400 కిలోల RDX, 34 కార్లు.. కోటి మంది లక్ష్యం.. ముంబైలో భారీ విధ్వంసానికి కుట్ర..? ఉలిక్కిపడ్డ పోలీసులు!
ముంబైకి మరోసారి బాంబు బెదిరింపు వచ్చింది. ఈసారి ఆత్మాహుతి బాంబు దాడి అంటే మానవ బాంబు పేలుడు బెదిరింపు పంపించారు. ఏకంగా కోటి మందిని లేపేస్తామంటూ.. ముంబై ట్రాఫిక్ పోలీస్ వాట్సాప్ నంబర్‌కు ఈ బెదిరింపు సందేశం వచ్చింది. అనంత చతుర్థి వినాయక నిమజ్జనం సందర్భంగా ఈ ఘాతుకానికి పాల్పడుతామంటూ బెదిరింపులు అందిన తర్వాత పోలీసులు అప్రమత్తమయ్యారు.

ముంబైకి మరోసారి బాంబు బెదిరింపు వచ్చింది. ఈసారి ఆత్మాహుతి బాంబు దాడి అంటే మానవ బాంబు పేలుడు బెదిరింపు పంపించారు. ఏకంగా కోటి మందిని లేపేస్తామంటూ.. ముంబై ట్రాఫిక్ పోలీస్ వాట్సాప్ నంబర్‌కు ఈ బెదిరింపు సందేశం వచ్చింది. అనంత చతుర్థి వినాయక నిమజ్జనం సందర్భంగా ఈ ఘాతుకానికి పాల్పడుతామంటూ బెదిరింపులు అందిన తర్వాత పోలీసులు అప్రమత్తమయ్యారు.
34 వాహనాల్లో మానవ బాంబులు అమర్చారని, పేలుడు తర్వాత ముంబై నగరం మొత్తం కదిలిపోతుందని ఆ సందేశం పేర్కొంది. ‘లష్కర్-ఎ-జిహాదీ’ అనే సంస్థ కు చెందిన ఉగ్రవాదులు ఈ దారుణానికి పాల్పడుతారని బెదిరింపులో ప్రస్తావించారు. 14 మంది పాకిస్తానీ ఉగ్రవాదులు భారతదేశంలోకి ప్రవేశించారని పేర్కొన్నారు. ఇందుకు కోసం 400 కిలోల RDX పేలుడు పదార్థాలను సిద్ధం చేశారని, దీని కారణంగా 1 కోటి మంది చనిపోతారని సందేశంలో ఉంది. ఈ బెదిరింపు కావడంతో ముంబై పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.
ముంబైకి భారీ స్థాయిలో బాంబు దాడుల బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదు . గతంలో కూడా పోలీసు కంట్రోల్ రూమ్‌కు కాల్స్ ద్వారా, పోలీసు నంబర్‌కు సందేశాల ద్వారా ఇలాంటి బెదిరింపులు చాలాసార్లు వచ్చాయి. అయితే, ఈసారి బెదిరింపు చాలా తీవ్రమైనదిగా భావిస్తున్నారు పోలీసులు. లక్షలాది మందిని లక్ష్యంగా చేసుకుంటారని దుండగులు పంపిన సందేశంలో హెచ్చరించారు.
రెండు వారాల క్రితం, వర్లిలోని ఫోర్ సీజన్స్ హోటల్‌లో పేలుడు జరుగుతుందని హెచ్చరిక జారీ చేశారు. ఆగస్టు 14న పోలీసులకు ఫోన్ చేసి రైలులో పేలుడు జరుగుతుందని చెప్పారు. ఇలా చెప్పిన తర్వాత, కాల్ చేసిన వ్యక్తి కాల్‌ను డిస్‌కనెక్ట్ చేశాడు. సమయం, ప్లేస్ చెప్పలేదు. అయితే, పోలీసులు తీవ్రంగా దర్యాప్తు చేశారు. అయితే అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు. దీంతో పోలీసులు ఉపిరి పీల్చుకున్నారు.
ఛత్రపతి శివాజీ టెర్మినస్‌ను కూడా పేల్చివేస్తానని బెదిరింపులు వచ్చాయి. జూలై 26న ముంబైని కుదిపేసే మరో బెదిరింపు వచ్చింది. ఇది సంచలనం సృష్టించింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT)ను బాంబుతో పేల్చివేస్తామని హెచ్చరించారు. బెదిరించిన వ్యక్తి స్టేషన్‌లో బాంబు ఉంచుతామని, అది ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు కలిగిస్తుందని స్పష్టంగా చెప్పాడు. ఈ సమయంలో కూడా దర్యాప్తులో పోలీసులకు అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




