AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price: వచ్చే ఏడాదిలో బంగారం, వెండి ధరలు ఎలా ఉండబోతున్నాయి? ఇప్పుడు పెట్టుబడి పెట్టడం లాభమా.. నష్టమా?

Gold, Silver Prices: ప్రపంచ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, ఆర్థిక మార్పులు బంగారాన్ని ఒక 'సురక్షితమైన పెట్టుబడి'గా మార్చాయి. ధర తగ్గుతుందని ఎదురుచూసిన వారికి, నిరంతరం పెరుగుతున్న చార్టులు నిరాశనే మిగిలిస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్ - అమెరికా - ఇజ్రాయెల్ మధ్య..

Subhash Goud
|

Updated on: Apr 04, 2026 | 9:31 AM

Share
 Gold and Silver Price: బంగారం విక్రయించే ధరకు ఇకపై సామాన్యులు కొనగలరా?  ఇది నేడు ప్రతి భారతీయ కుటుంబంలో వినిపిస్తున్న ఆవేదన. ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ, ఇప్పుడే గరిష్ట స్థాయికి చేరుకున్నాయని చాలా మంది భావిస్తున్నారు. అయితే మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. స్వల్పకాలంలో విక్రయాల ఒత్తిడి ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

1 / 6
Gold Rate

Gold Rate

2 / 6
ముందస్తు అంచనాలు: ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ధర 1% పెరిగి సుమారు డాలర్‌ 4,717.82 వద్ద కొనసాగుతోంది. నిపుణుల దీర్ఘకాలిక అంచనాల ప్రకారం.. బంగారం రాబోయే కాలంలో డాలర్‌ 5,000 (భారత కరెన్సీలో సుమారు 4,64,892.50) మార్కును చేరుకోవచ్చు. ఇక వెండి పారిశ్రామిక అవసరాల రీత్యా దీని ధర డాలర్‌ 90 వైపు దూసుకుపోయే అవకాశం ఉంది. వచ్చే రెండు మూడు వారాల్లో ఇరాన్ యుద్ధం ఒక ముగింపునకు వస్తే, ఈక్విటీ మార్కెట్లు పుంజుకోవచ్చు. అప్పుడు బంగారంపై పెట్టుబడి డిమాండ్ తాత్కాలికంగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

3 / 6
వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం: బంగారం ఎప్పుడూ ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా ఒక మంచి రక్షణ కవచం (Hedging) గా పనిచేస్తుంది. సాధారణంగా వడ్డీ రేట్లు తగ్గితే బంగారం ధరలు పెరుగుతాయి. యుద్ధం కారణంగా వడ్డీ రేట్ల తగ్గింపు వాయిదా పడినప్పటికీ, శాంతి చర్చలు సఫలమైతే.. భవిష్యత్తులో వడ్డీ రేట్లు తగ్గే ఛాన్స్ ఉంది. ఇది బంగారం ధరలకు మరింత మద్దతునిస్తుంది. అంతేకాకుండా వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు నిరంతరం బంగారాన్ని కొనుగోలు చేస్తూ నిల్వ చేసుకుంటున్నాయి. ఇది ధరలు పడిపోకుండా కాపాడుతోంది.

4 / 6
పెట్టుబడిదారులకు 'మాస్టర్ ప్లాన్': ఇలాంటి అస్థిరమైన మార్కెట్ పరిస్థితుల్లో పెట్టుబడిదారులు అనుసరించాల్సిన వ్యూహాలు ఉన్నాయి. మీ మొత్తం పెట్టుబడిని ఒకే చోట పెట్టకుండా, బంగారం, వెండి మధ్య విభజించండి. ప్రస్తుతం శాంతి చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ ఇవి విఫలమైతే ధరలు మళ్ళీ పెరగొచ్చు. అందుకే ధరలు స్వల్పంగా తగ్గినప్పుడు కొనుగోలు చేయడం (Buy on dips) మంచి వ్యూహం. స్పల్పకాలిక హెచ్చుతగ్గులను చూసి భయపడకుండా, కనీసం 1 నుండి 3 ఏళ్ల కాలపరిమితితో పెట్టుబడి పెట్టడం లాభదాయకం.

5 / 6
బంగారం, వెండి ధరలు అనేవి అంతర్జాతీయ పరిణామాలు, వడ్డీ రేట్లు, రాజకీయ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతానికి ధరలు ఎక్కువగా ఉన్నట్లు అనిపించినా, దీర్ఘకాలంలో ఇవి మరింత పెరిగే సూచనలే కనిపిస్తున్నాయి. అందుకే పద్ధతి ప్రకారం పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి లాభాలను ఆర్జించవచ్చు. (డిస్క్లైమర్: ఈ వ్యాసంలోని సమాచారం అవగాహన కోసం మాత్రమే. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు సర్టిఫైడ్ ఆర్థిక సలహాదారుని సంప్రదించడం శ్రేయస్కరం.)

6 / 6
Follow Us