నిన్ను ఎవడ్రా పూజలు చేయమన్నాడు..! వేణు స్వామి పై మండిపడుతున్న బాలయ్య అభిమానులు
నందమూరి అభిమానులకు బ్యాడ్ న్యూస్. అఖండ 2 సినిమా రిలీజ్ అనూహ్యంగా వాయిదా పడింది. మొదట గురువారం (డిసెంబర్ 4) రాత్రి ప్లాన్ చేసిన అఖండ 2 ప్రీమియర్స్ రద్దయ్యాయి. అయితే రెగ్యులర్ షోలు పడతాయని అశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. అఖండ 2 సినిమా రిలీజ్ ను వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది

నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన అఖండ 2 సినిమా కోసం బాలయ్య ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా నేడు (డిసెంబర్ 5)న ప్రేక్షకుల ముందుకు రావాలి కానీ ఊహించని విధంగా సినిమా రిలీజ్ వాయిదా పడింది. సినిమా విడుదల ఆలస్యానికి సాంకేతిక లోపం అని కొందరు.. లేదు ఫైనాన్స్ ఇష్యు అని మరికొందరు అంటున్నారు. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న అఖండ 2 సినిమా పై భారీ అభిప్ క్రియేట్ అయ్యింది. కాగా సినిమా విడుదల ఆలస్యం కావడంతో అభిమానులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. చిత్ర నిర్మాతల పై ఓ రేంజ్ లో మండిపడుతున్నారు. అలాగే వేణు స్వామి పై కూడా బాలయ్య అభిమానులు ఫైర్ అవుతున్నారు.
ఇటీవలే అఖండ 2 సినిమా గురించి వేణు స్వామి ఓ వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో త్వరలో విడుదల కానున్న ఓ స్టార్ హీరో సినిమా కోసం ప్రత్యేక పూజలు చేస్తున్నానని.. ఆ సినిమా ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నా అని చెప్పుకొచ్చాడు. అయితే ఆ హీరో ఎవరు అనేది మాత్రం చెప్పలేదు. అయితే ఇప్పుడు విడుదలకు రెడీగా ఉన్న స్టార్ హీరో సినిమా అఖండ 2 మాత్రమే.. దాంతో బాలకృష్ణ సినిమా కోసం వేణు స్వామి ప్రత్యేక పూజలు, హోమాలు చేశారని అభిమానులు భావించారు.
కానీ ఊహించని విధంగా సినిమా విడుదల ఆలస్యం అవ్వడంతో ఇప్పుడు బాలయ్య అభిమానులు వేణు స్వామి పై ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియాలో కొందరు అభిమానులు వేణు స్వామిని ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. నిన్ను ఎవడు పూజలు చేయమన్నాడు.? ఈ పూజల కారణంగానే సినిమా విడుదల వాయిదా పడింది. పూజలు చేస్తే రిలీజ్ అవుతుందని ఎలా అనుకున్నావు రా.? అంటూ వేణు స్వామి పై మండిపడుతున్నారు ఫ్యాన్స్. మరికొందరు మాత్రం వేణు స్వామి లాంటి పెద్దాయన పూజ చేసినా కూడా ఈ సినిమా విడుదల కాకపోవడం ఏంటి.? అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్ వీడు….
ఈడితోనే మొదలు అయ్యింది సగం దరిద్రం 😭😭😓😓😓
పూజలు చేస్తే రిలీజ్ అవుతుంది అని ఎలా అనుకున్నావ్ రా ఎదవ @14ReelsPlus … డబ్బులు కట్టుంటే రిలీజ్ అయ్యేది
— 𝗦𝗵𝗶𝘃𝘂𝗱𝘂 #𝑨𝒌𝒉𝒂𝒏𝒅𝒂2 (@Shiva4TDP) December 4, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .




