AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NED : ట్వంటీ20 వరల్డ్ కప్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా

IND vs NED : టీ20 వరల్డ్ కప్ 2026లో గ్రూప్ స్టేజ్ చివరి అంకానికి చేరుకుంది. ఇప్పటికే వరుసగా మూడు విజయాలతో అజేయంగా నిలిచి, సూపర్‌-8 బెర్తును ఖరారు చేసుకున్న టీమిండియా.. బుధవారం తన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో తలపడుతోంది.

IND vs NED : ట్వంటీ20 వరల్డ్ కప్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా
Ind Vs Ned
Rakesh
|

Updated on: Feb 18, 2026 | 7:42 PM

Share

IND vs NED : టీ20 వరల్డ్ కప్ 2026లో గ్రూప్ స్టేజ్ చివరి అంకానికి చేరుకుంది. ఇప్పటికే వరుసగా మూడు విజయాలతో అజేయంగా నిలిచి, సూపర్‌-8 బెర్తును ఖరారు చేసుకున్న టీమిండియా.. బుధవారం తన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో తలపడుతోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ పోరులో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. సూపర్‌-8లో సౌతాఫ్రికా వంటి బలమైన జట్టుతో తలపడనున్న నేపథ్యంలో ఈ మ్యాచ్‌ను భారత్ ఒక ప్రాక్టీస్ సెషన్‌లా భావిస్తోంది. మరోవైపు ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన నెదర్లాండ్స్.. పటిష్టమైన భారత్‌ను ఓడించి గౌరవప్రదంగా ఇంటికి వెళ్లాలని చూస్తోంది.

ఈ మ్యాచ్ ముఖ్యంగా టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మకు చావోరేవో లాంటిది. ఈ వరల్డ్ కప్‌లో ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌ల్లో అతను ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. పాకిస్థాన్, అమెరికా వంటి జట్లతో జరిగిన కీలక పోరుల్లో అభిషేక్ కనీసం ఖాతా తెరవకుండానే (డకౌట్) పెవిలియన్ చేరాడు. సూపర్‌-8లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలంటే నెదర్లాండ్స్‌పై భారీ స్కోరు సాధించడం అతనికి ఎంతో ముఖ్యం. అహ్మదాబాద్ పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది కాబట్టి, అభిషేక్ తన పాత ఫామ్‌ను అందిపుచ్చుకుంటాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా ఫీల్డింగ్‌లో ఒక అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. టీ20ల్లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన భారతీయుడిగా రోహిత్ శర్మ (65 క్యాచ్‌లు) పేరిట ఉన్న రికార్డును అధిగమించేందుకు హార్దిక్ (63 క్యాచ్‌లు)కు మరో మూడు క్యాచ్‌లు మాత్రమే అవసరం. చరిత్ర పరంగా చూస్తే భారత్ నెదర్లాండ్స్ జట్లు అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు నాలుగు సార్లు తలపడగా.. ఆ నాలుగు సార్లూ టీమిండియానే విజయం వరించింది. 100 శాతం విన్నింగ్ రికార్డుతో ఉన్న భారత్, ఈ మ్యాచ్‌లోనూ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. అహ్మదాబాద్ స్టేడియంలో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉన్నందున, అభిమానులకు పరుగుల విందు ఖాయమనిపిస్తోంది. సూపర్‌-8 రౌండ్‌కు వెళ్లే ముందు భారత్ తన విజయ పరంపరను ఇలాగే కొనసాగించాలని పట్టుదలగా ఉంది.

ఇండియా (ప్లేయింగ్ XI): ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్

నెదర్లాండ్స్ (ప్లేయింగ్ XI): మైఖేల్ లెవిట్, మాక్స్ ఓ డౌడ్, బాస్ డి లీడే, కాలిన్ అకెర్మాన్, స్కాట్ ఎడ్వర్డ్స్ (వికెట్ కీపర్), జాక్ లియాన్-కాచెట్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, లోగాన్ వాన్ బీక్, ఆర్యన్ దత్, కైల్ క్లీన్, నోహ్ క్రాస్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us