- Telugu News Photo Gallery Good luck to the three zodiac signs with the transit of three planets in the month of September
మూడు గ్రహాల సంచారం.. మూడు రాశుల వారికి అదృష్టం!
నేడు ఆగస్టు 31. ఈరోజుతో ఆగస్టు నెల ముగిసిపోయి, సెప్టెంబర్ నెల ప్రారంభం కాబోతుంది. అయితే సెప్టెంబర్ నెలలో అనేక పండుగలు ఉన్నాయి. అంతే కాకుండా ఈ నెలలో అనేక శుభయోగాలు కూడా కలగనున్నాయంట. ఇది 12 రాశులను ప్రభావితం చేస్తుందంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.
Updated on: Aug 31, 2025 | 6:07 PM

ప్రతి నెల గ్రహాల సంచారం లేదా? గ్రహాల కలయిక అనేది సహజం. అయితే ఈ సెప్టెంబర్ నెలలో మూడు గ్రహాలు సంచారం చేయనున్నాయి. దీని ప్రభావం 12 రాశులపై ఉండగా, మూడు రాశుల వారికి మాత్రం అదృష్టం కలగనున్నదని చెబుతున్నారు పండితులు.

సెప్టెంబర్ నెలలో శక్తివంతమైన గ్రహాల్లో ఒక్కటైనా సూర్య గ్రహంతో పాటు, కుజ గ్రహం, బుధ గ్రహాలు సంచారం చేయనున్నాయి. ఈ నెల 13వ తేదీన కుజుడు తుల రాశిలోకి సంచారం చేయగా, సెప్టెంబర్ 15 న బుధ గ్రహం సింహ రాశిలోకి సంచారం చేయనుంది. అలాగే సెప్టెంబర్ 17 కన్యా రాశిలోకి సంచారం చేయనున్నాడు. దీని వలన బుధాదిత్య రాజయోగం ఏర్పడి మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

వృషభ రాశి : వృషభ రాశి వారికి సెప్టెంబర్ నెల అదృష్టం తీసుకొస్తుందనే చెప్పాలి. ఎందుకంటే ఈ నెలలో మూడు గ్రహాల సంచారం వృషభ రాశి వారిపై సానుకూల ప్రభావం చూపుతుంది. అంతే కాకుండా వీరికి పట్టిందల్లా బంగారమే కానుంది. విద్యార్థులు, వ్యాపార వేత్తలు అనుకోని విధంగా ప్రయోజనాలు పొందుతారు. పెట్టుబడులు పెట్టాలి అనుకునే వారికి కూడా ఇది మంచి సమయం. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు పొందుతారు.

సింహ రాశి : సింహ రాశి వారికి అనుకోని విధంగా ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. బుధ, సూర్యగ్రహం, కుజ గ్రహం సంచారం వలన ఈ రాశి వారు అన్ని పనుల్లో విజయం పొందుతారు. వ్యాపార వేత్తలు ఊహించని విధంగా లాభాలు పొందుతారు. ఈ రాశి వారు కుటుంబంలో శుభకార్యాలు నిర్వహించే ఛాన్స్ ఉంది. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికి కలిసి వస్తుంది. విద్యార్థులు చదువులో అద్భుతంగా రాణిస్తారు.

ధనస్సు రాశి : ఈ రాశి వారు కొత్త అవకాశాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు కూడా కలిసి వస్తుంది. ఎవరైతే చాలా రోజుల నుంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో, వారికి జాబ్ దొరకడమే కాకుండా, ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఈ రాశి వారు ఏ పని చేసినా అందులో వీరు విజయం అందుకోవడం ఖాయం.



