AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: ఇంట్లో వాస్తు దోషమా.. ఈ సింపుల్ టిప్స్ తో ఉపశమనం మీ సొంతం..

సనాతన ధర్మంలో వాస్తు, జ్యోతిష్య శాస్త్రాలకు ప్రముఖ స్థానం ఉంది. వాస్తు శాస్త్రం లో ఇంటి నిర్మాణం గురించి ఇంటిలో ఏర్పాటు చేసుకునే వస్తువుల గురించి అనేక నియమాలను వెల్లడించింది. నిర్మాణంలో చేసే తప్పులే కాదు.. ఇంటి లో పెట్టుకునే వస్తువు తప్పుడు స్థానాల్లో పెట్టుకుంటే.. ఆ ప్రభావం ఆ ఇంట్లో నివసించే వ్యక్తుల జీవితంపై చూపిస్తుంది. ఒకవేళ ఎవరి ఇంట్లోనైనా చిన్న చిన్న వాస్తు దోషాలు ఉంటే.. కేవలం 10 నిమిషాల సమయం కేటాయించి సింపుల్ టిప్స్ తో సరి చేసుకోండి.

Vastu Tips: ఇంట్లో వాస్తు దోషమా.. ఈ సింపుల్ టిప్స్ తో ఉపశమనం మీ సొంతం..
Vastu Tips For Home
Surya Kala
|

Updated on: Aug 28, 2025 | 2:20 PM

Share

నేటి వేగవంతమైన జీవితంలో ప్రతి ఒక్కరూ తమ ఇల్లు, ఆఫీసులో శాంతి, శ్రేయస్సు , సానుకూలతను కోరుకుంటారు. వాస్తు శాస్త్రం శక్తి సమతుల్యత, జీవితంలో శుభ ప్రభావాలను తీసుకురావడానికి సంబంధించిన శాస్త్రంగా పరిగణించబడుతుంది. ఇంటి నిర్మాణంలో లేదా ఇంటిలో పెట్టుకునే వస్తువుల విషయంలో ఏదైనా దోషాలు ఉంటే దోష నివారణ కోసం పెద్ద మార్పులు చేయవలసిన అవసరం లేదు. మీ జీవితంలో 10 నిమిషాలను కేటాయించి సులభమై, ప్రభావవంతమైన వాస్తు చిట్కాలను అనుసరించి వాస్తు దోషం నుంచి ఉపశమనం పొందవచ్చు.

  1. ప్రధాన ద్వారం ప్రాముఖ్యత: ప్రధాన ద్వారం ఇంట్లో మొదటి .. అతి ముఖ్యమైన భాగం. ఇది ఇంట్లోకి వచ్చే శక్తికి ప్రవేశ ద్వారం. ఎల్లప్పుడూ తలుపును శుభ్రంగా ఉంచండి. తలుపు దగ్గర కాంతి ఉండేలా చేసుకోండి లేదా దీపం వెలిగించండి. తలుపుపై ​​’ఓం’ లేదా ‘స్వస్తిక్’ వంటి శుభ చిహ్నాలను వేయడం వలన కూడా సానుకూలతను ఆకర్షిస్తుంది.
  2. వాస్తు శాస్త్రం ప్రకారం ఉప్పు ప్రతికూల శక్తిని గ్రహించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. గది మూలలో ఒక గాజు పాత్రలో రాతి ఉప్పును ఉంచండి. ఇది వాతావరణంలో ఉన్న ప్రతికూలతను తొలగిస్తుంది. మానసిక ప్రశాంతతను అందిస్తుంది. ప్రతి వారం ఉప్పును మార్చాలని గుర్తుంచుకోండి.
  3. నీటి: ఈశాన్య దిశను అత్యంత శుభప్రదమైన దిశగా భావిస్తారు. ఇంట్లో ఈ భాగంలో నీటితో నిండిన పాత్ర, ఫౌంటెన్ లేదా చిన్న అక్వేరియం ఉంచడం వల్ల సానుకూల శక్తి ప్రవాహాన్ని పెంచుతుంది. ఇది మానసిక ప్రశాంతతకు, సంపద పెరుగుదలకు దారితీస్తుంది.
  4. మొక్కలు, పచ్చదనం: ఇంట్లో పచ్చదనాన్ని తీసుకురావడం వాస్తు దృక్కోణంలో చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. తులసి, మనీ ప్లాంట్, లక్కీ ప్లాంట్, కలబంద వంటి మొక్కలు పర్యావరణాన్ని శుద్ధి చేయడమే కాకుండా ఇంట్లో ఆనందం, శ్రేయస్సు, అదృష్టాన్ని కూడా తెస్తాయి. మొక్కలు ఎల్లప్పుడూ పచ్చగా ఉండాలని గుర్తుంచుకోండి. ఎండిన, వాడిన మొక్కలను ఉంచవద్దు.
  5. ఇవి కూడా చదవండి
  6. అద్దం సరైన దిశ: అద్దం శక్తిని రెట్టింపు చేస్తుంది. కనుక దీనిని ఎప్పుడూ మంచం ముందు ఉంచవద్దు ఎందుకంటే అది సంబంధాలను ప్రభావితం చేస్తుంది. అద్దంను ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉంచడం అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది.
  7. వంటగదిలో నీరు, నిప్పు కలిపి ఉంచవద్దు: వంటగదిలో నీరు, నిప్పు కలిపి ఉంచవద్దు. గ్యాస్ స్టవ్ ఆగ్నేయ దిశలో పెట్టుకోవాలి. నీటిని ఉత్తర దిశలో ఉంచాలి. ఇది కుటుంబంలో శాంతి, ఆనందం, మంచి ఆరోగ్యాన్ని పెంచుతుంది.
  8. వాసన, ధ్వని కూడా ముఖ్యమైనవి: ఇంటి వాతావరణాన్ని మార్చడానికి ధ్వని, సువాసన చాలా ముఖ్యమైనవి. ప్రతి ఉదయం , సాయంత్రం ఇంట్లో కర్పూరం, అగరుబత్తులు లేదా సాంబ్రాణిని వెలిగించండి. మంత్రాలు పఠించండి లేదా శ్రావ్యమైన సంగీతాన్ని ప్లే చేయండి. ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచడమే కాదు ఇంటిలోని ప్రతికూల శక్తిని కూడా తొలగిస్తుంది.
  9. బెడ్ రూమ్ వాస్తు: బెడ్ రూమ్ ని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచండి. బెడ్ రూమ్ నైరుతి దిశలో ఉండాలి. బెడ్ ను దక్షిణం లేదా పడమర వైపు ఉంచి.. తల ఉత్తరం లేదా తూర్పు వైపు ఉంచి పడుకోవాలి.. బెడ్ రూమ్ లో లేత రంగులను ఉపయోగించడం వల్ల సంబంధాలు బలపడతాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.