- Telugu News Spiritual Know about Prayagraj Adi Ganesh temple where first worship of Lord Ganesh started
Vinakaya Chavithi 2025: విశ్వంలోనే ఫస్ట్ గణపతి ఆలయం.. శివ, బ్రహ్మలతో పూజలు అందుకున్న గణపయ్య.. ఎక్కడంటే..
భారత దేశం ఆధ్యాత్మికత నెలవు. అనేక దేవాయలున్నాయి. అలాంటి ఆలయాల్లో శివ పార్వతుల తనయుడు విఘ్నాలకధిపతి అయిన గణేష్ కి అంకితం చేయబడిన ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయాలను దర్శించుకోవడం వలన గణపయ్య అనుగ్రహం కలుగుతుందని నమ్మకం. అంతేకాదు గణపతి పుట్టిన రోజుని వినాయక చవితిగా పండగగా దేశ వ్యాప్తంగా జరుపుకుంటారు. వినాయక చవితి పండగ సందర్భంగా గల్లీ గల్లీ మండపాలు వెలిశాయి. గణపయ్య విగ్రహాలు పెట్టి పూజలు చేయడం మొదలు పెట్టారు. అయితే దేశంలోనే కాదు విశ్వంలోనే మొట్టమొదటి గణపతి ఆలయం ఎక్కడ ఉందో మీకు తెలుసా..
Updated on: Aug 28, 2025 | 4:45 PM

దేశంలో గణపతి నవ రాత్రుల పండుగ వినాయక చవితితో ప్రారంభమైంది. అనేక ప్రదేశాలలో గణేష్ విగ్రహాలను ప్రతిష్టించారు. ఈ శుభ సందర్భంగా విశ్వంలోని మొట్టమొదటి గణేష్ ఆలయంగా పరిగణించబడే విఘ్నవినాయకుని అసలు రూపాన్ని దర్శనం చేసుకోవడానికి భక్తులు ప్రయాగ్‌రాజ్‌లోని సంగం నగరంలోని గంగా నది ఒడ్డుకు చేరుకుంటారు.

గంగా నది ఒడ్డున త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఏక రూపమైన ఓంకార్ ఆది గణేశుడిగా వ్యక్తమయ్యాడని పురాణం చెబుతోంది. ఆది గణేశుడిని పూజించిన తర్వాత బ్రహ్మ ఈ భూమిపై పది అశ్వమేధ యాగాలు చేసాడు. దీని ఫలితంగా గంగా తీరానికి దశాశ్వమేధ ఘాట్ అని, గణేశుడి విగ్రహానికి ఆది ఓంకార్ శ్రీ గణేశ అని పేరు పెట్టారు.

ఈ ఆలయ పూజారి అరుణ్ అగర్వాల్ మాట్లాడుతూ.. గణపతికి పూజ మొదటిసారిగా ఇక్కడ నుండే ప్రారంభమైందని చెప్పారు. ఓంకార్ ను మొదట ఇక్కడ నుండే పలికేవారు.. అందుకే ఈ ఆలయాన్ని ఓంకార గణేష మందిరం అని కూడా పిలుస్తారు.

రాక్షసుల దుష్ట దృష్టి నుండి ప్రపంచాన్ని రక్షించడానికి.. ప్రజాపతి తన చేతులతో విఘ్నరాజు రూపంలో గణపతిని ఇక్కడ వెలిసినట్లు పురాణ కథనం. అందుకే ఎక్కడ స్వామివారికి ఆది గణేష్ అని పేరు పెట్టారు. 'ఆ

'ఆది కల్పం' తొలినాళ్లలో ఓంకార్ గణేశునిగా అవతరించాడని పురాణాలు పెర్కొన్నాయని.. బ్రహ్మ తొలి పూజగా ఇక్కడ ఉన్న గణపతిని పూజించిన తర్వాతే విశ్వ సృష్టి ప్రారంభమైంది.

శివ మహాపురాణం ప్రకారం శివుడు కూడా త్రిపురాసురుడిని ఓడించే ముందు ఆది గణేశుడిని పూజించాడని నమ్మకం. ఆది గణేశుడి రూపంలో గణేశుడి రెండు అంశాలున్నాయి. విధాన్‌హర్త (అడ్డంకులను తొలగించేవాడు) ,వినాయకుడు (దయాళువు)గా పూజించబడుతున్నాడు. ఇవి గణపతి శాశ్వత ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తాయి.

ఆలయంలో ప్రతిష్టించిన గణేశ విగ్రహం యొక్క ఖచ్చితమైన ప్రాచీనత అస్పష్టంగానే ఉందని ఆలయ పూజారి సుధాంషు అగర్వాల్ పంచుకున్నారు

ఈ గణపతి అసలు రూపానికి అక్బర్ ఆర్థిక మంత్రి తోడర్మల్ కొత్త రూపాన్ని ఇచ్చాడు. తోడర్మల్ .. గణపతికి మంచి భక్తుడు. కనుక అతను గంగా నది ఒడ్డున ఉన్న ఈ గణేష్ ఆలయాన్ని పునరుద్ధరించాడు. ఈ గణపతి ఆలయానికి సంబంధించిన చారిత్రక ఆధారాలు నేటికీ ఉన్నాయి.

ఇక్కడ ప్రతి ఉదయం, సాయంత్రం గణపతిని ఆభరణాలతో అందంగా అలంకరిస్తారు. ప్రయాగ్‌రాజ్ లో ప్రస్తుతం వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గంగా నది ప్రవాహం ఆది గణేష్ ఆలయంలోకి ప్రవేశించింది. ఆలయంలో సగం గంగా నీటిలో మునిగిపోయింది. అయినప్పటికీ గణపతి భక్తులు నీటిలోకి దిగి ఆయనను పూజిస్తున్నారు.




