మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శివరాత్రి రోజున చికెన్ వండలేదని భర్త ఉరి వేసుకున్న ఘటన చోటుచేసుకుంది. 65 ఏళ్ల ప్రకాష్ అనే విశ్రాంత ఉద్యోగి భార్య పద్మ చికెన్ వండనని చెప్పడంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. పద్మ బయటకు వెళ్లిన సమయంలో ప్రకాష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.