- Telugu News Photo Gallery Spiritual photos September 2025 Grah Gochar: Transit of four planets may get good luck these three zodiac signs
Planets Transit: సెప్టెంబర్‌లో 4 గ్రహాల సంచారం.. ఈ మూడు రాశులకు మహర్దశ.. ఆకస్మిక ధన లాభం..
మరి కొన్ని రోజుల్లో సెప్టెంబర్ నెలలో అడుగు పెట్టనున్నాం.. జ్యోతిషశాస్త్ర దృక్కోణంలో సెప్టెంబర్ 2025 లో ఒక పెద్ద మార్పు జరగబోతోంది. ఈ నెలలో సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు తమ రాశులను మార్చుకుంటారు. ఈ గ్రహాల సంచారము వలన మొత్తం అన్ని రాశులు ప్రభావితం అవుతాయి. అయితే కొంతమందికి ఈ సమయం జీవితంలో కొత్త శక్తిని, పురోగతిని, శుభ అవకాశాలను తెస్తుంది. సెప్టెంబర్ నెలలో ఏ రాశులకు ఎక్కువ ప్రయోజనం కలుగుతుందో తెలుసా
Updated on: Aug 28, 2025 | 1:13 PM

సెప్టెంబర్ 2025లో గ్రహాల సంచారం అనేక రాశులకు శుభప్రదంగా ఉంది. ఈ నెల సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు తమ స్థానాలను మార్చుకోనున్నారు. సెప్టెంబర్ 13న కుజుడు తులారాశిలోకి ప్రవేశిస్తాడు, సెప్టెంబర్ 15న శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. సెప్టెంబర్ 17న సూర్యుడు, బుధుడు కన్యారాశిలోకి ప్రవేశించి బుధాదిత్య యోగాన్ని ఏర్పరుస్తారు. ఇది జీవితంలో సానుకూల మార్పులను తెస్తుంది. ఈ గ్రహ సంచారం వల్ల ఏ రాశులకు ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందో తెలుసుకుందాం.

వృషభ రాశి: సెప్టెంబర్ నెలలో వృషభ రాశి వారికి కొత్త ఆశలు, పురోగతికి అవకాశాలను తెస్తుంది. కెరీర్‌లో పురోగతి ఉంటుంది. పోటీ పరీక్షల ఫలితాలు వీరికి అనుకూలంగా ఉండవచ్చు. వ్యాపారవేత్తలు ప్రత్యేక విజయాన్ని పొందుతారు. కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎప్పటి నుంచో తీరని కోరికలు నెరవేరే అవకాశాలు ఉన్నాయి.

సింహ రాశి: ఈ నెలలో సూర్యుడు వీరి జాతకంలో రెండవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఇది ఆర్థిక లాభం పొందే అవకాశాలను పెంచుతుంది. వ్యాపారవేత్తలకు లాభదాయకమైన ఒప్పందాలు లభించవచ్చు. ఈ రాశికి చెందిన వ్యక్తుల ప్రయత్నాలతో ఆఫీసులో ప్రశంసలను అందుకుంటారు. మీ తల్లిదండ్రుల నుంచి వీరికి తగిన మద్దతు లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది విదేశీ పర్యటనకు కూడా వెళ్ళవచ్చు.

ధనుస్సు రాశి: ధనుస్సు రాశి వారికి సెప్టెంబర్ నెల ఆనందంగా ఉంటుంది. ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలను పర్యటన చేసే అవకాశం ఉంది. ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. పొదుపు చేసిన సంపద పెరుగుతుంది. మీరు కెరీర్‌లో శుభవార్త పొందవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. వైవాహిక, ప్రేమ సంబంధాలు బలపడతాయి. ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది.




