Viral Video: వినాయకుడి దర్శనం కోసం ఏకంగా 18 కి.మీ క్యూలైన్… వైరల్‌గా మారిన ముంబై లాల్‌బాగ్ గణేష్
ముంబై లాల్‌బాగ్ గణేష్ మహరాజ్ కొలువుదీరారు. గణేష్ చతుర్ధి సందర్భంగా.. లాల్‌బాగ్ రాజా దర్శనం కోసం భారీగా భక్తులు క్యూకట్టారు. ఇది లాల్‌బాగ్ రాజా 92వ గణేష్ మహోత్సవాలుగా నిర్వాహకులు చెబుతున్నారు. ఈసారి తిరుపతి వెంకన్న సన్నిధి థీమ్‌తో లాల్‌బాగ్ గణేషుడిని రూపొందించినట్లు మండల్ ప్రెసిడెంట్ బాలాసాహెబ్ కాంబ్లే...

ముంబై లాల్‌బాగ్ గణేష్ మహరాజ్ కొలువుదీరారు. గణేష్ చతుర్ధి సందర్భంగా.. లాల్‌బాగ్ రాజా దర్శనం కోసం భారీగా భక్తులు క్యూకట్టారు. ఇది లాల్‌బాగ్ రాజా 92వ గణేష్ మహోత్సవాలుగా నిర్వాహకులు చెబుతున్నారు. ఈసారి తిరుపతి వెంకన్న సన్నిధి థీమ్‌తో లాల్‌బాగ్ గణేషుడిని రూపొందించినట్లు మండల్ ప్రెసిడెంట్ బాలాసాహెబ్ కాంబ్లే చెబుతున్నారు. తిరుపతిలో బంగారువాకిలి థీమ్‌ను తీసుకుని.. ఇక్కడ గణేష్ మహరాజ్‌ను రూపొందించామన్నారు. అయితే ఈసారి ఎలాంటి వీఐపీ పాసులు మంజూరు చేయడంలేదని.. ఎవరైనా సరే భక్తుల క్యూలైన్లోనే రావాలన్నారు నిర్వాహకులు.
లాల్‌బాగ్ రాజా దర్శనం కోసం వేలాది మంది భక్తులు అర్ధరాత్రి నుండి క్యూలో ఉన్నారు. కిలోమీటర్ల కొద్దీ క్యూలో నిలబడి గణపతిని దర్శించుకుంటున్నారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. లాల్‌బాగ్ వినాయకుడిని దర్శనం కోసం భక్తుల భావోద్వేగ తీవ్రతను చాటి చెబుతున్నాయి. దర్శనానికి 20 గంటలకు పైగా సమయం పడుతుండటం పట్ల భక్తుల రద్ది ఏ మేరకు ఉందో అర్థమవుతోంది.
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలో, లాల్‌బాగ్ రాజా వెలుపల 18 కిలోమీటర్ల పొడవైన క్యూ ఏర్పడింది. అక్కడ భారీ జనసమూహం చుట్టూ నిలబడి, గోడలకు ఆనుకుని, వీధుల్లో దుప్పట్లు పరిచి నిద్రపోతున్నట్లు కనిపించింది. ఇది భక్తుల భద్రత, జనసమూహ నిర్వహణ సమస్యలను లేవనెత్తుతుంది. భక్తుల కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.
వీడియో చూడండి:
View this post on Instagram
Mumbai, Maharashtra: On the occasion of Ganesh Chaturthi, a huge crowd of devotees gathered to seek blessings of Lalbaugcha Raja pic.twitter.com/9F1vIrn5dG
— IANS (@ians_india) August 27, 2025
లాల్‌బాగ్ రాజా అనేది ముంబై సంస్కృతి, సంప్రదాయాలతో ముడిపడి ఉన్న ఆచారం. 1934 నుంచి ఇక్కడ గణపతిని ప్రతిష్టిస్తుండటం వల్ల అత్యంత పురాణ గణేష్ పూజగా పరిగణించబడుతుంది. 10 రోజుల గణేశ చతుర్థి వేడుకలో ప్రతిరోజూ 1.5 మిలియన్లకు పైగా భక్తులు దర్శించుకుంటారు. ఈ సంవత్సరం లాల్‌బాగ్ రాజా గణపతి 92 సంవత్సరాలు పూర్తి చేసుకుంటాడు.
