Aaron Finch: వన్డేలకు వీడ్కోలు పలికిన ఆసీస్ కెప్టెన్.. మరోసారి అతనికే జట్టు పగ్గాలు అందనున్నాయా?
ఆస్ట్రేలియా బ్యాటర్, పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్ (Aaron Finch) శనివారం వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగే మూడో వన్డే ఆడి ఈ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ఇవ్వనున్నాడు.
ఆస్ట్రేలియా బ్యాటర్, పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్ (Aaron Finch) శనివారం వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగే మూడో వన్డే ఆడి ఈ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ఇవ్వనున్నాడు. అయితే టీ20 జట్టుకు సారథిగా కొనసాగనున్నాడు. గతేడాది ఫించ్ సారథ్యంలోనే ఆస్ట్రేలియా టీ20 ప్రపంచకప్‌ను మొదటిసారిగా గెలుచుకుంది. కాగా ఫించ్ తన కెరీర్‌లో చివరి 146వ వన్డే మ్యాచ్‌ని న్యూజిలాండ్‌తో ఆడనున్నాడు. అతను మొత్తం 54 వన్డే మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. 50 ఓవర్ల మ్యాచ్‌ల్లో మొత్తం 17 సెంచరీలు సాధించాడు ఫించ్. అతని కంటే ముందు రికీ పాంటింగ్ (29 సెంచరీలు), డేవిడ్ వార్నర్, మార్క్ వా (18 సెంచరీలు) మాత్రమే ఉన్నాడు.
పేలవఫామ్ తో..
ఈ సీజన్‌లో వన్డేల్లో పేలవమైన ఫామ్ కారణంగా ఫించ్ ఈ ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వన్డేల్లో తన చివరి ఏడు ఇన్నింగ్స్‌ల్లో 26 పరుగులు మాత్రమే చేశాడు. 2023లో భారత్‌లో జరిగే వన్డే ప్రపంచకప్‌లో జట్టుకు సారథ్యం వహించడమే తన లక్ష్యమని ఫించ్ చెప్పినప్పటికీ, శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఫించ్.. వన్డేకు కొత్త కెప్టెన్‌కు అవకాశం ఇవ్వాలని కోరాడు. తద్వారా ప్రపంచకప్‌కు సన్నద్ధమయ్యేందుకు తగిన సమయం దొరుకుతుందన్నాడు. ‘ఇది కొన్ని అద్భుతమైన జ్ఞాపకాలతో అద్భుతమైన ప్రయాణం. ఈ అద్భుతమైన వన్డే జట్టులో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. నేను ఆడిన వారితో కలిసి ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను. నా ఈ ప్రయాణంలో నాకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు’ అని తన ప్రకటనలో చెప్పుకొచ్చాడు ఫించ్. కాగా తదుపరి వన్డే కెప్టెన్ ఎవరన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. స్టీవ్‌స్మిత్, డేవిడ్ వార్నర్‌లలో ఎవరో ఒకరు జట్టు పగ్గాలు స్వీకరించే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా ప్రస్తుతం టెస్ట్ జట్టుకు ప్యాట్ కమిన్స్ సారథ్యం వహిస్తున్నాడు.
JUST IN: Aaron Finch has announced his retirement from ODI cricket.
— cricket.com.au (@cricketcomau) September 9, 2022
మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..