Australian Cricket Team: ఆరోన్ ఫించ్ తర్వాత ఆస్ట్రేలియా వన్డే కెప్టెన్.. అగ్రస్థానంలో ఉన్నది ఎవరంటే?
Venkata Chari |
Updated on: Sep 10, 2022 | 4:07 PM
ఆరోన్ ఫించ్ ఆదివారం న్యూజిలాండ్‌తో తన చివరి వన్డే ఆడనున్నాడు. ఆపై ఈ ఫార్మాట్‌కు వీడ్కోలు పలుకుతాడు. దీని తర్వాత, ఆస్ట్రేలియా తదుపరి వన్డే కెప్టెన్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది.
Sep 10, 2022 | 4:07 PM
వన్డే క్రికెట్‌కు ఆరోన్ ఫించ్ వీడ్కోలు పలికాడు. ఈ ఫార్మాట్‌లో తన చివరి మ్యాచ్‌ను ఆదివారం ఆడనున్నాడు. అతను ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో ఆడనున్నాడు. ఫించ్ టీ20లో కొనసాగి జట్టుకు సారథ్యం వహిస్తున్నప్పటికీ, వన్డేల్లో అతని స్థానంలో ఎవరు ఉంటారనే దానిపై స్పష్టత లేదు. ఫించ్ తర్వాత ఆస్ట్రేలియా వన్డే జట్టు కెప్టెన్సీని చేపట్టగల ఆటగాళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
1 / 5
ఈ క్రమంలో పాట్ కమిన్స్ ముందంజలో ఉన్నాడు. ఆస్ట్రేలియా టెస్టు జట్టుకు కమిన్స్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఇటువంటి పరిస్థితిలో, అతను వన్డే జట్టుకు కెప్టెన్ కావడానికి బలమైన పోటీదారు. అతని కెప్టెన్సీలో ఆస్ట్రేలియా ఇప్పటి వరకు టెస్టుల్లో రాణించడమే ఇందుకు ఒక కారణం.
2 / 5
ఫించ్ స్థానంలో స్టీవ్ స్మిత్ మరొక ఎంపిక. గతంలో కూడా స్మిత్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించినప్పటికీ బాల్ ట్యాంపరింగ్ వివాదం కారణంగా వైదొలగాల్సి వచ్చింది. CA అతనిపై కెప్టెన్సీ నిషేధాన్ని కూడా విధించింది. అది ఇప్పుడు ఎత్తివేశారు. స్మిత్ టెస్టుల్లో జట్టుకు వైస్ కెప్టెన్. పాత అనుభవం ఆధారంగా అతను ఈ రేసులో ముందుంటాడు.
3 / 5
జట్టుకు నాయకత్వం వహించగల మరో పేరు గ్లెన్ మాక్స్‌వెల్. అతను జట్టులో అనుభవజ్ఞుడైన ఆటగాడు. ఫ్రాంచైజీ క్రికెట్‌లో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం కూడా అతనికి ఉంది.
4 / 5
అలెక్స్ కారీ కూడా ఫించ్ స్థానంలో మరొక పేరు. వెస్టిండీస్ సిరీస్‌లో ఫించ్ గాయపడినప్పుడు కారీ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. అతని కెప్టెన్సీలో ఆస్ట్రేలియా సిరీస్‌ను గెలుచుకుంది.