AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat- Anushka: అనుష్క ఐరన్ లేడీ.. కోహ్లీ స్టీల్‌ మ్యాన్‌.. వైరలవుతోన్న పాక్‌ స్పీడ్‌స్టర్ వ్యాఖ్యలు..

Shoaib Akhtar: ఆసియాకప్‌ నుంచి టీమిండియా నిష్ర్కమించినా, కోహ్లీ మళ్లీ ఫామ్‌ అందుకోవడంతో భారత అభిమానులు తెగ సంబర పడిపోతున్నారు. గురువారం ఆఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను 122 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. సుమారు మూడేళ్ల తర్వాత అతని బ్యాట్‌ నుంచి ఈ సెంచరీ జాలువారింది.

Virat- Anushka: అనుష్క ఐరన్ లేడీ.. కోహ్లీ స్టీల్‌ మ్యాన్‌.. వైరలవుతోన్న పాక్‌ స్పీడ్‌స్టర్ వ్యాఖ్యలు..
Virat Anushka
Basha Shek
|

Updated on: Sep 09, 2022 | 5:58 PM

Share

Shoaib Akhtar: ఆసియాకప్‌ నుంచి టీమిండియా నిష్ర్కమించినా, కోహ్లీ మళ్లీ ఫామ్‌ అందుకోవడంతో భారత అభిమానులు తెగ సంబర పడిపోతున్నారు. గురువారం ఆఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను 122 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. సుమారు మూడేళ్ల తర్వాత అతని బ్యాట్‌ నుంచి ఈ సెంచరీ జాలువారింది. దీంతో ‘కింగ్‌ ఈజ్‌ బ్యాక్‌’, ‘వింటేజ్‌ విరాట్’ క్రికెట్‌ ఫ్యాన్స్‌ నెట్టింట్లో తెగ హడావిడి చేస్తున్నారు. వీరితో పాటు పలువురు క్రికెటర్లు కూడా కోహ్లీ ఆటతీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అందులో పాక్‌ జట్టుకు చెందిన ఆటగాళ్లు కూడా ఉన్నారు. హాసన్‌ అలీ, మహ్మద్‌ అమీర్‌, కమ్రాన్‌ ఆక్మల్‌, షోయబ్‌ అక్తర్‌ తదితర ఆటగాళ్లు సోషల్‌ మీడియా వేదికగా కోహ్లీకి కంగ్రాట్స్‌ తెలిపారు.

కోహ్లీ నువ్వొక వారియర్..

‘కంగ్రాట్స్‌ కోహ్లీ. నువ్వు ఒక గొప్ప యోధుడివి. వ్యక్తిగతంగానూ ఎంత మంచివాడివి. నువ్వు ఇలాగే ముందుకు సాగిపోవాలి. నీకు ఎల్లప్పుడూ నా మద్దతు ఉంటుంది. క్రికెట్ చరిత్రలో నువ్వు తప్పకుండా గుర్తుండిపోతావ్‌. మ్యాచ్‌ అనంతరం తన గడ్డు పరిస్థితుల్లో ఆమె మద్దతుగా నిలిచింది అని విరాట్ తన సతీమణి అనుష్క గురించి చెప్పడం చాలా బాగుంది. హ్యాట్సాఫ్‌ అనుష్క. అద్భుతం చేశావు. మీరు ఐరన్‌ లేడీ.. అలానే విరాట్ మ్యాన్‌ ఆఫ్‌ స్టీల్‌’ విరుష్క దంపతులపై ప్రశంసలు కురిపించాడు అక్తర్‌. కాగా గతంలోనూ పలుసార్లు కోహ్లీకి మద్దతుగా నిలిచాడు అక్తర్‌. ముఖ్యంగా పరుగులు చేయలేక సతమతమవుతున్నప్పుడు అతనికి బాసటగా నిలుస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈనేపథ్యంలో మరోసారి కోహ్లీ దంపతులపై ప్రశంసలు కురిపించి భారతీయ అభిమానుల మనసులు గెల్చుకున్నాడీ స్పీడ్‌స్టర్.

ఇవి కూడా చదవండి

మరిన్నిక్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..

విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!