హత్యచేసి ఎవరికీ కనించకుండా మాయం చేయాలనుకున్నాడు. గుట్టుచప్పుడు కాకుండా పూడ్చిపెట్టి ఏమీ ఎరగనట్టు నటించాడు. ఐతే కుమార్తె కనిపించకపోవడంలేదని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం..

Crime News: ప్రేమించానన్నాడు.. పెళ్లాడతానన్నాడు.. చివరికి చంపి కప్పెట్టాడు!
Crime News
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 09, 2022 | 11:51 AM

Telangana Crime News: ప్రేమ పేరుతో యువతిని కిరాతకంగా హత్యచేసి ఎవరికీ కనించకుండా మాయం చేయాలనుకున్నాడు. గుట్టుచప్పుడు కాకుండా పూడ్చిపెట్టి ఏమీ ఎరగనట్టు నటించాడు. ఐతే కుమార్తె కనిపించకపోవడంలేదని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. కాటేదాన్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

వనపర్తి జిల్లా ఖిల్లాగణపురం మండలం మానాజీపేటకు చెందిన బత్తిని శ్రీశైలంకు హైదరాబాద్‌లో చదువుకునే రోజుల్లో (2017) కాటేదాన్‌ ఏరియా ఎన్జీవోస్‌కాలనీకి చెందిన సాయిప్రియ (19)తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ప్రేమిస్తున్నానంటూ తరచూ ఆమె వెంట పడేవాడు. ఐతే ఆమె నిరాకరించింది. అయినప్పటికీ శ్రీశైలం ఆమె వెంటపడుతుండటంతో కుటుంబ సభ్యులకు విషయం తెల్పింది. దీంతో సాయిప్రియ కుటుంబ సభ్యులు శ్రీశైలంను మందలించారు. ఈ క్రమంలో గత మంగళవారం (సెప్టెంబర్‌ 5) నాడు సాయిప్రియకు ఫోన్‌చేసి మాట్లాడేందుకు మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌కు రావాలని కోరాడు. అతని మాటలు నమ్మిన సాయిప్రియ అక్కడికి వెళ్లెంది. అనంతరం ఆమెను బైక్‌పై మానాజీపేట శివారులోని మబ్బుగుట్టల్లోకి తీసుకెళ్లాడు. తనను పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయడంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. సాయిప్రియ నిరాకరించడంతో శ్రీశైలం ఆమె మెడకు చున్నీ బిగించి హత్య చేశాడు. ఆ తర్వాత శివ అనే వ్యక్తి సహాయంతో కేఎల్‌ఐ కాల్వ పక్కన మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు. సాయిప్రియ కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు ఫిర్యాదులో శ్రీశైలంపై అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు నిందితుడు శ్రీశైలంను అదుపులోకి తీసుకుని, తమదైన శైలిలో విచారించగా నేరం ఒప్పుకున్నాడు. గురువారం మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.