AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: అమ్మాయిలూ ఇటువంటి లక్షణాలున్న మగాళ్ళని నమ్మితే.. మీ జీవితం అధోగతే.. తస్మాత్ జాగ్రత్త

ఆచార్య చాణక్యుడు తన అనుభవాలు .. సమాజంలోని మనుషుల మనసు, ఆలోచనలను అధ్యయనం తర్వాత కొన్ని విధానాలను నీతి శాస్త్రంలో పేర్కొన్నాడు. అలా ఆచార్య చాణక్యుడు కొన్ని వందల ఏళ్ల క్రితం మానవ జీవితం గురించి చెప్పిన విషయాలు.. నేటికీ చాలా ఉపయోగకరమైన విషయాలని పెద్దలు చెబుతారు. తన విధానాల ద్వారా ఎటువంటి వ్యక్తుల సహవాసం మన జీవితానికి మంచిది.. ఎవరి నుండి దూరం పాటించాలో చెప్పాడు. చాణక్య నీతి ప్రకారం.. ఎప్పుడూ నమ్మకూడని కొంతమంది యువకులున్నారు. వీరిని నమ్మడం వల్ల.. సామాజిక సమస్యలు వస్తాయని చెప్పాడు.

Chanakya Niti: అమ్మాయిలూ ఇటువంటి లక్షణాలున్న మగాళ్ళని నమ్మితే.. మీ జీవితం అధోగతే.. తస్మాత్ జాగ్రత్త
Chanakya Niti
Surya Kala
|

Updated on: Aug 28, 2025 | 12:18 PM

Share

చాణక్య నీతి అనేది ఆచార్య చాణక్యుడు రాసిన పురాతన భారతీయ గ్రంథం. ఇది జీవితంలో ఏది సరైనది, ఏది తప్పు వంటి అనేక విషయాల గురించి.. రకరకాల వ్యక్తులను గుర్తించే కళను మనకు నేర్పుతుంది. చాణక్య ప్రకారం కొంతమంది యువకులను స్త్రీలు నమ్మడం అత్యంత ప్రమాదకరం. ఇలాంటి లక్షణాలున్న అబ్బాయిలను నమ్మడం ద్వారా సామాజికంగా, మానసికంగా హాని పొందవలసి ఉంటుంది. సమాజంలో మీ పేరు కూడా చెడిపోవచ్చు. దీనితో పాటు, మీరు అనేక ఇతర రకాల సమస్యలను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది.

ఎవరికైనా సరే వ్యక్తిత్వమే అతని గొప్ప ఆస్తి అని చాణక్య చెప్పాడు. బలహీనమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులను నమ్మడం ఇబ్బందులను ఆహ్వానించడమే. అంతేకాదు ప్రవర్తన , ఉద్దేశాలు అనుమానాస్పదంగా ఉండే కొన్ని రకాల వ్యక్తుల పట్ల మహిళలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. చాణక్య నీతి ప్రకారం స్త్రీలు ఏ అబ్బాయిలను నమ్మకూడదో తెలుసుకుందాం.

అబద్ధం చెప్పే వ్యక్తులు: చాణక్య నీతి ప్రకారం పదే పదే అబద్ధాలు చెప్పే అబ్బాయిలను ఎప్పటికీ నమ్మవద్దు. అలాంటి వ్యక్తులు తమ స్వలాభం కోసం సత్యాన్ని వక్రీకరిస్తారు. ఇటువంటి వ్యక్తులు తరచుగా మాట మారుస్తూ విరుద్ధంగా ప్రకటనలు చేస్తూ ఉంటారు. వీరు మాటలు సమయానికి అనుగుణంగా, కాలంతో పాటు మారుతూ ఉంటాయి. అలాంటి వారిని గుడ్డిగా నమ్మవద్దు. ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు వారి మాటల సత్యాన్ని తనిఖీ చేయాలి.. వీరి గత ప్రవర్తనను విశ్లేషించమని యువతులను హెచ్చరిస్తున్నాడు చాణక్య.

