AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: నగరవాసులకు మెట్రో రైల్ గుడ్​ న్యూస్.. సెప్టెంబర్ 6 అర్ధరాత్రి 2గంటల వరకు మెట్రో రైళ్లు

గణేశ్ నిమజ్జనాలను కనులారా వీక్షించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ప్రజలకు అసౌకర్య కలగకుండా రవాణా సదుపాయాలు కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ మెట్రోరైలు సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబర్ 6వ తేదీన మొదటి రైలు ఉదయం 6గంటలకు మొదలుకుని అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తాయని మెట్రో రైల్ అధికారులు తెలిపారు.

Hyderabad: నగరవాసులకు మెట్రో రైల్ గుడ్​ న్యూస్.. సెప్టెంబర్ 6 అర్ధరాత్రి 2గంటల వరకు మెట్రో రైళ్లు
India’s metro network
Balaraju Goud
|

Updated on: Sep 05, 2025 | 1:35 PM

Share

హైదరాబాద్ మహానగర వాసులకు శుభవార్త.. గణేశ్ నిమజ్జనాలను కనులారా వీక్షించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ప్రజలకు అసౌకర్య కలగకుండా రవాణా సదుపాయాలు కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ మెట్రోరైలు సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబర్ 6వ తేదీన మొదటి రైలు ఉదయం 6గంటలకు మొదలుకుని అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తాయని మెట్రో రైల్ అధికారులు తెలిపారు. అన్ని స్టేషన్ల నుంచి సెప్టెంబర్ 7వ తేదీ తెల్లవారు జామున 1 గంటకు చివరి రైల్ బయల్దేరి 2 గంటలకు గమ్యస్థానాలకు చేరుకుంటాయని పేర్కొన్నారు. ఈ మేరకు హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు.

ముఖ్యంగా బడా గణపతి ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్ర నేపథ్యంలో ఖైరతాబాద్, లక్డీకాపూల్ మెట్రో స్టేషన్లలో అదనపు సిబ్బందితోపాటు పోలీసులు, ప్రైవేటు సెక్యూరిటీతో పర్యవేక్షిస్తున్నామని హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు తెలిపారు. రద్దీకి అనుగుణంగా ఎంపిక చేసిన మెట్రో స్టేషన్లలో అదనపు టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఖైరతాబాద్‌​కు వచ్చే మెట్రో ప్రయాణికులు స్వీయ క్రమశిక్షణ పాటించి మెట్రో భద్రతా సిబ్బందికి సహకరించాలనివిజ్ఞప్తి చేశారు. ఈ సేవలను భాగ్యనగర వాసులు వినియోగించుకోవాలని కోరారు.

మరోవైపు తెలంగాణ ఆర్టీసీ అదనపు బస్సు సర్వీసులను ఏర్పాటు చేస్తోంది. ఇక దక్షిణ మధ్య రైల్వే నగరవాసులకు గుడ్​ న్యూస్ తెలిపింది. ఈ మేరకు ఎంఎంటీఎస్​ అదనపు ట్రిప్పులను తిప్పనున్నట్లుగా వెల్లడించింది. నిమజ్జనం రోజు నుంచి మరుసటి రోజు తెల్లవారుజాము వరకు ఎంఎంటీఎస్​ సర్వీసులకు నడిపిస్తామని అధికారులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..