Asia Cup 2022: నేను కదా కెప్టెన్‌.. అలా ఎలా చేస్తారు? అంపైర్‌ను ఆడిపోసుకున్న పాక్‌ కెప్టెన్.. వీడియో వైరల్‌

PAK vs SL, Asia Cup 2022: ఆసియా కప్ సూపర్-4 ఆఖరి మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో పాకిస్థాన్ ఘోర పరాజయం పాలైంది. దుబాయ్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో పాక్‌పై శ్రీలంక 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

Asia Cup 2022: నేను కదా కెప్టెన్‌.. అలా ఎలా చేస్తారు? అంపైర్‌ను ఆడిపోసుకున్న పాక్‌ కెప్టెన్.. వీడియో వైరల్‌
Babar Azam
Follow us

|

Updated on: Sep 10, 2022 | 1:02 PM

PAK vs SL, Asia Cup 2022: ఆసియా కప్ సూపర్-4 ఆఖరి మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో పాకిస్థాన్ ఘోర పరాజయం పాలైంది. దుబాయ్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో పాక్‌పై శ్రీలంక 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాక్‌ లంక బౌలర్ల ధాటికి 19.1 ఓవర్లలో 122 పరుగులకే కుప్పుకూలింది. ఆ తర్వాత లంక మూడు ఓవర్లు మిగిలి ఉండగానే ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. కాగా ఈ మ్యాచ్ లోనూ పాక్ కెప్టెన్ బాబర్ ఆజం (Babar Azam) పేలవ ఫామ్ కొనసాగించాడు. కేవలం 30 పరుగుల మాత్రమే చేసి వసిందు హసరంగా బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు. కాగా ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. శ్రీలంక ఇన్నింగ్స్‌ 16 ఓవర్‌ వేసిన హాసన్‌ అలీ బౌలింగ్‌లో ఓ బౌన్సర్‌ బంతిని షనక కట్‌ షాట్‌ ఆడడానికి ప్రయత్నించాడు. అయితే బంతి మిస్‌ అయ్యి నేరుగా వికెట్‌ కీపర్‌ మహ్మాద్‌ రిజ్వాన్‌ చేతుల్లోకి వెళ్లింది.

అయితే బంతి బ్యాట్‌కు తగిలిందని భావించిన రిజ్వాన్‌ క్యాచ్‌కు గట్టిగా అప్పీల్‌ చేశాడు. అయితే ఫీల్డ్‌ అంపైర్‌ అనిల్‌ చౌదరి రిజ్వాన్‌ అప్పీల్‌ను తిరస్కరించాడు. దీంతో వెంటనే రిజ్వాన్‌ రివ్యూ కోసం అంపైర్‌కు సిగ్నల్‌ ఇచ్చాడు. రిజ్వాన్‌ అలా సైగ చేశాడో లేదో అంపైర్‌ వెంటనే రివ్యూ కోసం థర్డ్‌ అంపైర్‌కు రెఫర్‌ చేశాడు. అయితే బంతి బ్యాట్‌కు తగల్లేదని రిప్లైలో స్పష్టంగా తేలింది. దీంతో అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించాడు. అయితే అసలు సమస్య ఇక్కడే వచ్చింది. సాధారణంగా ఏ ఫార్మాట్‌లో అయినా కెప్టెన్‌ సిగ్నల్‌ చేస్తేనే అంపైర్లు రివ్యూను థర్డ్‌ అంపైర్‌కి రిఫర్‌ చేయాలి. అయితే ఈ మ్యాచ్‌లో మాత్రం కెప్టెన్‌తో సంబంధం లేకుండా కీపర్‌ సూచనల మేరకు అంపైర్‌ రివ్యూను రెఫర్‌ చేశారు. ఇది పాక్‌ కెప్టెన్‌ బాబార్‌ ఆజంకు కోపం తెప్పించింది. ‘కెప్టెన్‌ నేను కదా.. రిజ్వాన కాదు కదా’ అంటూ అంపైర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరలవుతోంది. కాగా ఆదివారం ఆసియాకప్‌ టైటిల్‌ కోసం పాక్‌-శ్రీలంక జట్లు మరోసారి తలపడనున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..