ఇవి కూడా చదవండి

స్వార్థపరులు: చాణక్యుడు చెప్పినట్టు స్వార్థపరుడు తన స్వార్థం కోసమే ఇతరులతో సంబంధాలను కొనసాగిస్తాడు. అలాంటి వ్యక్తులు స్నేహితులుగా లేదా సంబంధాలు కలిగి ఉన్నట్లు నటిస్తారు, కానీ వారి ఉద్దేశ్యం నెరవేరిన వెంటనే.. అవసరం తీరిన వెంటనే మిమ్మల్ని విడిచి పెడతారు. ఇటువంటి వ్యక్తులు మీ నుంచి ఏదైనా అవసరమైనప్పుడు మాత్రమే మీ వద్దకు వస్తారు. వీరి మాటలు ముఖస్తుతి, కృత్రిమతను ప్రతిబింబిస్తాయి. ఇలాంటి వ్యక్తులతో వ్యక్తిగత లేదా గోప్యమైన సమాచారాన్ని పంచుకోవద్దు. వీరితో వ్యవహరించేటప్పుడు మీ పరిమితులను స్థిరంగా ఉంచుకోవాలని సూచించాడు చాణక్య.

వ్యక్తిత్వం లేని వ్యక్తులు: చాణక్య నీతిలో వ్యక్తిత్వాన్ని అత్యంత ముఖ్యమైన విషయంగా పరిగణిస్తారు. నైతికత, సూత్రాలపై రాజీపడే వ్యక్తులను నమ్మడం ప్రమాదకరం. ఈ వ్యక్తులు ఇతరుల భావాలను గౌరవించరు . తాము చెప్పిన మాటలు, చేసిన వాగ్దానాలను ఉల్లంఘించడానికి వెనుకాడరు. అలాంటి వ్యక్తుల నుంచి దూరంగా ఉండాలి. మీరు బలవంతంగా వారితో కలిసి నడవాల్సి వస్తే, ఎల్లప్పుడూ రాతపూర్వకంగా ఒప్పందాలు చేసుకోండి. జాగ్రత్తగా ఉండండి.

అసూయపడే, ప్రతికూల ఆలోచనలున్న వ్యక్తులు: చాణక్యుడి ప్రకారం ఇతరుల విజయాలను చూసి అసూయపడేవారు లేదా ఎల్లప్పుడూ ప్రతికూలతను వ్యాప్తి చేసే వ్యక్తులు మీకు ద్రోహం చేయవచ్చు. ఈ వ్యక్తులు మీ విజయాలను విమర్శిస్తారు లేదా మీ వెనుక చెడుగా మాట్లాడతారు. మీ ప్రణాళికలు, కలలను వారితో పంచుకోవడం మానుకోండి. వీరితో ఉండే సమయంలో అధికారాన్ని ప్రదర్శించండి. కానీ లోతైన సంబంధాలను ఏర్పరచుకోవద్దు అని చెప్పాడు.

అస్థిరమైన ఆలోచనలు: చాణక్య నీతి ప్రకారం తాము తీసుకున్న నిర్ణయాలను అమలు చేసే సమయంలో అస్థిరంగా ఉంచి.. తరచుగా మనసు మార్చుకునే వ్యక్తులను నమ్మలేమని చాణక్య చెప్పాడు. ఈ వ్యక్తులు ఎప్పుడూ స్పష్టమైన సమాధానాలు ఇవ్వరు.. బాధ్యతల నుంచి పారిపోతారు. కనుక ఇటువంటి వారితో దీర్ఘకాలిక ప్రణాళికలు వేయవద్దు. చిన్న పనులకు కూడా వీరిపై ఆధారపడే ముందు వీరి గత ప్రవర్తన గురించి తెలుసుకోండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.