AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Abhishek Sharma : అమెరికా, పాక్, ఇప్పుడు నెదర్లాండ్స్..హ్యాట్రిక్ డకౌట్..అభిషేక్ శర్మ కెరీర్‎కు ఫుల్ స్టాప్ పడ్డట్లేనా ?

Abhishek Sharma : నెదర్లాండ్స్‌తో అహ్మదాబాద్‌లో జరిగిన లీగ్ మ్యాచ్‌లోనూ అతను ఖాతా తెరవకుండానే వెనుదిరగడంతో, వరల్డ్ కప్‌లో హ్యాట్రిక్ డకౌట్ల చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఈ టోర్నీలో అభిషేక్ ప్రయాణం ఏమాత్రం ఆశాజనకంగా లేదు. నెదర్లాండ్స్‎తో జరుగుతున్న మ్యాచ్‌లోనైనా పరుగులు సాధిస్తాడనుకుంటే, మళ్ళీ అదే పాత కథ రిపీట్ చేస్తూ వరుసగా మూడోసారి డకౌట్ అయ్యాడు.

Abhishek Sharma : అమెరికా, పాక్, ఇప్పుడు నెదర్లాండ్స్..హ్యాట్రిక్ డకౌట్..అభిషేక్ శర్మ కెరీర్‎కు ఫుల్ స్టాప్ పడ్డట్లేనా ?
Abhishek Sharma
Rakesh
|

Updated on: Feb 18, 2026 | 7:14 PM

Share

Abhishek Sharma :టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 స్థానంలో ఉన్నప్పటికీ, మైదానంలో మాత్రం అతను వరుస డకౌట్లతో సతమతమవుతున్నాడు. తాజాగా నెదర్లాండ్స్‌తో అహ్మదాబాద్‌లో జరిగిన లీగ్ మ్యాచ్‌లోనూ అతను ఖాతా తెరవకుండానే వెనుదిరగడంతో, వరల్డ్ కప్‌లో హ్యాట్రిక్ డకౌట్ల చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఈ టోర్నీలో అభిషేక్ ప్రయాణం ఏమాత్రం ఆశాజనకంగా లేదు. అమెరికాపై టోర్నీ తొలి మ్యాచ్‌లోనే ఎదుర్కొన్న మొదటి బంతికే (గోల్డెన్ డక్) అవుట్ అయ్యాడు. నమీబియాపై అనారోగ్యం (కడుపులో ఇన్ఫెక్షన్) కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. పాకిస్థాన్‌పై రీఎంట్రీ ఇచ్చినా పాక్ బౌలర్ల ధాటికి మళ్ళీ సున్నా పరుగులకే వెనుదిరిగాడు.నెదర్లాండ్స్‎తో జరుగుతున్న మ్యాచ్‌లోనైనా పరుగులు సాధిస్తాడనుకుంటే, మళ్ళీ అదే పాత కథ రిపీట్ చేస్తూ వరుసగా మూడోసారి డకౌట్ అయ్యాడు.

ఐపీఎల్ 2024, 2025 సీజన్లలో విధ్వంసకర బ్యాటింగ్‌తో భారత జట్టులోకి దూసుకొచ్చిన ఈ యువ సంచలనం, తన మొదటి వరల్డ్ కప్‌లో మాత్రం తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాడా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రవిశాస్త్రి వంటి దిగ్గజాలు అతనికి అండగా నిలుస్తూ కొంచెం సమయం ఇవ్వాలని చెబుతున్నప్పటికీ, సూపర్‌-8 వంటి కీలక దశ ముందు ఇలాంటి ఫామ్ ఆందోళన కలిగించే విషయమే. హార్డ్ హిట్టర్ అనే ట్యాగ్ ఉన్నప్పటికీ, క్రీజులో కనీసం నిలదొక్కుకోలేకపోవడం అతని కెరీర్‌కు గండంగా మారుతోంది.

సూపర్‌-8లో భారత్ తన మొదటి పోరులో పటిష్టమైన సౌతాఫ్రికాతో తలపడనుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో టీమ్ మేనేజ్మెంట్ అభిషేక్‌పై నమ్మకం ఉంచుతుందా? లేక సంజూ శామ్సన్ వంటి సీనియర్ ఆటగాడిని ఓపెనర్‌గా పంపి ప్రయోగాలు చేస్తుందా? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఒకవేళ సూపర్‌-8లోనూ ఇదే ఆట కొనసాగితే, అభిషేక్ శర్మ కెరీర్ ప్రమాదంలో పడినట్లేనని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఢిల్లీలో బెస్ట్ ఫ్రెండ్స్.. స్టేట్స్‌లో బిగ్గెస్ట్ ఎనిమీస్!
ఢిల్లీలో బెస్ట్ ఫ్రెండ్స్.. స్టేట్స్‌లో బిగ్గెస్ట్ ఎనిమీస్!
ఈ కూరగాయతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..కంటి చూపు నుండి మధుమేహం వరకు
ఈ కూరగాయతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..కంటి చూపు నుండి మధుమేహం వరకు
తమిళనాడులో ఉచితాల వేలం పాట.. టాప్‌లో విజయ్.. ప్రజలకు వరాల వర్షం..
తమిళనాడులో ఉచితాల వేలం పాట.. టాప్‌లో విజయ్.. ప్రజలకు వరాల వర్షం..
ఈ సినిమా నేను చేయ్యను అని చెప్పా... కానీ..515 రోజులు ఆడింది..
ఈ సినిమా నేను చేయ్యను అని చెప్పా... కానీ..515 రోజులు ఆడింది..
ఆస్కార్ కొరియోగ్రాఫర్ కు అరుదైన గౌరవం.. మైఖేల్ జాక్సన్ తాలూకా..!
ఆస్కార్ కొరియోగ్రాఫర్ కు అరుదైన గౌరవం.. మైఖేల్ జాక్సన్ తాలూకా..!
హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని యాంకరమ్మ..
హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని యాంకరమ్మ..
మరణించే ముందు మనిషిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి! గరుడ పురాణంలో
మరణించే ముందు మనిషిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి! గరుడ పురాణంలో
షణ్ముఖ్ చేతిపై దీపు టాటూ.. కాబోయే భార్య చూసి ఏమన్నదంటే?
షణ్ముఖ్ చేతిపై దీపు టాటూ.. కాబోయే భార్య చూసి ఏమన్నదంటే?
సింహం పంజా పవర్ ఎట్టుంటుందో తెల్సా..
సింహం పంజా పవర్ ఎట్టుంటుందో తెల్సా..
రూ.400 కోట్లతో నిర్మించిన సినిమా.. దెబ్బకు ఓటీటీ క్రాష్ అయ్యింది.
రూ.400 కోట్లతో నిర్మించిన సినిమా.. దెబ్బకు ఓటీటీ క్రాష్ అయ్యింది.