AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Madharaasi: మరో గజినీ !! హిట్టా..? ఫట్టా..?

Madharaasi: మరో గజినీ !! హిట్టా..? ఫట్టా..?

Phani CH
|

Updated on: Sep 06, 2025 | 12:08 PM

Share

సికిందర్ సినిమాతో.. నేషనల్ వైడ్ అపఖ్యాతి మూటగట్టకున్న మురగదాస్‌.. ఇప్పుడు మదరాసి సినిమాతో మన ముందుకు వచ్చాడు. గత కొన్నేళ్లుగా సక్సెస్‌ను చూడని ఈ ట్యాలెంటెడ్ డైరెక్టర్.. శివ కార్తికేయన్‌కు కథ చెప్పి ఒప్పించడమే కోలీవుడ్‌లో హాట్ టాపిక్. ఇలాంటి పరిస్థితుల్లో..! శివ కార్తికేయన్ మీద ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్‌.. అండ్ ట్రైలర్‌ ఇచ్చిన హైప్‌తో.. ఈ సినిమాపై చాలా మందే అంచనాలు పెట్టుకున్నారు.

ఈసినిమా కోసం ఈగర్‌గా ఎదురు కూడా చూస్తున్నారు. ఈ క్రమంలోనే మదరాసి మూవీ థియేటర్లలోకి వచ్చింది. మరి ఈసినిమా ఎలా ఉంది? మురగదాస్‌కు మంచి కంబ్యాక్ నిచ్చేలానే ఉందా? శివ కార్తికేయన్‌ కెరీర్‌లో మరో బెస్ట్ మూవీ అవుతుందా? తెలియాలంటే ఈ రివ్యూ చూసేయండి! ఇక మదరాసి కథలోకి వెళితే.. రఘు అలియాస్ శివ కార్తికేయన్ పద్నాలుగేళ్ల వయసు నుంచే ఓ విచిత్రమైన హెల్త్‌ ప్రాబ్లమ్‌తో సతమతమవుతుంటాడు. ఈ విషయం తెలిసినా కూడా డెంటల్ డాక్టర్ కమ్ మ్యూజీషియన్ మాలతి అలియాస్ రుక్మిణి వసంత్ మనోడితో ప్రేమలో పడుతుంది. కానీ ఒక కారణం వల్ల రఘుని వదిలి వెళ్లిపోతుంది. దీంతో రఘు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇక నార్త్ ఇండియాకి చెందిన విరాట్ అలియాస్ విద్యుత్ జమ్వాల్‌ , చిరాగ్ అలియాస్ శబీర్.. ఈ ఇద్దరు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు తమిళనాడుని నాశనం చేయాలని చూస్తుంటారు. అందుకోసం ఓ ఆరు కంటైనర్స్‌లో గన్స్‌ని తమిళనాడుకు తరలించే ప్రయత్నంలో ఉంటారు. ఈ ఇద్దరి వెనక రాజకీయశక్తులతో కూడిన పెద్ద సిండికేట్ కూడా ఉంటుంది. వాళ్ళ ప్రయత్నాన్ని ఆపడానికి NIA స్పెషల్ ఆఫీసర్ ప్రేమ్ అలియాస్ బిజూ మీనన్ తన టీంతో ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలోనే సీన్‌లోకి ఎంటర్‌ అవుతాడు రఘు అలియాస్ శివకార్తికేయన్. అసలు సంబంధమే లేకుపోయినా….మన హీరో టెర్రరిస్టులతో ఎందుకు పోరాడవలసి వచ్చింది? రఘు కున్న ప్రాబ్లమ్‌ ఏంటి? ఆ ప్రాబ్లమ్ వల్ల ఎలా ప్రవర్తిస్తాడు.? మాలతీ, రఘుని ప్రేమించడానికి ఏమైనా కారణం ఉందా? ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి ఎందుకు వెళ్లిపోయింది? మళ్ళీ ఇద్దరు కలిసారా? లేదా? తమిళనాడుని ఏ రూపంలో టెర్రరిస్టులు నాశనం చెయ్యాలని చూసారు? తనకున్నమానసిక సమ్యతో రఘు ఎలా పోరాడాడు? తమిళనాడుని రక్షించాడా? లేదా అనేదే మదరాసి కథ. సినిమాల్లో హీరోకు ఓ హెల్త్‌ ప్రాబ్లమ్‌ను యాడ్‌ చేసి.. దాని ద్వారా మనోడి చేతు మ్యాడ్ రేంజ్‌ యాక్షన్ చేయించడం కోలీవుడ్‌ డైరెక్టర్లు ఎప్పటి నుంచో చేస్తూ వస్తున్నారు. అందులోనూ మురగదాస్ అయితే ఇలాంటి కాన్సెప్ట్‌తోనే గజినీ సినిమా తీసి.. ట్రెండ్ సెట్ చేశాడు. ఇప్పుడు మళ్లీ అలాంటి పాయింట్‌తోనే మదరాసి సినిమా తెరకెక్కించాడు. మానసిక రుగ్మత ఉన్న ఒక హీరో… అనుకోకుండా తనకున్న ప్రాబ్లమ్‌ కారణంగా మ్యాడ్‌గా మారితే.. టెర్రరిస్టులు కూడా వణికిపోవాల్సింది అనేలా ఈ సినిమాను ప్రజెంట్ చేశాడు. అందులో భాగంగా.. హీరో లైఫ్‌లో లవ్‌ను యాడ్ చేసి.. ఎమోషన్‌ను కవర్ చేశాడు డైరెక్టర్. హీరో – హీరోయిన్ల మధ్య మంచి ఫ్రెష్ లవ్‌ స్టోరీని చూపించాడు. రఘు మానసిక రుగ్మతకి గురవ్వడానిక్ కారణం, ఆ ప్రాబ్లమ్ తన శరీరంలోకి వచ్చాక రఘు ప్రవర్తించే సీన్స్ ఎక్స్ లెంట్ . ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే సూపర్. సెకండ్ హాఫ్ చాలా వేగంగా కదిలింది. యాక్షన్ సన్నివేశాలతో పాటు, చివరకి ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ కలిగింది. ఊహించని విధంగా క్యారెక్టర్స్ కళ్ల ముందు కదిలాయి. క్లైమాక్స్ ఊహించిందే అయినా… ఈక్రమంలోనే వచ్చే ఓ ఫైనల్ సన్నివేశం.. కొందరికి రుచిస్తుంది. ఇంకొందరికి రుచించదు. ఇక ఈ విషయం పక్కకు పెడితే… రఘు క్యారెక్టర్‌లో శివ కార్తికేయన్ అదరగొట్టాడు. తన పర్ఫార్మెన్స్‌తో సినిమాకి బిగ్ ఎసెస్ అయ్యాడు. లవ్, యాక్షన్, ఎంటర్ టైన్ మెంట్ ఇలా అన్ని వేరియేషన్స్ ని పర్ఫెక్ట్ గా ప్రదర్శించాడు ఈ హీరో. ఇక మాలతీ క్యారెక్టర్లో రుక్మిణీ వసంతం కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. NIA ఆఫీసర్ బిజు మీనన్.. టెర్రరిస్టులుగా చేసిన విద్యుత్ జమ్మూ వాల్, షబీర్ లు కూడా తమ పాత్ర పరిధి మేరకు నటించారు. వీళ్లకు తోడు.. అనిరుధ్ ఇచ్చిన మ్యూజిక్ ఎప్పటిలానే బాగుంది. బ్యాగ్రౌండ్‌ స్కోర్ అదిరిపోయింది. కొన్ని సీన్స్‌లో అయితే.. అనిరుధ్‌ తన మ్యూజిక్ తో ఇచ్చిపడేశాడు. ఇక మురగదాస్‌ కూడా కంబ్యాక్ అయినట్టే అనిపిస్తుంది. గజినీ సినిమా టైం.. ఫీల్‌ను మనకు ఇస్తాడు. కాక పోతే కథని విసృతమైన పరిధిలో చూపించలేదు. ఆ అవకాశం ఉండి కూడా ఆ దిశగా ప్రయతించలేదు. ఇక ఫైనల్‌ గా చెప్పాలంటే.. మదరాసి.. మ్యాడ్ రేంజ్‌ యాక్షన్ సినిమా.. విత్ శివ కార్తికేషన్‌ కామెడీ టైమింగ్! రుక్మిణీ లవ్‌!

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Coolie OTT: గుడ్ న్యూస్.. OTTలో కూలీ మూవీ..!

అప్పు చేయనేలా.. ఇప్పుడు వైరల్ అవ్వడమేలా! స్టార్ కపుల్‌కు బిగ్ షాక్!

Pawan Kalyan: ఉపాధ్యాయ దినోత్సవం వేళ.. పిఠాపురం టీజర్లకు పవన్‌ బిగ్ సర్‌ప్రైజ్‌