వినాయక చవితి
శ్లోకం
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ। నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా
వక్రమైన తొండము కలవాడును, విశ్వమంతటిని తనలో నిముడ్చుకొనిన శరీరము కలవాడును, కోటి సూర్యుల కాంతితో ప్రకాశించువాడును అయిన నీకు నమస్కరిస్తున్నాను.
కథనాలు
వెబ్ స్టోరీస్
మరిన్ని
ఇంట్లోనే వినాయకుడిని నిమజ్జనం చేస్తున్నారా.. ఇది తెలుసుకోండి!
గణపతి నిమజ్జనం చేస్తున్నారా.? పొరపాటున కూడా ఈ తప్పులు చెయ్యొద్దు..
ప్రతి పూజలో వినాయకుడినే ముందుగా ఎందుకు పూజిస్తారో తెలుసా?
గణపతి నిమజ్జనం ఇలా చేస్తే.. మీ ఇంట అదృష్ట తాండవం పక్కా..
లంబోదరుడికి రెండో రోజు ఈ నైవేద్యం సమర్పిస్తే.. అన్ని శుభాలే..
ఫొటో గ్యాలరీ
థాయిలాండ్ లో ఘనంగా వినాయక చవితి వేడుకలు.. వేలాది మంది హాజరు
7 Images
బుధవారం వినాయకుడికి ఈ వస్తువులు సమర్పించండి.. అనుగ్రహం మీ సొంతం
6 Images
అనంత చతుర్దశి.. గణపతి నిమజ్జనం.. వీటి విశిష్ట ఏంటి? దేనికి ప్రతీక
5 Images
కలలో గణపతి కనిపించాడా.? ఇక మీ కష్టాలన్నీ తీరిపోయినట్టే..
5 Images
అల్లు అర్జున్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ఫొటోస్ ఇదిగో
6 Images
వినాయక చవితి వేడుకల్లో జాన్వీ.. ఎంత అందంగా ఉందో చూశారా? ఫొటోస్
6 Images
గణేశుడి యుగాలలో.. 4 దివ్యవాహనాలు..కలియుగంలో ఏ వాహనం అంటే
8 Imagesవార్తలు
వినాయక చవితిని గణేష్ చతుర్థి లేదా వినాయక చతుర్థి అని కూడా అంటారు. కైలాస పర్వతం నుండి గణేశుడు తన తల్లి పార్వతీదేవితో కలిసి భూమికి వచ్చిన సందర్భంగా జరుపుకునే హిందూ పండుగ ఇది. ఈ పండుగలో భాగంగా మట్టి వినాయక విగ్రహాలను ఇళ్లు, బహిరంగ ప్రదేశాల్లో ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. నవరాత్రి పూజల తర్వాత అనంత చతుర్దశి పదో రోజున వినాయకుని విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు. ఈ ఏడాది ఆగస్టు 27వ తేదీ బుధవారం వినాయక చవితి పండుగను జరుపుకోనున్నారు.
గణేశ చతుర్థి పూజ సమయంలో గణేశుడికి మోదకం, లడ్డూ నైవేద్యంగా పెడతారు. గణేశుడికి ఇవి అంటే చాలా ఇష్టం అని నమ్ముతారు. భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. వినాయక చవితి రోజు భక్తులు ఉపవాసం ఉంటారు. పది రోజులు ప్రత్యేక పూజల తర్వాత గణపయ్య విగ్రహాలకు బహిరంగ ఊరేగింపుతో నది, సముద్రం లేదా సమీపంలోని జలాశయాల వద్ద అత్యంత కోలాహలంగా నిమజ్జనం నిర్వహిస్తారు. హైదరాబాద్‌లో హుస్సేన్ సాగర్‌తో పాటు ఇతర జలాశయాల్లో భారీ గణనాథుల విగ్రహాల నిమజ్జనం నిర్వహించడం సాంప్రదాయంగా వస్తోంది.
గణేష్ చతుర్థికి సంబంధించిన ప్రశ్నలు -సమాధానాలు
- ప్రశ్న – వినాయకుని తల్లిదండ్రులు ఎవరు?సమాధానం – పార్వతి పరమేశ్వరుల కుమారుడు వినాయకుడు. ఆయన పుట్టిన రోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు.
- ప్రశ్న – వినాయకుని వాహనమైన ఎలుక పేరు ఏంటి?సమాధానం – వినాయకుని వాహనం అనింద్యుడు అనే ఎలుక
- ప్రశ్న – వినాయకుడి సోదరుడు ఎవరు?సమాధానం – వినాయకుడి తమ్ముడు కుమారస్వామి. మహా బలశాలి అయిన కుమారస్వామి వాహనం నెమలి
- ప్రశ్న – వినాయకుడిని చూసి పకపక నవ్వినందుకు పార్వతీదేవి చేత శాపానికి గురైయ్యింది ఎవరు?సమాధానం – భుక్తాయాసంతో ఇబ్బందిపడుతున్న గణేశుడిని చూసి నవ్వినందుకు చంద్రుడు శాపానికి గురైయ్యాడు. అందుకే వినాయక చవితి నాడు చంద్రుడిని చూడరాదు.
- ప్రశ్న – బ్రిటీష్ వ్యతిరేక పోరాటంలో వినాయక చవితి వేడుకల ద్వారా దేశ ప్రజలను ఏకం చేసిన స్వాతంత్ర పోరాట యోధుడు ఎవరు?సమాధానం – లోకమాన్య తిలక్ వినాయక చవితి వేడుకలతో బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా దేశ ప్రజలను ఏకం చేశారు.