AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lord Ganesha: విఘ్నాలకధిపతికి నాలుగు యుగాల్లో ఒకొక్క పేరు.. ఒకొక్క వాహనం.. అవి ఏమిటంటే..

హిందువులు మొదటిగా పూజించే దేవుడు గణపతి. శివ పార్వతుల తనయుడు విఘ్నేశ్వరుడు విఘ్నాలను నివారించే దైవంగా పూజలను అందుకుంటున్నాడు. ఆది పూజ్యుడు వినాయకుడిని భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. పార్వతీదేవి పరమేశ్వరుల కుమారుడు వినాయకుడి జన్మదినాన్ని వినాయక చవితి పండుగగా జరుపుకుంటారు. వినాయక చవితి రోజు నుంచి తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్దలతో పూజిస్తారు. అయితే వినాయకుడి వాహనం అంటే ఎలుక అని అందరికీ తెలిసిందే. అయితే వివిధ యుగాల్లో వేరువేరు వాహనాలను కలిగి ఉన్నాడు. ఎలుకతో పాటు గణేష్ ఇతర వాహనాలు ఏమిటో తెలుసుకుందాం.

Surya Kala
|

Updated on: Aug 28, 2025 | 4:44 PM

Share
హిందువులు దేవుళ్ళను అత్యంత భక్తిశ్రద్దలతో పూజిస్తారు. అయితే పండగ, శుభకార్యాలు ఏ పని మొదలు పెట్టాలన్నా మొదటి పూజని గణేశుడిని పూజిస్తారు. ఇలా చేయడం వలన ఆటంకాలు తొలగి చేపట్టిన పనులు సక్సెస్ అవుతాయని నమ్మకం. విఘ్నేశ్వరుడు కళలకు, శాస్త్రాలకు అధిపతి.. బుద్ధికి, జ్ఞానానికి ఆరాధ్యుడిగా భావించి పూజలు చేస్తారు. గణపతి జన్మ, లీలల గురించి అనేక పురాణ గ్రంథాలు రకరకాల కథలను వివరిస్తూ ఉన్నాయి. వాటిల్లో ఒకటి వినాయకుడి వాహనాలు గురించి.. ప్రతి దేవుడు, దేవతకి ఒకొక్క వాహనం ఉంటుంది. అదేవిధంగా.. గణపతికి కూడా వివిధ యుగాలలో వేర్వేరు వాహనాలను కలిగి ఉన్నాడు. వాటి ప్రాముఖ్యత ఏమిటంటే...

1 / 8
ప్రతి సంవత్సరం భాద్రపద మాసం శుక్ల పక్ష చతుర్థి తిథిన వినాయక చవితి పండుగని జరుపుకున్నారు. ఈ పండుగ పది రోజుల పాటు కొనసాగుతుంది. ఈ సమయంలో భక్తులు గణపతి విగ్రహాన్ని ఇంటికి తీసుకువచ్చి ఇంట్లో ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించి పూజ చేశారు. ఈ విగ్రహాన్ని గంగమ్మ ఒడిలో నిమజ్జనం చేస్తారు. అయితే గణేష్ ఉత్సవం సమయంలో ఇంటికి తీసుకువచ్చే గణపతి విగ్రహంలో అతని వాహనం అయిన ఎలుక తప్పని సరిగా ఉండాలని నియమం ఉంది.

2 / 8
బొజ్జ గణపయ్యకు వాహనం ఎలుక మాత్రమే కాదు..  సింహం, నెమలి వంటి వివిధ రకాల వాహనాలను కూడా కలిగి ఉన్నాడు. యుగాన్ని బట్టి గణపతికి వాహనం ఉందని పురాణాల కథనం.

3 / 8
సత్యయుగంలో గణేశుడి వాహనం సింహం. అతనికి 10 చేతులు ఉన్నాయి. పేరు వినాయకుడు. గణేశుడు శివ పర్వతులకు జన్మించినప్పుడు.. అతనికి మహోత్కట వినాయకుడు అని పేరు పెట్టారు.

4 / 8

త్రేతాయుగంలో గణపతి వాహనం నెమలి. అందుకే ఆయనను మయూరేశ్వరుడు అని పిలుస్తారు. ఆయనకు ఈ యుగంలో ఆరు చేతులు ఉన్నాయి. రంగు తెలుపు.

5 / 8
ద్వాపరయుగంలో వినాయకుడి వాహనం ఎలుక. ఈ యుగంలో నాలుగు చేతులు ఉన్నాయి. ఈ యుగంలో అతను గజాననుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు. అతని రంగు ఎరుపు.

6 / 8
కలియుగంలో అతని వాహనం గుర్రం లేదా ఏనుగు .. అతని రంగు పొగ లాంటిది. ఈ యుగంలో గణపతికి రెండు చేతులు ఉన్నాయి. ఈ యుగంలో అతని పేరు ధూమ్రకేతు.

7 / 8
ఎలుక గనపతి వాహనంగా ఎలా మారిందంటే..  గణపతి ప్రధాన వాహనం ఎలుక. ఒకప్పుడు  క్రౌంచుడు అనే ముని అహంకారాన్ని చూసి ఇంద్రుడు క్రౌంచుడిని ఎలుకగా మారమని శపించాడని నమ్ముతారు. అతను ఒక పెద్ద ఎలుకగా మారిన తర్వాత చుట్టుపక్కల ప్రాంతంలో నష్టం కలిగిస్తూ భయభ్రాంతులకు గురి చేసేవాడు. అప్పుడు ఋషులు శ్రీ గణేష్‌ను స్తుతించినప్పుడు.. ఆ ఎలుకని తన పాశంతో బంధించాడు. ఎలుక గణపతికి క్షమాపణ చెప్పిన తర్వాత దాని గర్వాన్ని తొలగించి తన వాహనంగా చేసుకున్నాడు. తన బరువును మోసేలా శక్తిని ప్రసాదించాడని స్కంద పురాణం చెబుతుంది.

8 / 8