తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్య దృష్ట్యా ప్రభుత్వం ఒంటిపూట బడులను ప్రకటించింది. మార్చి 16 నుండి ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు జరుగుతాయి. ఈ సమయంలో మధ్యాహ్న భోజనం కూడా అందిస్తారు. వేసవి సెలవులు ఏప్రిల్ 24న ప్రారంభమై జూన్ 11 వరకు కొనసాగుతాయి.