Sonali Phogat: సోనాలీ ఫోగట్ కేసులో కీలక మలుపు.. సీబీఐ విచారణకు ఆదేశాలు.. అధికారిక ఉత్తర్వులు జారీ

బిగ్ బాస్ ఫేమ్, బీజేపీ నాయకురాలు సోనాలి ఫోగట్ (Sonali Phogat) హత్య కేసును సీబీఐ విచారణకు అప్పగిస్తూ గోవా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రీప్లాన్డ్ మర్డర్ అని సీసీ ఫుటేజ్ ప్రకారం గోవా పోలీసులు నిర్ధరించారు. ఈ కేసును...

Sonali Phogat: సోనాలీ ఫోగట్ కేసులో కీలక మలుపు.. సీబీఐ విచారణకు ఆదేశాలు.. అధికారిక ఉత్తర్వులు జారీ
Sonali Pogat
Follow us
Ganesh Mudavath

|

Updated on: Sep 12, 2022 | 12:51 PM

బిగ్ బాస్ ఫేమ్, బీజేపీ నాయకురాలు సోనాలి ఫోగట్ (Sonali Phogat) హత్య కేసును సీబీఐ విచారణకు అప్పగిస్తూ గోవా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రీప్లాన్డ్ మర్డర్ అని సీసీ ఫుటేజ్ ప్రకారం గోవా పోలీసులు నిర్ధరించారు. ఈ కేసును సీబీఐ విచారణకు అప్పగించాలని సోనాలి కుమార్తె ప్రభుత్వాన్ని కోరారు. ఆమె విజ్ఞప్తిని అంగీకరించిన గోవా సీఎం సీబీఐ విచారణకు ఆదేశించారు. కాగా.. 23వ తేదీలోగా ప్రభుత్వం సీబీఐ (CBI) విచారణ జరిపించకుంటే 24న ఖాప్ పంచాయతీ జాట్ ధర్మశాలలో మరోసారి విచారణ చేపడతామని సోనాలి ఫోగట్ కుమార్తె హెచ్చరించారు. అంతే కాకుండా తమకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఎస్పీ నివాసానికి చేరుకున్నారు. సోనాలి కూతురు యశోధర, కేసును వాదిస్తున్న వారికి రక్షణ కల్పించాలని కోరారు. దీంతో యశోధరకు రక్షణ కల్పించేందుకు ఇద్దరు పోలీసులను ప్రభుత్వం నియమించింది. సోనాలి ఫోగట్ అనుమానాస్పద మృతి కేసుపై విచారణ జరిపేందుకు రాతపూర్వకంగా సీబీఐ విచారణకు డిమాండ్ చేశామని, కానీ మొదట గోవా పోలీసులు దర్యాప్తు చేస్తారని చెప్పారు. ప్రభుత్వ తీరుపై సంతృప్తి చెందకపోతే కేసును సీబీఐకి అప్పగిస్తామని స్పష్టం చేశారు. ఈ క్రమంలో తాజాగా కేసు విచారణను సీబీఐకు అప్పగిస్తూ ఆదేశాలివ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.

సోనాలి ఫోగట్ మృతి కేసులో నిందితులు సుధీర్ సంగ్వాన్, సుఖ్‌విందర్‌లను రెండు రోజుల రిమాండ్ తర్వాత గోవా పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. అక్కడి నుంచి కోర్టు వారిద్దరినీ జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. హత్యకు గల కారణాలను గోవా పోలీసులు ఇంకా వెల్లడించలేదు. రిమాండ్ సమయంలో గోవా పోలీసుల ఇద్దరు సభ్యుల బృందం హర్యానాకు వచ్చింది. రిమాండ్‌ పూర్తికావడంతో పోలీసులు వారికి మళ్లీ రెండు రోజుల రిమాండ్‌కు తరలించారు. ఇప్పుడు కోర్టు వారిద్దరినీ జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. కాగా.. సోనాలి ఫోగట్ సన్నిహితులు ఆమెకు విష పదార్థాలు ఇచ్చి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆమెతో బలవంతంగా కెమికల్స్ ను తాగించిన తర్వాత స్పృహ కోల్పోయినట్లు వెల్లడించారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరుగుతోందని, సుధీర్ సగ్వాన్‌, సుఖ్విందర్ వాసీలపై హత్యానేరం కింద కేసులు నమోదు చేసినట్లు వివరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి