- Telugu News Photo Gallery Spiritual photos According to Chanakya, these mistakes in youth are the path to problems.
చాణక్యడు ప్రకారం.. యవ్వనంలో ఈ తప్పులు.. సమస్యలకి రహదారులు..
ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో యవ్వనంలో చేయాల్సిన పనులను కూడా బోధించాడు.. కొన్ని తప్పటడుగులు వేయడం వల్ల వృద్ధాప్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటారని వివరించాడు. అందుకే.. చిన్న వయస్సులో కొన్ని తప్పులు చేయకూడదని చెప్పాడు.. వీటి కారణం బివిష్యత్తులో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరీ చాణక్యుడు ఏం చెప్పాడు. ఈరోజు మనం ఈ స్టోరీలో తెలుసుకుందాం పదండి..
Updated on: Aug 30, 2025 | 7:04 PM

వాస్తవానికి పురుషులు, మహిళలు భవిష్యత్తులో ప్రభావితం చేసే అనేక తప్పులు చేస్తారు... ఆ తప్పులు ఏంటి అనేది ఆచార్య చాణక్యుడు తన చాణక్యనీతిలో వివరించాడు.. అందుకే కొన్ని విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి.. ఆచితూచి అడుగు వేయాలి..

వాస్తవానికి యవ్వనంలో చాలా పనులు చేయాలనే అభిరుచి ఉంటుంది. కాబట్టి తెలిసి కొన్ని.. తెలియక కొన్ని చేసే తప్పులు ఎక్కువగా ఉంటాయి.. యవ్వనంలో చేసే ఇలాంటి కొన్ని తప్పిదాలు మీ ఆయుష్షును తగ్గిస్తాయి.. అని చాణక్యనీతిలో పేర్కొన్నాడు.. ఇరవై సంవత్సరాల తర్వాత ఇలాంటి తప్పులు చేయవద్దని ఆచార్య చాణక్యుడు సూచించారు.

సమయం వృధా: సమయం చాలా విలువైనది. ఒక్కసారి వెళితే తిరిగి రాలేదు.. కాబట్టి వృధా చేయవద్దు. సమయాన్ని వృధా చేసేవారు జీవితాంతం అనేక సమస్యలను ఎదుర్కొంటారు. జీవితంలో విజయం సాధించాలంటే సమయపాలన చాలా ముఖ్యం.

సోమరితనం: ప్రతి పనికి సిద్ధంగా ఉండండి. మీ పనిని సమయానికి చేయండి. ఇది జీవితంలో విజయావకాశాలను పెంచుతుంది. సోమరితనం వల్ల ప్రతిదీ ఇబ్బందికరంగా మారుతుంది.. చేయాల్సిన పని వాయిదా పడుతుంది.

డబ్బు వృధా: డబ్బును తెలివిగా ఖర్చు చేయాలి. డబ్బు ప్రాముఖ్యతను చిన్నవయసులోనే గుర్తించాలి. భవిష్యత్తులో వచ్చే సంక్షోభాలలో డబ్బు ఉపయోగపడుతుంది. అందుకే.. డబ్బు వృద్ధాను అరికట్టి.. పొదుపు చేసుకోవాలి.




