Cricket: 5 ఓవర్లు.. 4 మెయిడెన్లు.. ఒక్క పరుగు..2 వికెట్లు.. వన్డే క్రికెట్‌లో సన్‌రైజర్స్‌ బౌలర్‌ సంచలనం

Australia vs New Zealand, 2nd ODI: ఆస్ట్రేలియా బౌలర్‌ సీన్‌ అబాట్‌ (Sean Abbott) వన్డే క్రికెట్‌లో సరికొత్త రికార్డు సృష్టించాడు. గురువారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను 5 ఓవర్లలో కేవలం ఒకే ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.

Cricket: 5 ఓవర్లు.. 4 మెయిడెన్లు.. ఒక్క పరుగు..2 వికెట్లు.. వన్డే క్రికెట్‌లో సన్‌రైజర్స్‌ బౌలర్‌ సంచలనం
Sean Abbott
Follow us

|

Updated on: Sep 09, 2022 | 6:41 PM

Australia vs New Zealand, 2nd ODI: ఆస్ట్రేలియా బౌలర్‌ సీన్‌ అబాట్‌ (Sean Abbott) వన్డే క్రికెట్‌లో సరికొత్త రికార్డు సృష్టించాడు. గురువారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను 5 ఓవర్లలో కేవలం ఒకే ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఏకంగా 4 మెయిడెన్లు ఉండడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో అతని ఎకానమీ రేటు 0.20 కావడం విశేషం. తద్వారా ప్రపంచ క్రికెట్‌లో అతి తక్కువ ఎకానమీని నమోదు చేసిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. కాగా ఈ మ్యాచ్‌లో ఆసీస్‌113 పరుగుల తేడాతో కివీస్‌పై విజయం సాధించింది.

అబాట్‌ విషయానికొస్తే.. 2014లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు ఆసీస్‌ తరఫున 6వన్డేలు ఆడి 5 వికెట్లు, 105 పరుగులు చేశాడు. అలాగే ఎనిమిది టీ20 మ్యాచ్‌ల్లో 5 వికెట్లు పడగొట్టాడు. ఇక గత ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు అబాట్‌. కాగా క్రికెట్ చరిత్రలో అత్యంత విషాదంగా ఆస్ట్రేలియా ప్లేయర్ ఫిలిప్ హ్యూస్ మరణం మిగిలిపోయింది. సీన్ అబాట్ వేసిన బౌన్సర్‌ తగిలే ఫిలిప్ హ్యూస్ ప్రాణాలొదిలాడు. అబాట్ ఉద్దేశపూర్వకంగా ఆ బౌన్సర్ వేయకున్నా.. నేరుగా హ్యూస్ మెడకు బలంగా తాకడంతో మైదానంలోనే కుప్పకూలిపోయాడు హ్యుస్‌. ఇది సీన్ అబాట్‌ను మానసికంగా ఇబ్బంది పెట్టింది. కొన్నాళ్లపాటు క్రికెట్‌కు కూడా దూరమయ్యాడు. అయితే ఆ తర్వాత కోలుకొని మళ్లీ మైదానంలోకి దిగాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..