Trend Setter: రెడ్ కార్పెట్‌పై బ్లడీ మేరీ లుక్‌లో లెదర్ కోర్సెట్ డ్రెస్ మెరిసిన గ్లోబల్ బ్యూటీ..
గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన ఆ దేశీ గర్ల్ మరోసారి అంతర్జాతీయ వేదికపై సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. హాలీవుడ్ రెడ్ కార్పెట్ మీద ఆమె అడుగు పెడితే కెమెరా కళ్లన్నీ ఆమెవైపే మళ్లుతాయి. ఫిబ్రవరి 17న లాస్ ఏంజెల్స్‌లో జరిగిన తన కొత్త సినిమా వరల్డ్ ప్రీమియర్ వేడుకలో ఆమె ధరించిన దుస్తులు, ఆమె ఆహార్యం ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారాయి.

ఆమె ఒకప్పుడు మిస్ వరల్డ్. బాలీవుడ్ ను ఏలిన తర్వాత ఇప్పుడు హాలీవుడ్ లో తన సత్తా చాటుతోంది. ఇటీవల విడుదలైన తన కొత్త యాక్షన్ సినిమా ‘ద బ్లఫ్’ ప్రీమియర్ వేడుకలో ఆమె ఒక యోధురాలిలా కనిపిస్తూనే, హై ఫ్యాషన్ తో అందరినీ మంత్రముగ్ధులను చేసింది. సినిమాలో ‘బ్లడీ మేరీ’ అనే పవర్ ఫుల్ పాత్రను పోషించిన ఆమె, ఆ పాత్రలోని గాంభీర్యాన్ని రెడ్ కార్పెట్ మీదకు తీసుకొచ్చింది. ఆ గ్లోబల్ ఐకాన్ మరెవరో కాదు.. ప్రియాంక చోప్రా. తన అద్భుతమైన డ్రెస్సింగ్ స్టైల్ తో లాస్ ఏంజెల్స్ వీధుల్లో సందడి చేసిన ప్రియాంక లుక్ విశేషాలేంటో వివరంగా తెలుసుకుందాం..
లెదర్ కోర్సెట్ మ్యాజిక్
ఈ వేడుక కోసం ప్రియాంక డార్క్ బ్రౌన్ కలర్ లో ఉన్న ఒక విలక్షణమైన గౌనును ఎంచుకుంది. ఈ డ్రెస్ లో ప్రధాన ఆకర్షణ దాని పైభాగం. చాక్లెట్ టోన్ లో ఉన్న లెదర్ బ్రెస్ట్‌ప్లేట్ ఆమె శరీర సౌష్టవానికి తగ్గట్టుగా రూపుదిద్దుకుంది. సినిమాలో ఆమె పోషించిన ఎర్సెల్ ‘బ్లడీ మేరీ’ బోడెన్ పాత్రకు గుర్తుగా ఈ లెదర్ కోర్సెట్ మీద ప్రత్యేకమైన డిజైన్లను చెక్కారు. దీనికి ఇరువైపులా ఉన్న బకిల్ డీటెయిల్స్ ఆమెకు ఒక షార్ప్ మరియు బోల్డ్ లుక్ ఇచ్చాయి.
పైన లెదర్ తో పవర్ ఫుల్ గా కనిపించిన ఈ డ్రెస్, కిందకి వచ్చేసరికి చాలా సాఫ్ట్ గా, ఫ్లోయీ ఫ్యాబ్రిక్ తో డిజైన్ చేశారు. నడుము భాగంలో ఉన్న డ్రాపింగ్స్ ఆమె లుక్ కు ఒక వింటేజ్ స్టైల్ ను తెచ్చాయి. ఒక వైపు ఉన్న హై-స్లిట్ ఆమె టోన్డ్ లెగ్స్ ను హైలైట్ చేస్తూ గ్లామర్ ను జోడించింది. గౌను వెనుక భాగంలో ఉన్న పొడవైన క్లాత్ ఆమె నడుస్తున్నప్పుడు రెడ్ కార్పెట్ పై ఒక రాణిలా కనిపించేలా చేసింది.
ప్రియాంక తన లుక్ కు తగ్గట్టుగా ఆకర్షణీయమైన సిల్వర్ చోకర్ నెక్లెస్ ధరించింది. దాని మధ్యలో ఉన్న పెద్ద డార్క్ స్టోన్ హైలైట్ గా నిలిచింది. పాదాలకు బ్రౌన్ కలర్ ఓపెన్-టో హీల్స్ ధరించి తన డ్రెస్ కలర్ తో మ్యాచ్ చేసింది. ఆమె మేకప్ విషయానికి వస్తే.. ఎర్తీ టోన్స్ తో కూడిన రోజ్-బ్రౌన్ లిప్ స్టిక్, బ్రౌన్ ఐషాడోతో ఆమె ముఖం వెలిగిపోయింది. ప్రియాంక తన జుట్టును లూజ్ వేవ్స్ లా వదిలేసింది.
తన సహజమైన నలుపు రంగు జుట్టుకు మధ్య మధ్యలో డార్క్ రెడ్ హైలైట్స్ ఇవ్వడం వల్ల ఆమె లుక్ మరింత ఎడ్జీగా, పవర్ ఫుల్ గా మారింది. సినిమాలో ఆమె పోషించిన మొరటుగా ఉండే పైరేట్ పాత్రకు ఇది ఒక స్టైలిష్ వెర్షన్ లా అనిపించింది. మొత్తానికి ప్రియాంక చోప్రా తన డ్రెస్సింగ్ తో ‘ద బ్లఫ్’ సినిమా థీమ్ ను పక్కాగా ప్రతిబింబించింది. అంతర్జాతీయ వేదికలపై భారతీయ నటి ఇలాంటి బోల్డ్, పవర్ ఫుల్ లుక్స్ తో రాణించడం ఆమె అభిమానులకు ఎంతో గర్వకారణం.
