Viral Video: ఛీ ఛీ.. ఇదేందిరా నాయనా.. మరి ఇంతనా?.. యువకుడు ఏం దొంగతనం చేశాడో చూస్తే..

Basha Shek

Basha Shek | Edited By: Sanjay Kasula

Updated on: Sep 07, 2022 | 2:47 PM

ఆ యువకుడు అందరూ నిద్రపోయాక యాక్టివ్‌ అవుతాడు. అర్ధరాత్రి తీరిగ్గా దొంగతనానికి బయలుదేరుతాడు. అందరి కళ్లు గప్పి పైకప్పు లేదా గేటు ద్వారా ఇళ్లలోకి ప్రవేశిస్తాడు. ఇంత బాగా ప్లాన్‌ చేశాడంటే అతను ఏదో భారీ చోరీలు చేస్తుంటాడులే అనుకోవచ్చు. కానీ ఆ యువకుడు దొంగతనం చేసింది తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు.

Viral Video: ఛీ ఛీ.. ఇదేందిరా నాయనా.. మరి ఇంతనా?.. యువకుడు ఏం దొంగతనం చేశాడో చూస్తే..
Thief

ఆ యువకుడు అందరూ నిద్రపోయాక యాక్టివ్‌ అవుతాడు. అర్ధరాత్రి తీరిగ్గా దొంగతనానికి బయలుదేరుతాడు. అందరి కళ్లు గప్పి పైకప్పు లేదా గేటు ద్వారా ఇళ్లలోకి ప్రవేశిస్తాడు. ఇంత బాగా ప్లాన్‌ చేశాడంటే అతను ఏదో భారీ చోరీలు చేస్తుంటాడులే అనుకోవచ్చు. కానీ ఆ యువకుడు దొంగతనం చేసింది తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు. అర్ధరాత్రి చోరీలకు వెళుతున్న ఆ ఘనుడు ఇంటి పైకప్పుపై ఆరేసిన మహిళల లోదుస్తులు, ఇన్నర్లను దొంగలిస్తున్నాడు. అయితే వీటిపై ఫిర్యాదు చేస్తే బాగుండడని మహిళలు కూడా ఎవరూ ముందుకురాలేదు. దీంతో ఆ యువకుడు ఇంకా రెచ్చిపోయాడు. చివరకు ఓ వ్యాపారి ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని గ్వాలియర్‌లో ఈ వెరైటీ దొంగ వ్యవహారం బాగా చర్చనీయాంశమైంది.

సాధారణంగా దొంగలు బంగారం, డబ్బులు, చీరలు వంటివి చోరీ చేస్తారు. అయితే దొంగల్లో వెరైటీ దొంగలుంటారు. వారు చిత్ర విచిత్రమైన వాటిని చోరీ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. గతంలో కొందరు మహిళల లో దుస్తులు, ఇన్నర్లను చోరీ చేసిన ఘటనలను మనం చూశాం. తాజాగా అలాంటి సంఘటనే మరొకటి చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన ఓ బాలుడు మహిళల లోదుస్తులను దొంగతనం చేస్తున్నాడు. ఆకాష్ వర్మ అనే యువకుడు గ్వాలియర్‌లో మహిళల లోదుస్తులు, ఇన్నర్‌లను దొంగతనం చేస్తున్నాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆకాష్ పైకప్పు లేదా గేట్ ద్వారా ఇళ్లలోకి ప్రవేశించి ఉతికేసిన మహిళల లోదుస్తులను చోరీ చేస్తున్నాడు. ఇలా గ్వాలియర్‌ ప్రాంతంలో చాలా ఇళ్లలో దొంగతనాలు చేశాడు. ఆరేసిన లోదుస్తులు, ఇన్నర్‌ లు ఏమవుతున్నాయో తెలియక మహిళలు అందరూ అయమయానికి గురయ్యారు. దీనికి తోడు లోదుస్తులు పోయాయని ఫిర్యాదు ఇస్తే బాగుండదని ఎవరూ ముందుకు రాలేదు. అయితే ఇటీవల ఆకాష్ ఎప్పటిలాగే అర్ధరాత్రి దాటిన తర్వాత తలుపులు బార్లా తెరిచి ఉన్న ఓ ఇంటిలోకి వెళ్లాడు. చాలా సమయం తర్వాత చేతిలో మహిళల లోదుస్తులు పట్టుకుని బయటికి వచ్చాడు. ఈ తతంగం అంతా అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. దీంతో అర్ధరాత్రి ఓ దొంగ తన ఇంట్లోకి ప్రవేశించి తన భార్య లోదుస్తులను దొంగిలించాడని ఓ వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వ్యాపారి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు నిందితుడు ఆకాశ్‌ను గుర్తించారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu