గుడ్ న్యూస్.. హైదరాబాద్‌నుంచి యూరప్‌కి డైరెక్ట్ ఫ్లైట్
యూరప్ దేశాలకు వెళ్లాలనుకునేవారికి గుడ్ న్యూస్.. ఇకపై.. హైదరాబాద్ నుంచి నాన్‌స్టాప్‌గా ఒకే ఫ్లైట్‌లో ఆమ్‌స్టర్‌డామ్ వెళ్లిపోవచ్చు. నెదర్లాండ్స్‌కు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ ‘కేఎల్‌ఎం రాయల్ డచ్ ఎయిర్‌లైన్స్’ హైదరాబాద్ నుంచి నేరుగా ఆమ్‌స్టర్‌డామ్‌కు వారానికి 3 విమాన సర్వీసులను ప్రారంభించింది. బుధవారం నుంచి ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
దీంతో.. తెలుగు వారికి యూరప్ ప్రయాణం మరింత సులభతరం కానుంది. భారతదేశంలో తమ కార్యకలాపాలను విస్తరించే ప్రణాళికలో భాగంగా కేఎల్‌ఎం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే బెంగళూరు, ఢిల్లీ, ముంబై నగరాల నుంచి తమ విమాన సేవలు అందుబాటులో ఉండగా, హైదరాబాద్ తమకు నాలుగో గేట్‌వే అని కేఎల్‌ఎం చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మార్టెన్ స్టీనెన్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ 4 నగరాల నుంచి వారానికి 24 విమానాలను ఆమ్‌స్టర్‌డామ్‌కు నడుపుతున్నామని, శీతాకాలంలో ఈ సంఖ్యను 27కి పెంచనున్నట్లు ఆయన వివరించారు. హైదరాబాద్ నగరం ఫార్మా, ఐటీ రంగాలకు కీలక కేంద్రంగా ఎదుగుతోందని, ఇక్కడి నుంచి సరుకు రవాణాకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని మార్టెన్ స్టీనెన్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్-ఆమ్‌స్టర్‌డామ్ మార్గంలో బోయింగ్ 777-200ER విమానాలను ఉపయోగిస్తున్నామని, ఇందులో వివిధ తరగతుల్లో కలిపి ఒకేసారి 288 మంది ప్రయాణించవచ్చని కేఎల్‌ఎం అధికారులు వెల్లడించారు. ఈ కొత్త కనెక్టివిటీ వ్యాపార, పర్యాటక రంగాలకు ఎంతో ఊతమిస్తుందని భావిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
6 రోజుల్లో రూ.6 వేలు పెరిగిన పుత్తడి.. ఆల్‌టైం రికార్డ్ దిశగా అడుగులు
‘కల్లు కొట్టు కాడా..’ మార్కెట్లోకి నయా మాస్ మాసాలా సాంగ్! అదిరిపోయే రెస్పాన్స్!
ఇన్‌స్టాలో పరిచయం.. పార్టీ పేరుతో స్కెచ్.. బాత్రూమ్‌లోకి పడేసి.. అత్యాచారం?
Dulquer Salmaan: వివాదంలో కొత్త లోక.. దిగొచ్చి క్షమాపణ చెప్పిన దుల్కర్
ఒళ్లు గగుర్పొడిచే సీన్స్.. ఓటీటీలో అత్యంత భయానక హారర్ థ్రిల్లర్ మూవీ..
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే

