AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yadagirigutta: యాదగిరి నరసన్నకు భక్తుడి భారీ విరాళం

Yadagirigutta: యాదగిరి నరసన్నకు భక్తుడి భారీ విరాళం

Phani CH
|

Updated on: Sep 06, 2025 | 1:36 PM

Share

తెలంగాణ తిరుపతిగా పేరున్న యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్నాడు. కోరిన కోర్కెలు తీర్చే దైవమైన స్వామి తమ భయాలను, బాధలను తొలగిస్తాడని భక్తుల నమ్మకం. నిత్యం వేలాది మంది భక్తులు యాదగిరి గుట్టపై కొలువైన లక్ష్మీ నారసింహుడిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటారు.

ఇలా దర్శనానికి వచ్చే భక్తులంతా తమ శక్తి మేరకు స్వామికి విరాళాలూ సమర్పించుకుంటారు. తాజాగా, స్వామి వారి భక్తుడు ఒకరు తన ఇష్ట దైవానికి తన ఇంటినే కానుకగా సమర్పించాడు. హైదరాబాద్ తిలక్ నగర్‌కు చెందిన ముత్తినేని వెంకటేశ్వర్లు.. బాల్యం నుంచి లక్ష్మీనరసింహస్వామి భక్తుడు. ఆయన ప్రభుత్వ ఉద్యోగిగా సేవలందించి రిటైర్ అయ్యారు. ఉద్యోగి గా ఉన్న సమయంలోనే తిలక్ నగర్ లో ఎంతో ముచ్చటపడి సొంత ఇంటిని నిర్మించుకున్నారు. 152 గజాల విస్తీర్ణంలో జీ ప్లస్‌ 3- పెంట్‌ హౌస్‌ ను కట్టుకున్నాడు. తమ ఆరాధ్య దైవం యాదాద్రి నరసన్న కరుణతో పిల్లలు కూడా ఆర్థికంగా స్థిరపడ్డారు. తనకు స్థిరమైన జీవితాన్ని ప్రసాదించిన స్వామివారికి ఏదైనా విరాళంగా ఇవ్వాలని భక్తుడు వెంకటేశ్వర్లు భావించాడు. ఇందుకోసం తాను ఎంతో ఇష్టపడి కట్టుకున్న ఇంటిని స్వామికి విరాళంగా సమర్పించుకున్నాడు. నాలుగు కోట్ల విలువ చేసే ఇంటిని చిక్కడపల్లిలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం పేరిట రిజిస్ట్రేషన్‌ చేశారు. ఇంటి రిజిస్ట్రేషన్‌ పత్రాలను యాదగిరిగుట్ట దేవస్థానం అనువంశిక ధర్మకర్త మండలి చైర్మన్‌ నరసింహమూర్తి, ఆలయ ఈవో వెంకట్రావు సమక్షంలో దేవాలయ అధికారులకు అందజేశారు. స్వామి వారికి ఇంటిని విరాళంగా ఇచ్చిన భక్తుడిని ఆలయ అధికారులు.. స్వామివారి తీర్ధప్రసాదాలతో సత్కరించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చిమ్మ చీకటి.. జోరువాన.. సెల్ లైట్ వెలుగులో డెలివరీ

రూ. 8 కోట్ల లగ్జరీ నౌక.. ప్రారంభించిన నిమిషాల్లోనే సముద్రంలో మునక

Social Media: సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై ఉక్కుపాదం

గుడ్‌ న్యూస్‌.. హైదరాబాద్‌నుంచి యూరప్‌కి డైరెక్ట్‌ ఫ్లైట్‌

6 రోజుల్లో రూ.6 వేలు పెరిగిన పుత్తడి.. ఆల్‌టైం రికార్డ్ దిశగా అడుగులు