గణపతి నిమజ్జనం ఇలా చేస్తే.. మీ ఇంట అదృష్ట తాండవం పక్కా..
29 August 2025
Prudvi Battula
వినాయకుని సంపూర్ణ అనుగ్రహం లభించాలంటే గణేష్ విగ్రహాల నిమజ్జనం కూడా పూర్తి ఆచారాలతో చేయాలంటున్నారు పండితులు.
నిమజ్జనానికి ముందు విఘ్నధిపతి గణేషుడికి పూర్తి గౌరవం ఇస్తూ సరై విధానంలో వీడ్కోలు పలకాల్సిన అవసరం ఉంది.
ఇందుకోసం నిమజ్జనానికి వెళ్లే ముందు వినాయకుడిని పూజించి ఆయనకు ఇష్టమైన మోదకాలు సమర్పించిన తర్వాత నిమజ్జన స్థలంలో పీఠంపై ఉంచాలి.
ఆ తర్వాత విగ్రహానికి పసుపు, కుంకుమ, అక్షతలు సమర్పించి దీపం వెలిగించి పువ్వులతో అలంకరించి, హారతి ఇస్తే పూజ పూర్తవుతుంది.
చివరగా పూజ సమయంలో తెలియక చేసిన తప్పులకు క్షమించమని గణేశుడిని అడగండి. అప్పుడు లంబోదరుడు భక్తుల కరుణిస్తాడు.
తర్వాత గణపతి బప్పా మోరియా అంటూ నినాదాలు చేస్తూ గణేష్ విగ్రహాన్ని పూర్తి గౌరవంతో నీటిలో నిమజ్జనం చేయండి.
నిమజ్జనం రోజున నల్లని బట్టలు ధరించవద్దు, ఎవరినీ దూషించవద్దు, తప్పుగా ప్రవర్తించవద్దు. మంచిగా ఉండండి.
ఈ పద్ధతులను పాటిస్తూ పూజను నిర్వహించాలి. అలాగే ఆ రోజున మాంసాహారానికి కూడా దూరంగా ఉండాలని చెబుతున్నారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
పచ్చి మిరపకాయలు ఇలా కట్ చేస్తే.. చేతులు మంటేక్కావు..
రోజుకు మూడు రంగులు మార్చే 1100 ఏళ్ల లక్ష్మీదేవి విగ్రహం.. ఎక్కడంటే.?
నవరాత్రుల్లో గణేశుడిని రోజుకో రూపంలో పూజిస్తే.. కోరికలన్నీ తీరిపోయినట్టే..