Ganesh Nimajjanam 2025: గణేష్ నిమజ్జన శోభాయాత్రలో అఘోరాలు.. గొరిల్లా..
హైదరాబాద్ నగర శివార్లలోని బోడుప్పల్ ఓల్డ్ విలేజ్‌లో జరిగిన గణేశ నిమజ్జన శోభాయాత్రను నిర్వాహకులు వినూత్నశైలిలో నిర్వహించారు. ఎప్పటిలాగే గణేష్ నవరాత్రులను శ్రద్ధాభక్తులతో నిర్వహించిన స్థానికులు ఈ తొమ్మిది రోజుల పాటు అనేక సాంస్కృతిక కార్యక్రమాలనూ ఏర్పాటు చేశారు. ఉత్సవాల తుది ఘట్టమైన గణేష్ నిమజ్జన శోభాయాత్రలో స్థానికులంతా వివిధ రకాల వేషధారణలతో ఆకట్టుకున్నారు.
వారిలో కొందరు అఘోరాల వేషధారణలో పాల్గొని.. శినామస్మరణతో.. నృత్యాలతో అలరించారు. అంతేకాదు, వారిలో కొందరు గొరిల్లా తదితర జంతువుల వేషాలు, మరికొందరు పక్షుల వేషాలు వేసి.. గణేశ శోభాయాత్రలో నాట్యం చేస్తూ అందరినీ అలరించారు. బోడుప్పల్ ఓల్డ్ విలేజ్ బస్తీ వాసులు గత 25 ఏళ్లుగా ఈ ఉత్సవాలను గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. సంప్రదాయాన్ని పాటిస్తూ, ప్రతి సంవత్సరం భక్తితో గణపతిని పూజించి, నవరాత్రులు ముగిసిన తర్వాత భారీ ఊరేగింపుతో నిమజ్జన వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ ఉత్సవాలు కేవలం ఆధ్యాత్మికతకు పరిమితం కాకుండా, ఆనందాన్ని పంచుకునే వేదికగా మారాయి. ఈ వేడుకలలో స్థానిక యువత పెద్ద సంఖ్యలో పాల్గొనడం, తమ సృజనాత్మకతను ప్రదర్శించడం ద్వారా గణేష్ ఉత్సవాలకు కొత్త హంగులు అద్దుతున్నారు. ఈ సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ, భద్రత చర్యలు చేపట్టి కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించారు. మరోవైపు గణేష్ నిమజ్జన సమయంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు ఓ యువకుడు. గోరిల్లా వేషధారణలో డ్యాన్సులు వేస్తూ పిల్లల్ని అలరించాడు. ఉత్సవంలో పాల్గొన్న వారిలో ఈ యువకుడి నృత్యం ప్రతి ఒక్కరికీ నవ్వులు పంచింది. గోరిల్లా కాస్ట్యూమ్ తో అతని డ్యాన్స్‌కు అంతా ఫిదా అయిపోయారు. పిల్లలంతా అతని చుట్టూ చేరి డ్యాన్స్ చేశారు. ఈ వేషధారణతో చేసిన డ్యాన్స్ ఊరేగింపులో హైలెట్ గా మారింది. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ తమ మొబైళ్లలో వీడియోలు తీయడం, ఫొటోలు తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Yadagirigutta: యాదగిరి నరసన్నకు భక్తుడి భారీ విరాళం
చిమ్మ చీకటి.. జోరువాన.. సెల్ లైట్ వెలుగులో డెలివరీ
రూ. 8 కోట్ల లగ్జరీ నౌక.. ప్రారంభించిన నిమిషాల్లోనే సముద్రంలో మునక
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

