AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Air Conditioner: కారులో ఏసీ గంట పాటు నడిస్తే ఎంత ఇంధనం ఖర్చవుతుంది? ఇంట్లో అయితే ఎన్ని యూనిట్లు?

Air Conditioner: సమ్మర్‌ సీజన్‌ వచ్చేస్తోంది. ఇంట్లో ఏసీలు, కూలర్లకు పని పెరుగుతుంది. అలాగే కార్లలు కూడా ఏసీల వాడకం పెరుగుతుంది. కారులో ఏసీ గంట పాటు నడిపితే ఎన్ని ఇంధనం ఖర్చవుతుందో మీకు తెలుసా? అలాగే ఇంట్లో ఒక గంట పాటు ఏసీ నడిపినట్లయితే ఎన్ని యూనిట్ల విద్యుత్‌ ఖర్చు అవుతుంది? వీటిని పెద్దగా పట్టించుకోము. కానీ దేని ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకుందాం..

Subhash Goud
|

Updated on: Feb 18, 2026 | 8:49 PM

Share
 Air Conditioner: ఫిబ్రవరి నెల కొన్ని రోజుల్లో ముగుస్తుంది. సమ్మర్‌ సీజన్‌ వచ్చేస్తోంది. మార్చి ప్రారంభం నుండి వేడి తీవ్రమవుతుంది. ఇళ్లలో, వాహనాలలో ACల పనితీరు పెరుగుతుంది. ఇంటి ACలు విద్యుత్తును వినియోగిస్తాయి. అయితే కారు ACలు ఇంధనాన్ని వినియోగిస్తాయి. అంటే పెట్రోల్, డీజిల్‌. అయితే కారు ఏసీని ఒక గంట పాటు నిరంతరం నడిపితే ఎంత ఇంధనం ఉపయోగించుకుంటుంది? ఈ ఖర్చు ఇంటి ఏసీ వినియోగం కంటే ఎక్కువ లేదా తక్కువగా ఉంటుందా?

1 / 5
 కారు ఎంత ఇంధనం వినియోగిస్తుంది?: ఒక SUV లేదా 2-లీటర్ ఇంజిన్ లేదా అంతకంటే పెద్ద ఇంజిన్ కలిగిన శక్తివంతమైన కారులో ఏసీని ఒక గంట పాటు నిరంతరం నడిపినట్లయితే అది దాదాపు 0.5 నుండి 0.7 లీటర్ల పెట్రోల్‌ను వినియోగించగలదని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. 1.2 నుండి 1.5-లీటర్ ఇంజిన్‌లు కలిగిన హ్యాచ్‌బ్యాక్‌లు, సెడాన్‌లు గంటలో సుమారు 0.2 నుండి 0.4 లీటర్ల పెట్రోల్‌ను వినియోగిస్తాయి.

2 / 5
 అయితే వాస్తవ పెట్రోల్ వినియోగం అనేక ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా కారు స్థిరంగా ఉన్నప్పుడు, ఏసీ నడుస్తున్నప్పుడు పెట్రోల్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. అయితే కారు కదులుతున్నప్పుడు అది కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఏసీ ఇంజిన్ నుండి పవర్‌ని తీసుకుంటుంది. ఇది ఇంజిన్‌పై ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. ఇంధన వినియోగాన్ని పెంచుతుంది.

3 / 5
 ఇంటి ఏసీ ఎంత విద్యుత్తును వినియోగిస్తుంది?: సాధారణంగా 1.5 టన్నుల ఏసీ గంటకు సగటున 1.2 నుండి 1.7 యూనిట్ల విద్యుత్తును వినియోగిస్తుంది. 5-స్టార్ రేటెడ్ ఇన్వర్టర్ ఏసీ గంటకు 1.2-1.3 యూనిట్లు (తక్కువ విద్యుత్తు) వినియోగిస్తుంది. అయితే 3-స్టార్ ఏసీ1.5-1.7 యూనిట్లు (ఎక్కువ విద్యుత్తు) వినియోగిస్తుంది.

4 / 5
 ఏ ఏసీ ఖరీదైనది?: ఇంధన ధర లీటరుకు 100 రూపాయలు ఉంటే కారు ఏసీ గంటకు 50-70 రూపాయలు ఖర్చవుతుంది. ఇంతలో విద్యుత్ ధర యూనిట్‌కు 10 రూపాయలు అయితే ఇంటి ఏసీ గంటకు గరిష్టంగా 20 రూపాయలు వినియోగించగలదు. అంటే కారు ఏసీ కంటే ఇంటి ఏసీ మరింత పొదుపుగా ఉంటుంది.

5 / 5
Follow Us