AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uttar Pradesh: ఇంకా ఎన్నాళ్లీ దౌర్భాగ్యం.. టార్చ్ లైట్ల వెలుగులోనే రోగులకు చికిత్స.. వైరలవుతున్న వీడియో

ఇదిలా ఉంటే, జనరేటర్ కోసం బ్యాటరీలను సిద్దం చేస్తున్నందున ఆపరేషన్‌ టైమ్‌లోనూ కరెంట్‌ లేకుండా పోయిందని, దాంతో 15-20 నిమిషాలపాటు మాత్రమే విద్యుత్‌ ఆటంకం ఏర్పడిందంటూ అధికారులు చెప్పుకొచ్చారు.

Uttar Pradesh: ఇంకా ఎన్నాళ్లీ దౌర్భాగ్యం.. టార్చ్ లైట్ల వెలుగులోనే రోగులకు చికిత్స.. వైరలవుతున్న వీడియో
Mobile Torch Light
Jyothi Gadda
|

Updated on: Sep 12, 2022 | 12:25 PM

Share

Uttar Pradesh: మొబైల్‌ ఫోన్‌ టర్చ్‌.. కేవలం చీకట్లో వెలుగులు నింపడానికి మాత్రమే కాదు..అత్యవసర పరిస్థితిల్లో రోగులకు వైద్యం అందించడానికి కూడా ఉపయోగపడుతున్నాయి. ఇలాంటి ఘటనలు తరచూ ఎక్కడో ఓ చోట జరుగుతూనే ఉన్నాయి. సోషల్ మీడియా ఆధారంగా అలాంటి సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి వైరల్‌ అవుతోంది. ఉత్తరప్రదేశ్ జిల్లాలోని ఒక ఆసుపత్రి చీకటిలో మునిగిపోయింది. అయితే వైద్యులు మొబైల్ టార్చ్ లైట్ల కింద రోగులను పరీక్షించాల్సి వచ్చింది. ఇప్పుడు ఇదే వీడియో సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది.

ఉత్తరప్రదేశ్‌లోని బలియా జిల్లాలోని ఆసుపత్రిలో నిన్న భారీ వర్షం కారణంగా విద్యుత్ కోత ఏర్పడింది. రోగులు గంటల తరబడి చీకట్లోనే ఉండాల్సి వచ్చింది. దాంతో చేసేది లేక వైద్యులు చీకట్లో మొబైల్‌ ఫోన్లు టార్చ్‌ లైట్లు ఆన్ చేసుకుని రోగులకు వైద్యం అందించారు. ఈ మేరకు అందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది. వీడియోలో స్ట్రెచర్‌పై ఒక మహిళ పేషెంట్‌ ఉంది. ఆమె చుట్టూ వైద్యుల బృందం కనిపిస్తుంది. అందుంలో ఒక డాక్టర్‌ ఆమెను పరీక్షిస్తున్నప్పుడు మరో వ్యక్తి వెలుతురు కోసం మొబైల్ ఫోన్‌ పట్టుకుని ఉన్నాడు. వారంతా ఆ టార్చ్‌లైట్‌ వెలుగులోనే మహిళకు చికిత్స చేశారు.

ఇదిలా ఉంటే, జనరేటర్ కోసం బ్యాటరీలను సిద్దం చేస్తున్నందున ఆపరేషన్‌ టైమ్‌లోనూ కరెంట్‌ లేకుండా పోయిందని, దాంతో 15-20 నిమిషాలపాటు మాత్రమే విద్యుత్‌ ఆటంకం ఏర్పడింది ..అని జిల్లా ఆసుపత్రిలో ఆర్థోపెడిక్ సర్జన్, చీఫ్ ఇన్ ఛార్జి డాక్టర్ ఆర్‌డి రామ్ ఏం జరిగిందో వివరించారు. ఆసుపత్రిలో బ్యాకప్ కోసం జనరేటర్ ఉందని, అయితే బ్యాటరీలను పొందడానికి సమయం పట్టిందని ఆయన పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

వైరల్‌ అవుతున్న వీడియోకి నెటిజన్లు పలు రకాల ప్రశ్నలు వేస్తున్నారు. అందుకు ఆస్పత్రి వర్గాలు సమాధానం చెబుతూ…జనరేటర్‌లో బ్యాటరీ ఎందుకు లేకుండా పోయిందని ప్రశ్నించగా.. బ్యాటరీలు చోరీకి గురవుతాయనే భయం ఎప్పుడూ ఉంటుందని, అందుకే వాటిని తొలగిస్తున్నామని చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి