ఒళ్లు గగుర్పొడిచే సీన్స్.. ఓటీటీలో అత్యంత భయానక హారర్ థ్రిల్లర్ మూవీ..
ప్రపంచంలోనే ది మోస్ట్ హారర్ మూవీ అంటే అన్నాబెల్లె, కాంచన, అరణమనై, స్త్రీ 2, ది కంజురింగ్ వంటి టక్కున గుర్తకు వస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో కూడా దాదాపు ఇదే కంటెంట్ తో నడుస్తోంది. ఇందులోని కొన్ని సీన్లను చూస్తే ఒళ్లు జలధరిస్తుంది. గుండె వేగంగా కొట్టుకుంటుంది.. ఈ సినిమా పేరే 'జైలాంగ్‌కంగ్: సాండేకాలా. .'. ఇదో ఇండోనేషియన్ హారర్ ఫిల్మ్! ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఆడ్రియన్, సాండ్రా, వాళ్ల పిల్లలు నికి, కినన్‌లతో కలిసి వెకేషన్‌కి వెళ్తారు.
సాయంత్రం సమయంలో కినన్ లేక్ దగ్గర ఆడుకుంటూ హఠాత్తుగా కనిపించకుండా పోతాడు. సాండేకాలా అనే మిస్టికల్ జీవి, సూర్యాస్తమయంలో పిల్లలను కిడ్నాప్ చేస్తుందనే విషయం ఆడ్రియన్, సాండ్రాలకు తెలుస్తుంది. దీంతో వారు కినన్‌ని వెతకడానికి స్థానికులైన ఫైసల్, మజీద్ తో కలిసి అడవిలోకి వెళ్తారు. అక్కడ వారికి జైలాంగ్‌కంగ్ అనే ఒక బొమ్మ కనిపిస్తుంది. ఆ బొమ్మ వల్ల వింత శబ్దాలు, భయంకరమైన దృశ్యాలు కనిపిస్తాయి. సాండేకాలా అనే వింత జీవి వాళ్లను కూడా వెంటాడుతుందని తెలుసుకుంటారు.అయితే ఆడ్రియన్ గతంలో చేసిన ఒక తప్పు ఇప్పుడు అతని కుటుంబాన్ని వెంటాడుతుందని స్థానికులు చెబుతారు. అలాగే సాండేకాలా ను శాంతపరచడానికి ఒక పూజ చేయాలంటారు. కానీ అది విఫలమవుతుంది. దీంతో పరిస్థితి మరింత దిగజారుతుంది. మరి ఆడ్రియన్, కినన్ తో పాటు వారి పిల్లలు సాండేకాలా నుంచి బయట పడతారా? దాని చేతిలో బలవుతారా? అసలు ఆడ్రియెన్ ను వెంటాడుతోన్న శాపం ఏమిటి? దీనికి ఈ వింత జీవికి ఉన్న లింక్ ఏమిటి? అన్న ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ఈ హారర్ థ్రిల్లర్ మూవీ చూడాల్సిందే. ఇండోనేషియన్ హారర్ సినిమాల్లో ఎక్కువగా రిచ్యువల్ కంటెంట్ ఉంటుంది. అక్కడి ప్రజలు చేతబడి, క్షుద్ర పూజలను బాగా నమ్ముతారు.. విశ్వసిస్తారు. అందుకే అక్కడ ఇలాంటి రిచ్చువల్ కంటెంట్ ఉన్న సినిమాలు ఎక్కువగా వస్తుంటాయి. ఇక మనం మాట్లాడుకున్న ‘జైలాంగ్‌కంగ్: సాండేకాలా. . కూడా అలాంటిదే. ఈమూవీకి కిమో స్టాంబోయల్ దర్శకత్వం వహించారు. ఇందులో టిటి కమల్ సాండ్రాగా.. డ్వి సాసోనో అడ్రియన్గా.. , కనిపించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. కేవలం 92 నిమిషాల నిడివి ఉన్న ఈ హారర్ సినిమాని.. థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ కోసం మీరూ ఓ సారి లుక్కేయండి!
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Upasana Konidela: వ్రతం ముగిసింది.. ఫలమూ అందింది
Madharaasi: మరో గజినీ !! హిట్టా..? ఫట్టా..?
Coolie OTT: గుడ్ న్యూస్.. OTTలో కూలీ మూవీ..!
అప్పు చేయనేలా.. ఇప్పుడు వైరల్ అవ్వడమేలా! స్టార్ కపుల్‌కు బిగ్ షాక్!
Pawan Kalyan: ఉపాధ్యాయ దినోత్సవం వేళ.. పిఠాపురం టీజర్లకు పవన్ బిగ్ సర్‌ప్రైజ్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

