AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Financial Growth: కీలక గ్రహాల అనుకూలత.. ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారం!

జ్యోతిష శాస్త్రంలో 3, 6, 10, 11 స్థానాలను ఉపచయ స్థానాలుగా గుర్తించడం జరిగింది. ఉపచయ స్థానాలంటే వృద్ధి లేదా పురోగతి స్థానాలని అర్థం. ఈ నాలుగు రాశుల్లో ఉన్న గ్రహాలను బట్టి జాతకుల పురోభివృద్ధిని అంచనా వేయడం జరుగుతుంది. ఈ నాలుగు స్థానాలలోనూ గ్రహాలున్న పక్షంలో ఆకాశమే హద్దుగా వీరి అభివృద్ధి సాగిపోతుంది. ఒకే ఒక గ్రహం ఉంటే అభివృద్ధి లేదా వృద్ధి సామాన్యంగా ఉంటుంది. అయితే, ఈ నాలుగు స్థానాల్లో గ్రహాలు ఉండడం అనేది అవసరం. శుభ గ్రహాలకు, పాప గ్రహాలకు ఈ నాలుగు స్థానాలు చాలా మంచిది. మేషం, వృషభం, మిథునం, తుల, ధనుస్సు, మకర రాశులకు మరో నెల రోజుల పాటు ఈ వృద్ధి యోగం పట్టే అవకాశం ఉంది.

TV9 Telugu Digital Desk
| Edited By: Janardhan Veluru|

Updated on: Aug 30, 2025 | 5:37 PM

Share
మేషం: ఈ రాశివారికి మూడవ స్థానంలో గురువు, 6వ స్థానంలో కుజుడు, 11వ స్థానంలో రాహువు సంచారం చేస్తున్నందు వల్ల ఉద్యోగంలో తప్పకుండా అంచనాలను మించిన అభివృద్ధి లేదా పురోగతి ఉంటుంది. ఉద్యోగాల్లో అధికార యోగం చేపట్టడానికి, మంచి సంస్థల్లోకి మారడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. ప్రత్యర్థులు, శత్రువులు, పోటీదార్ల మీద విజయాలు సాధిస్తారు. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. అనారోగ్యాల నుంచి విముక్తి లభిస్తుంది.

1 / 6
వృషభం: ఈ రాశివారికి 3వ స్థానంలో శుక్రుడు, 10వ స్థానంలో రాహువు, 11 వ స్థానంలో శనీశ్వరుడు ఉండడం వల్ల దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా అంద లాలు ఎక్కుతారు. ఉద్యోగంలో శీఘ్ర పురోగతికి, వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరగడానికి అవకాశం ఉంది. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. షేర్లు, స్పెక్యులేషన్ల వంటి అదనపు ఆదాయ ప్రయత్నాల్లో ఆశించిన లాభాలు కలుగుతాయి.

2 / 6
మిథునం: ఈ రాశివారికి ప్రస్తుతం తృతీయ స్థానంలో రవి, బుధ, కేతువులు, 10వ స్థానంలో శని సంచారం వల్ల కొద్ది ప్రయత్నంతో విదేశాల్లో ఉద్యోగం సంపాదించడానికి అవకాశం ఉంది. గృహ, వాహన ప్రయత్నాలకు కూడా సమయం అనుకూలంగా ఉంది. ఉద్యోగులు పదోన్నతులు పొందుతారు. ఆర్థికంగా బాగా పురోగతి సాధిస్తారు. ఆర్థిక సమస్యలన్నీ పరిష్కారం కావడంతో పాటు ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆస్తి వివాదం ఒక కొలిక్కి వస్తుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది.

3 / 6
తుల: ఈ రాశివారికి 6వ స్థానంలో శనీశ్వరుడు, 10వ స్థానంలో శుక్రుడు, 11వ స్థానంలో రవి, బుధ, కేతువు సంచారం వల్ల వృత్తి, ఉద్యోగాల పరంగా ఊహించని పురోగతి ఉంటుంది. పదోన్నతికి, జీత భత్యాల పెరుగుదలకు బాగా అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో మరింత మంచి ఉద్యోగంలోకి మారడం కూడా జరగవచ్చు. అనేక వైపుల నుంచి ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులతో లాభాల పంట పండుతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందుతుంది.

4 / 6
ధనుస్సు: ఈ రాశివారికి 3వ స్థానంలో రాహువు, 10 వ స్థానంలో కుజుడి సంచారం కొండంత అండగా నిలుస్తాయి. ఈ రాశివారు ఏ రంగంలో ఉన్నా అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. ఆదాయానికి లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. ఆదాయ వృద్ధికి ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా బాగా కలిసి వస్తుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా అవకాశం ఉంది. జీవితంలో విజయాలు, సాఫల్యాలు బాగా ఎక్కువగా ఉంటాయి.

5 / 6
మకరం: ఈ రాశివారికి 3వ స్థానంలో ఉన్న శనీశ్వరుడు, ఆరవ స్థానంలో గురువు సంచారం వల్ల అంచనాలకు మించిన ఆర్థికాభివృద్ధికి అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు దాదాపు పూర్తిగా పరిష్కారమై, మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఉద్యోగంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంతో విదేశీ అవకాశాలు అందుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఉద్యోగాల్లో అతి వేగంగా పురోగతి ఉంటుంది.

6 / 6