Vande Mataram: వందేమాతరంపై రాజుకుంటున్న వివాదం!
భారతమాతను దుర్గ, సరస్వతి, లక్ష్మి దేవతలతో పోల్చే చరణాలను తప్పకుండా పాడాల్సిందే, వందేమాతరం గేయాన్ని సంపూర్ణంగా ఆలపించాల్సిందే.. జాతీయ ప్రార్థన గీతాలాపనకు సంబంధించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన కీలక ఉత్తర్వులు ఇవి. ఎప్పుడో 1937లో చర్చ జరిగి, నానా రభస అయి, చివరికి మొదటి రెండు చరణాల దగ్గరే వందేమాతరాన్ని ముగించారో.. సరిగ్గా అక్కడి నుంచే కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం మరో చర్చకు దారి తీసింది. మిగిలిన ఆ నాలుగు చరణాలను సైతం ఆలపించాల్సిందే అంది. అదిగో అక్కడ మొదలైంది మళ్లీ రచ్చ. పాడాల్సిందేనని హిందూ వాదులు అంటుంటే.. అలా ఎలా పాడతాం అని ముస్లిం, క్రైస్తవ సంఘాలు అంటున్నాయ్. ఆ చరణాల్లోని భావమే ఈ మొత్తం వివాదానికి, మైనార్టీ వర్గం నుంచి వ్యతిరేకతకు కారణం. అసలు వందేమాతరం గేయంలో ఏముంది? ఆ నాలుగు పాదాలకు అర్థమేంటి? 1937లో జరిగిందేంటి, ఇప్పుడు జరుగుతున్న వివాదమేంటి?

గాడ్ సేవ్ ద కింగ్ అనేది బ్రిటిష్ ప్రార్థనాగీతం. దాన్ని భారత జాతీయ గేయంగా ప్రకటించాలని బ్రిటిషర్స్ ప్రయత్నిస్తున్న సమయం. ఆ వార్త బంకిమ్‌చంద్ర ఆవేశానికి ఆజ్యం పోసింది. పెల్లుబికిన ఆ ఆగ్రహమే.. ఆయన కలం నుంచి పాట రూపంలో జాలువారింది. అదే వందేమాతరం గేయం అయింది. అదే.. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సమస్త జాతినీ ఒక్కటి చేసింది. ఆ సమర నినాదానికి సరిగ్గా 150 ఏళ్లు పూర్తైన సమయంలో ఓ వివాదం రాజుకుంది. ఎందుకని? 2026 జనవరి 28.. వందేమాతరం గీతాన్ని పూర్తి స్థాయిలో.. అంటే మొత్తం ఆరు చరణాలు పాడాల్సిందేనని.. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు ఇచ్చిన రోజు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కొత్త ప్రోటోకాల్ ప్రకారం.. అధికారికంగా ఈ ఆరు చరణాలను నిర్ణీత రాగంలో ఆలపించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ‘రాగ్ దేశ్’ రాగంలోప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో, మిలిటరీ బ్యాండ్‌లలో వాడుతున్నారు. కొత్త నిబంధనల ప్రకారం.. మొత్తం ఆరు చరణాల పూర్తి వెర్షన్‌ను కూడా ఇదే రాగంలో, సుమారు 3 నిమిషాల 10 సెకన్ల వ్యవధిలో ఆలపించాలి. వందేమాతరం పాడటానికి సంబంధించి ప్రభుత్వం మొదటిసారిగా ఒక అధికారిక ప్రోటోకాల్ కూడా ఖరారు చేసింది. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో జాతీయ గీతం అయిన జనగణమన, జాతీయ గేయం అయిన వందేమాతరం రెండింటినీ ఆలపించేటప్పుడు.. ముందుగా వందేమాతరం పాడాలి. ఆ తర్వాతే జనగణమన పాడాలని కేంద్రం స్పష్టం చేసింది. వందేమాతరం పాడుతున్నప్పుడు లేదా...
