AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: నా గణపతి బప్పాను తీసుకెళ్లద్దు.. నిమజ్జనం వేళ చిన్నారి కన్నీళ్లు.. మనసులను కదిలిస్తోన్న వీడియో

Ganesh Nimajjanam 2022: వినాయక చవితి రోజు నుంచి పూజలందుకుంటోన్న గణ నాథులు గంగమ్మ ఒడికి చేరుకుంటున్నారు. డప్పులు, వాయిద్యాలు, హోరేత్తే డ్యాన్సుల మధ్య వినాయక నిమజ్జనాలు కోలాహలంగా సాగుతున్నాయి.

Viral Video: నా గణపతి బప్పాను తీసుకెళ్లద్దు.. నిమజ్జనం వేళ చిన్నారి కన్నీళ్లు.. మనసులను కదిలిస్తోన్న వీడియో
Ganeshnimajjanam2022
Basha Shek
|

Updated on: Sep 09, 2022 | 7:21 PM

Share

Ganesh Nimajjanam 2022: వినాయక చవితి రోజు నుంచి పూజలందుకుంటోన్న గణ నాథులు గంగమ్మ ఒడికి చేరుకుంటున్నారు. డప్పులు, వాయిద్యాలు, హోరేత్తే డ్యాన్సుల మధ్య వినాయక నిమజ్జనాలు కోలాహలంగా సాగుతున్నాయి. కాగా పూజల తర్వాత గణేశుడి విగ్రహాన్ని విధిగా నిమజ్జనం చేయడం వల్ల ఇళ్లలో ఏడాది పొడవునా ఎలాంటి ఇబ్బందులు ఉండవని పెద్దలు చెబుతారు. అయితే ఇన్ని రోజులు ఘనంగా పూజలందుకున్న వినాయకులు నిమజ్జనానికి వెళుతున్నప్పుడు కూడా చాలామంది భావోద్వేగానికి లోనవుతారు. చాలా మందికి కళ్లలో నీళ్లు కూడా వస్తున్నాయి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా భావోద్వేగానికి గురవుతారు.

ఈ వీడియోలో ఒక పాప గణపాతి బప్పాను తీసుకెళ్లవద్దని గట్టిగా పట్టుకుంటుంది. అయితే అమ్మాయి తల్లి గణపతి బప్పాను నిమజ్జనానికి వెళ్లనివ్వమని చెప్పింది. అయితే పాప మాత్రం గణేశుడి విగ్రహాన్ని వదిలిపెట్టదు. బాలిక తల్లి మాత్రం పాపను బలవంతంగా కిందకు దింపడానికి ప్రయత్నం చేస్తుంది. అయినా ఆ పాప కిందకు రాదు. చివరికి ఎలాగోలా పాపను కిందకు దింపడంతో గణేశుడు నిమజ్జనానికి వెళ్లిపోతాడు. దీనికి సంబంధించిన వీడియోను కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ మహేష్ శర్మ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్‌ చేసుకున్నారు. ‘హృదయాన్ని హత్తుకునే వీడియో..నా గణపతి బప్పాను తీసుకోవద్దు’ అని క్యాప్షన్ ఇచ్చారు. గణపతి నిమజ్జన మహోత్సవాల నేపథ్యంలో ప్రస్తుతం ఈ వీడియో బాగావైరలవుతోంది. నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. ‘ఇది చాలా ఎమోషనల్ మూమెంట్. గణపతి బప్పాతో ఆ అమ్మాయికి చాలా అనుబంధం ఏర్పడింది’ అందుకే విగ్రహాన్ని వదలడం లేదు’ అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..