Watch Video: రోహిత్ మాటలకు పడిపడి నవ్విన కోహ్లీ.. ఎందుకంటే? వైరల్ వీడియో..
Virat Kohli: విరాట్ కోహ్లి 71వ సెంచరీ కోసం మూడేళ్లపాటు నిరీక్షణ కొనసాగింది. చివరికి అది దుబాయ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై ముగిసింది.
ASIA CUP 2022: ఆసియా కప్-2022లో భారత జట్టు రాణించలేకపోయింది. దీంతో ఫైనల్‌కు చేరుకోలేకపోయింది. అయితే ఈ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ నుంచి అభిమానులకు శుభవార్త అందించింది. ఆ వార్త విరాట్ కోహ్లికి 71వ సెంచరీకి సంబంధించింది. విరాట్ చాలా కాలం ఫామ్‌లో లేడు. కానీ, ఈ టోర్నమెంట్‌లో అతని బ్యాట్ నుంచి పరుగులు వచ్చాయి. భారత్ చివరి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై కోహ్లి సెంచరీ సాధించాడు. ఈ తరువాత కెప్టెన్ రోహిత్ కోహ్లీని ఇంటర్వ్యూ చేశాడు. ఇందులో విరాట్ కోహ్లీతోపాటు రోహిత్ కూడా పడిపడి నవ్వడాన్ని చూడొచ్చు.
కోహ్లి సెంచరీ కోసం మూడేళ్లుగా ఎదురుచూసినా చాలాసార్లు దగ్గరగా వచ్చినా.. చేరుకోలేకపోయాడు. గత కొద్ది రోజులుగా కోహ్లికి పరుగులు చేయడం కష్టంగా మారడంతో అతను చాలా బ్యాడ్ ఫేజ్ లో ఉన్నట్లుగా అనిపించింది. అయితే, ఈ ఆసియా కప్‌లో కోహ్లీ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. అఫ్గానిస్థాన్‌తో జరిగిన టీ20లో కోహ్లీ సాధించిన సెంచరీ టీ20లో అతడికి తొలి సెంచరీ కావడం విశేషం.
What happens when @ImRo45 interviews @imVkohli ☺️ ?
Laughs, mutual admiration & a lot of respect ?- by @ameyatilak
Full interview ?️https://t.co/8bVUaa0pUw #TeamIndia | #AsiaCup2022 | #INDvAFG pic.twitter.com/GkdPr9crLh
— BCCI (@BCCI) September 9, 2022
రోహిత్ హిందీలో ఇంటర్వ్యూ..
మ్యాచ్ అనంతరం రోహిత్ కోహ్లీని ఇంటర్వ్యూ చేశాడు. ఈ ఇంటర్వ్యూలో రోహిత్ కోహ్లీని ప్రశ్నలు అడగడం ప్రారంభించగానే.. కోహ్లీ తెగ నవ్వడం చూడొచ్చు. రోహిత్ హిందీలో ఇంటర్వ్యూ చేస్తున్నాడు. రోహిత్ మాట్లాడుతూ, “మీకు చాలా అభినందనలు విరాట్, మీ 71వ సెంచరీ మొత్తం భారతదేశానికి చాలా ఉత్సాహాన్ని అందించింది. ఇందుకోసం చాలా కాలం వేచి ఉన్నారని నాకు తెలుసు. మీరు ఆడిన ఇలాంటి ఇన్నింగ్స్‌లు మరెన్నో చూడాలి. మీ ఇన్నింగ్స్ గురించి చెప్పండి, అది ఎలా ప్రారంభమైంది, ఆ తర్వాత ఫీలింగ్ ఎలా ఉంది? అంటూ కోహ్లీని ప్రశ్నించాడు.
దీనిపై కోహ్లీ సరదగా స్పందిస్తూ.. “నాతో మొదటిసారి స్వచ్ఛమైన హిందీలో మాట్లాడుతున్నావ్” అంటూ ఆటపట్టించాడు. ఆపై రోహిత్ వివరణ ఇచ్చే టైంలో.. ఇద్దరూ బిగ్గరగా నవ్వడం ప్రారంభించారు. ఆపై రోహిత్ ఇలా అన్నాడు, “నేను కొంచెం హిందీ ఇంగ్లీషును కలపాలని ప్లాన్ చేశాను. అయితే ఇప్పుడు హిందీలో అంత మంచి రిథమ్ వచ్చింది. కాబట్టి హిందీలోనే మాట్లాడదాం అనుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు.
అయితే ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌కు విశ్రాంతినిచ్చి అతని స్థానంలో కేఎల్ రాహుల్‌ని తీసుకున్నారు. ఈ మ్యాచ్‌లో భారత్ 101 పరుగుల తేడాతో విజయం సాధించి విజయంతో టోర్నీని ముగించింది.