ప్రతి పూజలో వినాయకుడినే ముందుగా ఎందుకు పూజిస్తారో తెలుసా?
Samatha
30 August 2025
Credit: Instagram
వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.అయితే ఈ రోజు మనం వినాయకుడికే మొదటి పూజ ఎందుకు చేస్తారో తెలుసుకుందాం.
ఏ చిన్న శుభకార్యం జరిగినా సరే మొదటగా వినాయకుడినే పూజిస్తారు. అయితే దీని వెనుక కొన్ని కారణాలు ఉన్నాయంటున్నారు పండితులు.
వినాయకుడిని విఘ్న హర్త అంటారు. అంటే అడ్డంకులు తొలిగించేవాడు, అందువలన ముందుగా ఈయనను పూజించడం వలన ఏవైనా అడ్డంకులు ఉంటే తొ
లిగిపోతాయంట.
ఏదైనా వ్యాపారం లేదా ఏది ప్రారంభించిన మొదటగా వినాయకుడిని పూజించడం వలన ప్రారంభంలో విజయం, మంచి పురోగతి ఉంటుందంట.
ప్రతి రోజూ, అలాగే, మొదటి పూజ వినాయకుడికి చేయడం వలన గణేశుడి ఆశీస్సులు లభించడమే కాకుండా, అదృష్టం కలుగుతుందంట.
అయితే పురాణాల ప్రకారం దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ముందుగా వినాయకుడి పూజించాలని తెలపబడినది.
అలాగే హిందూ పురాణాల ప్రకారం , ఏ చిన్న కార్యం జరిగినా సరే ముందుగా గణేశుడి పూజించాలని వినాయకుడి
తల్లిదండ్రులు వరం ఇవ్వడం జరిగిందంట.
అదే విధంగా వినాయకుడు శుభానికి చిహ్నం, అందువలన ఏ చిన్న శుభకార్యం జరిగినా ఆయనను పూజించడం వలన శుభం జరుగుతుందని భక్తుల నమ్మకం.
మరిన్ని వెబ్ స్టోరీస్
నాగార్జున గురించి ఎవ్వరికీ తెలియని టాప్ 10 సీక్రెట్స్ ఇవే!
మీరు తెలివిగల వారా.. అయితే టక్కున ఇందులోని 5 తేడాలు గుర్తించండి!
చిన్న లవంగంతో పెద్ద ప్రయోజనం.. రోజూ తింటే ఎంత మంచిదో!