- Telugu News Photo Gallery Spiritual photos Anantha Chaturdashi and Ganapati immersion, What is special about these? What does it symbolize?
అనంత చతుర్దశి.. గణపతి నిమజ్జనం.. వీటి విశిష్ట ఏంటి.? దేనికి ప్రతీక.?
దేశవ్యాప్తంగా గణపతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పది రోజులు, ప్రజలు కలిసి జరుపుకుంటారు. కానీ చివరి రోజు గణేశుని వీడ్కోలు పలుకుతూ నిమజ్జనం చేయడం ఆనవాయితీ. అయితే విష్ణువుకి ప్రియమైన అనంత చతుర్దశి రోజున నిమజ్జం వేడుకలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. మరీ ఈ అనంత చతుర్దశి విశిష్ట ఏంటి.? ఈరోజున నిమజ్జనం వల్ల ఎలాంటి ప్రయోజనులు ఉంటాయి.? ఈరోజు మనం తెలుసుకుందాం..
Updated on: Aug 31, 2025 | 12:41 PM

భాద్రపద మాసం శుక్లపక్ష చతుర్దశి రోజున జరుపుకునేడే అనంత చతుర్దశి. ఈ పవిత్ర దినం అనంత శేష సర్పంపై పవళించి ఉన్న విష్ణువుకు అంకితం చేయబడింది. ఈ రోజున భక్తులు శ్రేయస్సు, రక్షణ, ఆధ్యాత్మిక విముక్తి కోసం విష్ణువుని స్మరించు కొంటూ అనంత వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ రోజున భక్తులు అనంత దారాన్ని కట్టి, భగవంతుడితో శాశ్వతమైన బంధాన్ని, అనంతమైన కృపను పొందుతారు.

అనంత చతుర్దశి అనేది భారతదేశ ఆధ్యాత్మిక సంప్రదాయాలను కలిపే ఒక పండుగ. దాని మూలాల గురించి అనేక కథలు ఉన్నాయి. మహాభారతంలో, పాండవుల వనవాస సమయంలో అనంత ప్రతిజ్ఞను పాటించమని శ్రీకృష్ణుడు యుధిష్ఠిరుడికి సలహా ఇస్తాడు. 12 సంవత్సరాల వనవాసం, 13వ సంవత్సరం అజ్ఞాతవాసం తర్వాత, అనంతుని ప్రతిజ్ఞ వారు కోల్పోయిన రాజ్యాన్ని తిరిగి పొందడంలో సహాయపడుతుందని చెప్పబడింది.

ఈ రోజునే గణపతి నవరాత్రి ఉత్సవాలు ముగించుకొని గంగమ్మ ఒడిలో చేరుతాడు. అనంత చతుర్దశి నాడు గణేష్ నిమజ్జం మనకు జీవిత సత్యాలను, నమ్మకాన్ని బోధిస్తుంది. అవి అంతర్గత బలాన్ని ప్రేరేపిస్తాయివిశ్వాసం, ధైర్యం, రక్షణతో కొత్త ప్రయాణాలను ప్రారంభించడానికి సహాయపడుతుంది. ఇది జనన-మరణలు, ప్రారంభ-ముగింపులు రెండింటినీ సూచిస్తుంది. కొత్తగా ప్రారంభలకు పవిత్రమైన రోజు ఇది.

విష్ణువును భక్తితో స్మరిస్తూ, గణేశుడిని ప్రియమైన రూపంగా నిమజ్జినం చేయడం జీవిత సారాంశాన్ని సూచిస్తుంది. విష్ణువును విశ్వానికి తండ్రిగా స్మరిస్తూ గణేశుడికి వీడ్కోలు చెప్పడం ద్వారా, వదిలివేయడం నష్టం కాదని, అది కొనసాగింపు అని మనకు గుర్తు చేయబడింది.

గణేష్ నిమజ్జనం, అనంత్ చతుర్దశి ఆధ్యాత్మిక చింతన మాత్రం మన జీవితాల్లో సానుకూలతను తీసుకురావడానికి కొన్ని పాఠాలను చెపుతున్నాయి. తాత్కాలిక, శాశ్వతమైన రెండింటినీ గౌరవించి ఎలా జీవించాలో ఈ పండుగ మనకు సూచిస్తుంది.




