AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akshaya Tritiya 2026: అక్షయ తృతీయ 2026.. బంగారం కొనుగోలుకు ముహూర్తం ఎప్పుడు? ఏయే సమయాల్లో!

Akshaya Tritiya 2026: భారతీయ హిందూ సంప్రదాయంలో అక్షయ తృతీయకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో అక్షయ తృతీయ వేడుకలు జరగనున్నాయి. ఈ పవిత్రమైన రోజున లక్ష్మీదేవి అనుగ్రహం కోసం, సంపద వృద్ధి చెందాలని ప్రతి ఒక్కరూ ఎంతో కొంత బంగారం కొనాలని ఆశిస్తారు. అయితే అక్షయ తృతీయ ఏ రోజున వస్తుంది? బంగారం కొనాలంటే ఏయే సమయంలో కొంటే మంచిదో పూర్తి వివరాలు తెలుసుకుందాం...

Akshaya Tritiya 2026: అక్షయ తృతీయ 2026.. బంగారం కొనుగోలుకు ముహూర్తం ఎప్పుడు? ఏయే సమయాల్లో!
Akshaya Tritiya 2026
Subhash Goud
|

Updated on: Apr 04, 2026 | 9:46 AM

Share

Akshaya Tritiya 2026: హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన రోజుల్లో అక్షయ తృతీయ ఒకటి. వైశాఖ మాసంలోని శుక్ల పక్ష తృతీయ తిథి నాడు జరుపుకునే ఈ పండుగను ‘అఖా తీజ్’ అని కూడా పిలుస్తారు. ‘అక్షయ’ అంటే ఎప్పటికీ తరిగిపోనిది అని అర్థం. ఈ రోజున చేసే జపం, దానం లేదా కొనుగోలు చేసే బంగారం శాశ్వతంగా వృద్ధి చెందుతాయని భక్తుల నమ్మకం.

అక్షయ తృతీయ 2026: ముఖ్యమైన తేదీ, సమయాలు:

  • 2026 సంవత్సరంలో అక్షయ తృతీయ ఏప్రిల్ 19, ఆదివారం నాడు వస్తోంది.
  • తృతీయ తిథి ప్రారంభం: ఏప్రిల్ 19, 2026 – ఉదయం 10:49 గంటలకు.
  • తృతీయ తిథి ముగింపు: ఏప్రిల్ 20, 2026 – ఉదయం 07:27 గంటలకు.
  • అక్షయ తృతీయ పూజా ముహూర్తం: ఉదయం 10:49 నుండి మధ్యాహ్నం 12:34 వరకు (వ్యవధి: 1 గంట 45 నిమిషాలు).

బంగారం కొనుగోలుకు ఉత్తమ సమయం:

అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు చేయడం లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించడంతో సమానమని భావిస్తారు. బంగారం కొనుగోలు సమయం: ఏప్రిల్ 19 ఉదయం 10:49 నుండి ఏప్రిల్ 20 తెల్లవారుజామున 05:51 వరకు బంగారం కొనడానికి అత్యంత అనుకూలమైన సమయం.

ఇది కూడా చదవండి: Financial Alerts: ఒక్క పొరపాటుతో లక్షలు నష్టపోవచ్చు.. ఏప్రిల్ 5వ తేదీలోగా ఇది చేయండి!

అక్షయ తృతీయ విశిష్టత:

  • ఈ రోజుకు పురాణాల్లో ఎంతో ప్రాముఖ్యత ఉంది:
  • పరశురామ జయంతి: శ్రీమహావిష్ణువు ఆరవ అవతారమైన పరశురాముడు ఈ రోజే జన్మించారని నమ్ముతారు. సత్యయుగం, త్రేతాయుగం ఈ పవిత్ర తిథి నాడే ప్రారంభమయ్యాయని చెబుతారు.
  • బేరుడు శివుడిని ప్రసన్నం చేసుకుని, దేవతల ధనాగారానికి అధిపతిగా వరాన్ని పొందిన రోజు కూడా ఇదే. ఈ రోజున ఎటువంటి ప్రత్యేక ముహూర్తాలు చూడకుండానే వివాహాలు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు.

