US Open 2022: టెన్నిస్‌లో గ్లామర్‌కు ఏ మాత్రం కొదువ ఉండదు. క్రీడాకారిణులే కాదు.. అభిమానులు తమ అందంతో కెమెరా కళ్లతో పాటు అందరి దృష్టిని తమవైపునకు తిప్పుకుంటుంటారు. అలా తాజాగా యూఎస్ ఓపెన్‌లో కూడా ఒక యువతి సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఆమె అమెరికాకు చెందిన మేఘన్ లక్కీ ( Megan Lucky). కేవలం అందంతోనే కాదు.. గ్యాలరీలో ఆమె చేసిన ఒక పని ఇప్పుడు వైరల్‌గా మారింది. అదేంటంటే.. అందరూ చూస్తుండగానే గ్లాసు బీరును దించకుండా తాగింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ హల్‌చల్ చేస్తోంది.
ఇదిలా ఉంటే మేఘన్ ఇలా చేయడం ఇదేమీ మొదటి సారి కాదు. గతేడాది యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లోనూ గ్లాసు బీరును దించకుండా తాగింది. అప్పటినుంచి తనను ‘బీర్ చీర్ గర్ల్’ అని ముద్దుగా పిలుస్తున్నారు. ఈసారి యూఎస్ ఓపెన్‌కు తన బాయ్‌ఫ్రెండ్‌తో హాజరైంది మేఘన్. అతను అందించిన బీర్ గ్లాసును అందుకుని క్షణాల్లో పూర్తిగా తాగేసింది. ఈ సమయంలో బాయ్‌ఫ్రెండ్ చప్పట్లు కొడుతూ ఆమెను ఎంకరేజ్ చేశాడు. ఇది స్టేడియంలోనున్న స్ర్కీన్లపై కూడా కనిపించింది. దీంతో మ్యాచ్‌కు హాజరైన ప్రేక్షకులు గట్టిగా చప్పట్లు కొట్టారు. ఈ వీడియోనూ స్వయంగా యూఎస్ ఓపెన్ నిర్వాహకులే తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశారు.. ‘మేఘన్ లక్కీకి మా అభినందనలు.. బహుశా ఇది ట్రెడిషనల్ పాయింట్‌గా నిలిచే అవకాశముంది’ అని క్యాప్షన్ జత చేశారు. నెట్టింట్లో వైరల్‌గా మారిన ఈ వీడియోను ఇప్పటివరకు 1.3 మిలియన్ల మంది వీక్షించడం విశేషం.
It seems this is becoming tradition at this point 🍻 pic.twitter.com/vTO1hUJVNS
— US Open Tennis (@usopen) September 4, 2022
View this post on Instagram
మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..