ఇది కూడా చదవండి: Gold Price Today: మళ్లీ అదే జోరు.. పరుగులు పెడుతున్న బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఏంతంటే..

ఈ రోజున ఏం చేయాలి?

పూజ: ఉదయం పవిత్ర స్నానం ఆచరించి, మహాలక్ష్మి, విష్ణుమూర్తిని పూజించడం వల్ల ఐశ్వర్యం సిద్ధిస్తుంది. అలాగే ఈ రోజున అన్నదానం, వస్త్రదానం లేదా పేదలకు సహాయం చేయడం వల్ల అక్షయమైన పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. కేవలం బంగారం మాత్రమే కాకుండా వెండి, ఇతర లోహపు వస్తువులు లేదా కొత్త వ్యాపారాలు ప్రారంభించడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది.

గమనిక: ఈ సమాచారం ప్రజల విశ్వాసాలు, దృక్ పంచాంగ్ ఆధారంగా అందిస్తున్నాము. ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు మీ పురోహితులను సంప్రదించగలరు.

Gold Price: వచ్చే ఏడాదిలో బంగారం, వెండి ధరలు ఎలా ఉండబోతున్నాయి? ఇప్పుడు పెట్టుబడి పెట్టడం లాభమా.. నష్టమా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
వద్దన్నా డబ్బే డబ్బు..ఈశాన్యంలో ఈ 3వస్తువుల పెడితే కోట్ల సంపద
వద్దన్నా డబ్బే డబ్బు..ఈశాన్యంలో ఈ 3వస్తువుల పెడితే కోట్ల సంపద
ఆటోలోనే ఆర్తనాదం.. వెనుతిరగబోతుండగా ట్విస్ట్!
ఆటోలోనే ఆర్తనాదం.. వెనుతిరగబోతుండగా ట్విస్ట్!
మీరు చేతులు కట్టుకునే విధానమే..మీ క్యారెక్టర్‌ ఎలాంటిదో చెప్తుంది
మీరు చేతులు కట్టుకునే విధానమే..మీ క్యారెక్టర్‌ ఎలాంటిదో చెప్తుంది
ఏజెంట్ల ద్వారా ట్రైన్‌ టికెట్స్‌ బుక్‌ చేస్తున్నారా?
ఏజెంట్ల ద్వారా ట్రైన్‌ టికెట్స్‌ బుక్‌ చేస్తున్నారా?
అర్ధరాత్రి దిండుతో కరెంట్ ఆఫీస్‌కు వచ్చిన మహిళ..!
అర్ధరాత్రి దిండుతో కరెంట్ ఆఫీస్‌కు వచ్చిన మహిళ..!
మూడు చిలుకలు కథ: కష్టపడి చేసే పనికి ఫలితం ఉంటుంది
మూడు చిలుకలు కథ: కష్టపడి చేసే పనికి ఫలితం ఉంటుంది
ఈ టాలీవుడ్ హీరో ఇండియాలోనే బిగ్గెస్ట్ జ్యూయెలరీ మాల్ ఓనర్
ఈ టాలీవుడ్ హీరో ఇండియాలోనే బిగ్గెస్ట్ జ్యూయెలరీ మాల్ ఓనర్
విరిగిన ఎముకలకు బలాన్నిచ్చే తమలపాకుల ఫిష్ ఫ్రై.. ఇంత రుచా..
విరిగిన ఎముకలకు బలాన్నిచ్చే తమలపాకుల ఫిష్ ఫ్రై.. ఇంత రుచా..
పదో తరగతి అర్హతతో అంగన్వాడీ కేంద్రాల్లో 230 ఉద్యోగాలు.. నో ఎగ్జాం
పదో తరగతి అర్హతతో అంగన్వాడీ కేంద్రాల్లో 230 ఉద్యోగాలు.. నో ఎగ్జాం
డీ-మార్ట్‌లో చౌకగా షాపింగ్ చేయడం ఎలా? ఎవ్వరికి తెలియని టిప్స్‌!
డీ-మార్ట్‌లో చౌకగా షాపింగ్ చేయడం ఎలా? ఎవ్వరికి తెలియని టిప్స్‌!